అక్షాంశ రేఖాంశాలు: 35°39′52″N 76°47′52″E / 35.6644°N 76.7978°E / 35.6644; 76.7978

ఇందిరా కల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందిరా కల్
పశ్చిమ ఇందిరా కల్, ప్రధాన ఇందిరా కల్
ఇందిరా కల్ is located in Karakoram
ఇందిరా కల్
ఇందిరా కల్
కారకోరం ప్రాంతం మ్యాపులో ఇందిరా కల్ స్థానం
ఇందిరా కల్ is located in Ladakh
ఇందిరా కల్
ఇందిరా కల్
ఇందిరా కల్ (Ladakh)
ఇందిరా కల్ is located in India
ఇందిరా కల్
ఇందిరా కల్
ఇందిరా కల్ (India)
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,764 m (18,911 ft)
ప్రదేశంచైనా నియంత్రణలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్టుకు, సియాచెన్ హిమానీనదానికీ మధ్య ఉన్న సరిహద్దులో.[1]
శ్రేణిపశ్చిమ కారకోరం శ్రేణి
Coordinates35°39′52″N 76°47′52″E / 35.6644°N 76.7978°E / 35.6644; 76.7978
పటం

పశ్చిమ ఇందిరా కల్, సముద్ర మట్టం నుండి 5,988 మీటర్లు (19,646 అ.) ఎత్తున, కారాకోరం శ్రేణిలోని సియాచిన్ ముజ్తాగ్ వద్ద, ఇందిరా రిడ్జ్‌పై ఉన్న కల్ [గమనిక 1] లేదా కనుమ మార్గం. ఇది భారత భూభాగం లోని సియాచిన్ హిమానీనదం, చైనా నియంత్రణలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌ల మధ్య సరిహద్దులో ఉంది. ఇది భారతదేశం, పాకిస్తాన్, చైనా ల ట్రై పాయింట్‌కి దగ్గరగా ఉంది. సియాచిన్ ప్రాంతంలోని ఇండియా-పాకిస్థాన్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (AGPL) ఈ కనుమ దగ్గరే ముగుస్తుంది. [2] [3] [4] [5] చైనా, భారతదేశాల నియంత్రణలో ఉన్న ఉత్తర, దక్షిణ వైపులు రెండిటి నుండి ఈ కనుమను అధిరోహించడం సాధ్యమవుతుంది. [6]

తూర్పు ఇందిరా కల్ (35°39′40″N 76°48′10″E / 35.66111°N 76.80278°E / 35.66111; 76.80278 ) అనేది, [7] ఇందిరా రిడ్జ్‌పై, పశ్చిమ ఇందిరా కల్ నుండి 2.4 కి.మీ తూర్పున, సముద్ర మట్టం నుండి 5,764 మీటర్లు (18,911 అ.) ఎత్తున ఉన్న మరొక కల్. దీన్ని మెయిన్ ఇందిరా కల్ అనీ, ఇందిరా కల్ [8] [9] అనీ అంటారు. చైనా నియంత్రణలో ఉన్న ఉత్తరం వైపు నుండి దీన్ని ఎక్కడం, దిగడం చాలా కష్టం, కానీ భారతభూభాగం లోని దక్షిణం వైపు నుండి సులభం. [7]

ఇండియా శాడిల్ (35°39′50″N 76°48′20″E / 35.66389°N 76.80556°E / 35.66389; 76.80556 ), అనే భౌగోళిక శాడిల్,[గమనిక 2] తూర్పు ఇందిరా కల్, పశ్చిమ ఇందిరా కల్ లను కలుపుతుంది. [7]

ఇందిరా రిడ్జ్, ఉత్తరాన చైనా నియంత్రణలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌నూ, దక్షిణాన ఉన్న సియాచిన్ గ్లేసియరునూ వేరు చేస్తుంది. వాస్తవ క్షేత్రస్థితి రేఖ (AGPL) తుది బిందువు, పశ్చిమ ఇందిరా కల్, తూర్పు ఇందిరా కల్, ఇందిరా శాడిల్, ఉత్తర తుర్కెస్తాన్ లా, తూర్పు తుర్కెస్తాన్ లా లు ఇందిరా రిడ్జ్‌పై వరసగా పశ్చిమం నుండి తూర్పుగా ఉన్నాయి. [7] [10]

చరిత్ర

[మార్చు]

వ్యుత్పత్తి

[మార్చు]

లడఖీ భాషలో లా అంటే పర్వత మార్గం అని అర్థం. 1912 లో అమెరికాకు చెందిన పర్వతారోహకురాలైన ఫ్యానీ బులక్ వర్క్‌మన్ తూర్పు కల్‌కి లక్ష్మీదేవి పేర్లలో ఒకటైన ఇందిర పేరిట ఇందిరా కల్ అని పేరు పెట్టింది. [9]

అన్వేషణ

[మార్చు]

1889లో, బ్రిటిషు భారత ఆర్మీ అధికారి, అన్వేషకుడూ అయిన ఫ్రాన్సిస్ యంగ్‌హస్‌బండ్ ఉత్తరం వైపు నుండి ఉత్తర తుర్కెస్తాన్ లా స్థావరానికి చేరుకున్నాడు. ఇది పొడవైన హిమానీనదమని, మధ్య ఆసియాను విభజించే ప్రధామనైన శ్రేణి అనీ అతను పేర్కొన్నాడు. [7]

కల్నల్ నరేంద్ర కుమార్ 1981 లో ఇందిరా కల్ (పశ్చిమ కల్) కి చేరుకున్నాడు. [8] [11] [12] 1998 లో హరీష్ కపాడియా, ఆ స్థానానికే అధిరోహించాడు; అయితే, తన మ్యాప్, టెక్స్టులలో దానిని " మెయిన్ ఇందిరా కల్ " అని, " పశ్చిమ ఇందిరా కల్ " అనీ పేర్కొన్నాడు. దానికి 2.4 కి.మీ. తూర్పున ఉన్న కల్‌ను "తూర్పు ఇందిరా కల్" అని పేర్కొన్నాడు. 35°40′17″N 76°50′26″E / 35.67139°N 76.84056°E / 35.67139; 76.84056 నిర్దేశాంకాల వద్ద ఉన్న, చైనావారి మ్యాపుల్లో ఇందిరాకోలి పాస్ అని చూపే బిందువును పాకిస్తాన్ "తూర్పు ఇందిరా కల్" అని చెప్పుకుంటుంది. [13]

1984 లో, ఆపరేషన్ మేఘదూత్‌లో భాగంగా భారత సైనికులు, సియాచిన్ హిమానీనదం మీదుగా ప్రయాణించి, ఇందిరా కల్ సహా అనేక శిఖరాలు, కనుమలను అధిరోహించారు.

ఆ తర్వాత, హరీష్ కపాడియా, అతని సహచరులు సియాచిన్ ప్రాంతంలోని వివిధ శిఖరాలు, శ్రేణులు, హిమానీనదాలను కూడా అన్వేషించారు.

వివాదాస్పద భూభాగాలు

[మార్చు]

ఇందిరా కల్‌కు అన్ని వైపులా ఉన్న భూభాగాలన్నీ వివాదాస్పదంగా ఉన్నాయి. పశ్చిమ ఇందిరా కల్‌కు దక్షిణాన ఉన్న ప్రాంతం భారతదేశ పాలనలో ఉండగా, పాకిస్తాన్‌ దాన్ని వివాదాస్పదం చేసింది. పశ్చిమ ఇందిరా కల్‌కు ఉత్తరాన, పాక్ ఆక్రమణలో ఉన్న, భారతదేశ భూభాగమైన ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌ను 1963 పాకిస్తాన్‌తో సరిహద్దు ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ చైనాకు అప్పజెప్పింది. [14] AGPL సాధారణంగా సాల్టోరో పర్వత శ్రేణి వెంటా నడుస్తుంది. ఈ రేఖ, నియంత్రణ రేఖపై NJ 9842 బిందువు వద్ద మొదలై, వాయవ్యంగా సాగి, ఉత్తరాన పశ్చిమ ఇందిరా కల్ వద్ద ముగుస్తుంది. ఈ శ్రేణి లోని శిఖరాలు, 7,000 మీటర్ల కంటే ఎక్కు ఎత్తున, సగటున మైనస్ 50 సెల్సియస్‌ అత్యల్ప ఉష్ణోగ్రతలతో ఉంటాయి. [15] భారతదేశం, 1984 లో వివాదాస్పద సియాచెన్‌లో సైనిక కార్యకలాపాలు చేపట్టి, 2,600 చ.కి.మీ. ప్రాంతంపై నియంత్రణ సాధించింది. [16] [17]

భౌగోళికం

[మార్చు]

భారత్-చైనా-పాకిస్థాన్ సరిహద్దులు

[మార్చు]

ఇందిరా కల్, భారత-చైనా-పాకిస్తాన్‌ల నియంత్రణలో ఉన్న ప్రాంతాల ట్రై-జంక్షన్‌కు సమీపంలో ఉంది.

ఇందిరా రిడ్జ్ విశేషాలు

[మార్చు]

పశ్చిమం నుండి తూర్పుగా ఇందిరా రిడ్జ్‌లో క్రింది విశేషాలున్నాయి: [7] [10]

AGPL తుది బిందువు

[మార్చు]

ఇండియా సాడిల్

[మార్చు]

పశ్చిమ ఇందిరా కల్, తూర్పు ఇందిరా కల్ ల మధ్య ఇండియా శాడిల్ ఉంది. ఇది దక్షిణాన సియాచిన్ హిమానీనదానికి, ఉత్తరాన ఉర్డోక్ గ్లేసియరుకూ మధ్య సింధు నదీ పరీవాహక ప్రాంతానికీ, తారిమ్ బేసిన్ పరీవాహక ప్రాంతానికీ మధ్య ఉంది. కోల్ నుండి ఉర్డోక్ గ్లేసియర్ వరకు సులభంగా ఉత్తరం వైపుకు దిగేందుకు వీలు లేకుండా చాలా నిటారుగా ఉంటుంది. [6]

సియాచిన్ గ్లేసియర్ స్థలాకృతి

[మార్చు]

ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహించే సియాచిన్ గ్లేసియర్ ప్రధాన కాలువ పశ్చిమ ఇందిరా కల్ దక్షిణపు వాలు నుండి ప్రారంభమవుతుంది. దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించే ఉర్డోక్ హిమానీనదం, చైనా ఆధీనంలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌లోకి ప్రవహిస్తుంది. ఇది పశ్చిమ ఇందిరా కల్ ఉత్తర వాలు నుండి ప్రారంభమవుతుంది. దాని ఉపశాఖల్లో ఉర్డోక్ I హిమానీనదం తూర్పు ఇందిరా కోల్ ఉత్తర వాలు నుండి ఉత్తర వాయువ్యంగా ప్రవహిస్తుంది. ఉర్డోక్ II హిమానీనదం ఉత్తర తుర్కిస్తాన్ లా ఉత్తర వాలు నుండి ఉత్తర వాయువ్యంగా ప్రవహిస్తుంది. [7]

స్ట్రాఘర్ హిమానీనదం ఇందిరా రిడ్జ్‌కు తూర్పు వైపుగా, దానికి లంబంగా నడుస్తుంది (చైనా ఆధీనంలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌కు, భారతదేశం ఆధీనంలో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డి (DBO) కూ మధ్య వాస్తవాధీన రేఖగా పనిచేస్తుంది). [7] [10] సియాచిన్ గ్లేసియర్, సియాచిన్ బేస్ క్యాంప్ నుండి సియాచిన్ హిమానీనదపు ప్రధాన ఛానలైన తేరామ్ షెహర్ గ్లేసియర్‌ను కలిసే పాయింట్ (స్టేషన్ A) వరకు ఉంటుంది. స్టేషన్ A నుండి, ఈ మార్గం ఉత్తరాన పశ్చిమ ఇందిరా కల్ వరకు వెళుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఒక పర్వత శ్రేణిలో రెండు శిఖరాల మధ్య ఉన్న అత్యంత లోతైన పల్లపు స్థానాన్ని కల్ అంటారు. సాధారణంగా వీటి గుండా మానవులు ప్రయాణిస్తూ పర్వత శ్రేణిని దాటుతారు. అయితే కొన్ని కల్‌లు ప్రయాణ యోగ్యంగా ఉండవు. ప్రయాణాలకు వీలుగా ఉండే కల్‌ను కనుమ (పాస్) అంటారు.
  2. ఒక పర్వత శ్రేణిలో రెండు రిడ్జిల మధ్య ఉండే పల్లపు ప్రాంతాన్ని శాడిల్ అంటారు. ఇది కూడా కల్ వంటిదే. సాధారణంగా రెండు శిఖరాల మధ్య నున్న ప్రాంతాన్ని కల్‌ అని, రెండు రిడ్జిల మధ్య ఉండే ప్రాంతాన్ని శాడిల్‌ అనీ అనడం కద్దు.

మూలాలు

[మార్చు]
  1. India is in de facto control of this region of Kashmir; the Indian claim is disputed by Pakistan. See e.g. The Future of Kashmir on the BBC website.
  2. The fight for Siachen
  3. "The endless India-Pakistan sabre-rattling over Siachen glacier and the Line of Control can be resolved by turning the area into a peace park for glacial and weather studies, by B G Verghese, and more from Asian Conversations and Dancing Wolf Media". Archived from the original on 2015-04-12. Retrieved 2015-04-07.
  4. They shall not pass
  5. "Bullish on siachen". Archived from the original on 2014-02-22. Retrieved 2014-02-17.
  6. 6.0 6.1 Kapadia, Harish (1998). "On the Siachen Glacier, Part 4". Indian Mountaineering Federation. Archived from the original on 2011-07-26. Retrieved 2010-08-23.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 Harish Kapadia, 1999, Saga of Siachen, The Himalayan Journal, Vol.55.
  8. 8.0 8.1 Bull’s glacier
  9. 9.0 9.1 Kapadia, Harish (1998). "On the Siachen Glacier, Part 2". Indian Mountaineering Federation. Archived from the original on 2011-07-26. Retrieved 2010-08-23.
  10. 10.0 10.1 10.2 2015, Mass baalance of Siachen glacier, Journal of Glaciology, Vol. 61, No. 229, p.1012.
  11. The Colonel Who Got Us Siachen
  12. "Ice Station Taurus". Archived from the original on 2014-02-22. Retrieved 2014-02-13.
  13. International Boundary Study No. 85 – China-Pakistan Boundary (PDF), 15 November 1968, archived from the original (PDF) on 12 జనవరి 2021, retrieved 24 September 2018
  14. The Geographer, Office of the Geographer (November 15, 1968), China – Pakistan Boundary (PDF), International Boundary Study, vol. 85, Florida State University College of Law
  15. "Revisiting Siachen after the Ladakh stand-off".
  16. Desmond/Kashmir, Edward W. (31 July 1989). "The Himalayas War at the Top Of the World". Time.com. Archived from the original on 14 January 2009. Retrieved 11 October 2008.
  17. Desmond, Edward W. (31 July 1989). "The Himalayas War at the Top Of the World". Archived from the original on 14 January 2009. Retrieved 11 October 2008 – via www.time.com.