వి. మల్లికార్జున్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వి. మల్లికార్జున్ తెలుగు కథా రచయిత, ప్రచురణకర్త. ఇతను రాసిన ఇరానీ కేఫ్, కాగితం పడవలు, నల్లగొండ కథలు వంటి పుస్తకాలు పలు పునర్ముద్రణలు పొందాయి. ఇతను అజు పబ్లికేషన్స్ సంస్థ నడుపుతూ తన పుస్తకాలను, ఇతర రచయితల పుస్తకాలను ప్రచురిస్తున్నాడు.

నేపథ్యం

[మార్చు]

వి. మల్లికార్జున్ తల్లిదండ్రులు ముత్యాలు, మారయ్య. ఇతను తెలంగాణలోని నల్గొండలో జన్మించి, అక్కడే చదువుకుని, పెరిగాడు. మారయ్య థియేటర్ నుంచి వివిధ ఆఫీసుల వరకూ పలుచోట్ల వివిధ చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూండేవాడు. ముత్యాలు ఒక కిరాణాకొట్టు పెట్టి పిల్లల సహకారంతో నిర్వహిస్తూ ఉండేది. మల్లికార్జున్ అక్కకు నల్గొండకు చెందిన వ్యక్తితోనే వివాహం కావడంతో వారు అక్కడే మరో ప్రాంతంలో జీవిస్తూండేవారు. మల్లికార్జున్ బాల్యం, విద్యాభ్యాసం చాలావరకూ నల్గొండలోనే సాగింది. ఈ అనుభవాలను తర్వాతికాలంలో మల్లికార్జున్ తన "నల్గొండ కథలు" పుస్తకంలో ఆసక్తికరంగా రాశాడు.[1] మల్లికార్జున్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో పూర్తిచేసుకున్నాడు.[2]

కెరీర్

[మార్చు]

సినిమా ప్రయత్నాలు, పాత్రికేయ వృత్తి

[మార్చు]

సాధారణమైనవీ, తనకు ఆసక్తి లేనివీ అయిన ఉద్యోగాల్లో చేరకూడదని మొదటే నిర్ణయించుకున్న మల్లికార్జున్ ఒక సినీ నిర్మాణ సంస్థలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించాడు. అందులో భాగంగా సినిమా స్క్రీన్ ప్లే, యూట్యూబ్ వీడియోలకు స్క్రిప్ట్ రాయడం వంటివి రాశాడు. ఇదే సమయంలో కొన్ని ఇతర సినిమాలకు కూడా డైలాగులు రాయడం కొనసాగించాడు. 2017లో అతనికి చిన్నపాటి ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు బయటపడడంతో ఆ వ్యాధికి చికిత్స అనంతరం కోలుకోవడానికి ఉద్యోగం మానేసి 8 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.[2]

ఈ విరామం అనంతరం సాక్షి పత్రికలో చేరి ఉద్యోగ జీవితాన్ని పున:ప్రారంభించాడు. కొన్నాళ్ళు సాక్షి ఫన్ డే సాహిత్య విభాగాన్ని చూసుకున్నాడు. ఆ తర్వాత ఫన్ డే మొత్తానికి ఎడిటర్‌గా పదోన్నతి పొంది ఆ హోదాలో పనిచేశాడు. కొన్నేళ్ళ పాటు పనిచేశాకా 2019లో ఉద్యోగాన్ని మానేసి పూర్తిస్థాయి రచయిత, ప్రచురణకర్తగా మారాడు.[2]

మల్లికార్జున్ తన పదహారో ఏట నుంచి కథలు రాయడం, వాటిని ప్రచురణకు పంపడం మొదలుపెట్టాడు. ఇంజనీరింగ్ తర్వాత సినిమా నిర్మాణ సంస్థలో పనిచేసినా, ఫన్ డే పత్రికకు సంపాదకత్వం వహించినా అందులో రచన పట్ల, కథ చెప్పడం పట్ల తనకున్న ఆసక్తికి తగ్గ పనే చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తాను రాసిన వివిధ కథలతో 2018లో తన మొదటి కథా సంకలనం అయిన ఇరానీ కేఫ్ ప్రచురించాడు. ఇది విడుదలైన కొద్దిరోజులకే ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఇరానీ కేఫ్ పుస్తకం బాగా అమ్ముడయ్యింది. ఆ తర్వాత కూడా ఈ పుస్తకం అమ్మకాలు కొనసాగాయి. 2019లో తన రెండవ పుస్తకం కాగితం పడవలు పేరిట తాను రాసిన ప్రేమకథలతో తీసుకువచ్చాడు. మూడవ పుస్తకంగా తన చిన్ననాటి జ్ఞాపకాల నేపథ్యంలో రాసిన కథల సంకలనం నల్లగొండ కథలు ప్రచురించాడు. ఈ రెండు పుస్తకాలు కూడా పాఠకాదరణ పొందాయి.[2]

ప్రచురణ

[మార్చు]

ఈ క్రమంలో 2019లోనే మల్లికార్జున తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్తిస్థాయిలో రచయిత, ప్రచురణకర్తగా పనిచేయడం ప్రారంభించాడు. అజు పబ్లికేషన్స్ పేరిట ఒక ప్రచురణసంస్థ నెలకొల్పి తాను రాసిన పుస్తకాలతో పాటుగా ఇతర రచయితల పుస్తకాలను కూడా వెలువరిస్తున్నాడు.[2]

గౌరవాలు, పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "వీక్షణం-సాహితీ గవాక్షం 134". Sirimalle (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-25. Retrieved 2024-07-15.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Beesam, Kruti (2021-03-31). "As Mallikarjun Explains The Art Of Storytelling | Transform our world – One story at a time - Hatkestory.com" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-15.
  3. "ప్రజా ఉద్యమాలను ప్రేమించిన వ్యక్తి చంద్రశేఖరరావు". EENADU. Retrieved 2024-07-15.
  4. "వి.మల్లికార్జున్‌కి డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం". Prajasakti (in ఇంగ్లీష్). Retrieved 2024-07-15.
  5. "కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ - 2022 షార్ట్ లిస్ట్ జాబితా" (PDF). Retrieved 2024-07-15.{{cite web}}: CS1 maint: url-status (link)