వాస్తవ క్షేత్రస్థితి రేఖ
సియాచెన్ హిమానీనదం ప్రాంతంలో భారత పాకిస్తాన్ దళాల ప్రస్తుత స్థానాలను వేరుచేసే రేఖను వాస్తవ క్షేత్రస్థితి రేఖ - యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (AGPL) అంటారు.[1][2] ఈ రేఖ నియంత్రణ రేఖఉత్తర కొన నుండి మొదలై ఇందిరా కల్ వరకూ ఉంటుంది. ఈ రేఖ సుమారు 110 కి.మీ. పొడవు ఉంటుంది.[3][4]
చరిత్ర
[మార్చు]1949 లో చేసుకున్న కరాచీ ఒప్పందం గాని, 1972 నటి సిమ్లా ఒప్పందం గానీ నియంత్రణ రేఖను ఎన్‌జె9842 వరకే నిర్వచించాయి. అక్కడి నుండి తూర్పుగా చైనా సరిహద్దు వరకూ ఉన్న ప్రాంతంలో ఈ రేఖను గుర్తించలేదు. ఇది సియాచెన్ ఘర్షణకు దారితీసింది. 1984 ఏప్రిల్లో మొదలైన ఈ ఘర్షణలో భారత్, ఆపరేషన్ మేఘదూత్ జరిపి సియాచెన్ హిమానీనాన్ని నియంత్రణ లోకి తెచ్చుకుంది.
భౌగోళిక స్థానం
[మార్చు]ఈ రేఖ సాల్టోరో రిడ్జి మీదుగా వెళ్తుంది. ఈ ప్రాంతం 7000 మీ. ఎత్తున్న శిఖరాలతో కూడిన పర్వత ప్రాంత పీఠభూమి. భారత సైన్యం ఈ శిఖరాల మీద ఉండి పాకిస్తాను సైన్యం సాల్టోరో శ్రేణి శిఖరాలను ఎక్కకుండా నిరోధిస్తుంది. ఈ రేఖ ప్రస్తుతం కింది మార్గాన్ని అనుసరించి ఉంటుంది:
ఇందిరా కల్ - సియా లా కనుమ - సాల్టోరో కాంగ్రి 1 - బిలాఫోల్డ్ లా కనుమ - కె12 - గ్యోంగ్ లా కనుమ - NJ9842[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The fight for Siachen
- ↑ "Archived copy". Archived from the original on 2015-04-12. Retrieved 2017-08-21.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ They shall not pass
- ↑ "Bullish on siachen". Archived from the original on 2014-02-22. Retrieved 2017-08-21.
- ↑ "Manning the Siachen Glacier". Bharat Rakshak Monitor. 2003. Archived from the original on 2012-06-14. Retrieved 2017-08-21.