వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2018
2018 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
సలేశ్వర తీర్థం, శ్రీశైలం అడవులలోని పర్యాటక ప్రదేశం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న |
02వ వారం |
భోగశయనమూర్తి గా శ్రీమహావిష్ణువు ఫోటో సౌజన్యం: వాడుకరి:ఆదిత్యపడికె |
03వ వారం |
అడవి దున్నలు, కేరళ లోని చిన్నర్ అభయారణ్యంలో తెల్ల అడవి దున్న, అడవి దున్న. 70 సంవత్సరాల తర్వాత మన దేశంలో లభించిన తెల్ల అడవి దున్న చిత్రం ఫోటో సౌజన్యం: N.A.Nazeer |
04వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.]] శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఫోటో సౌజన్యం: వాడుకరి:రవిచంద్ర |
05వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన జగ్గయ్యపేట వద్ద బౌద్ద మహా స్తూపం. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
06వ వారం |
కొఱ్ఱలు (Foxtail millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millet). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. ఫోటో సౌజన్యం: STRONGlk7 |
07వ వారం |
తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్‌నగర్ జిల్లా "రాజాపూర్" రైలు సముదాయం. ఇది "సికిందరాబాద్ - బెంగళూరు" మార్గంలో ఉన్నది. ఫోటో సౌజన్యం: Belur Ashok |
08వ వారం |
చెరుకు తోటలో చెరకు రసం తీసె యంత్రం. ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు |
09వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద తూర్పుకనుమల నడుమన "ఏలేరు నది". ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
10వ వారం |
సుందరవనాలు (సుందర్బన్స్) "మడ అడవులలో" ఒక పెద్ద పులి. సుందర్ అనగా "అందమైన", బన్ అనగా "అరణ్యం" లేదా "అడవి" ఫోటో సౌజన్యం: Soumyajit Nandy |
11వ వారం |
అమెరికాలోని మియామిలో 108 సాలగ్రామాల మాలతో అలంకరించిన వెంకటేశ్వరస్వామి వారి మూర్తి. ఫోటో సౌజన్యం: Nvvchar |
12వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక "మర్రిచెట్టు", దాని ఊడలు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది. ఫోటో సౌజన్యం: Ramireddy |
13వ వారం |
ఒరిస్సాలోని కటక్ నగరంలోని బారాబతి కోట ముఖద్వారం. ఫోటో సౌజన్యం: Kamalakanta777 |
14వ వారం |
తెలంగాణ రాష్ట్రములోని పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి. ఫోటో సౌజన్యం: వాడుకరి:అశోక్ శ్రీపాద |
15వ వారం |
అత్తి పండ్లు/మేడి. ఈ పండులో ఉండే 'పెక్టిన్' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
16వ వారం |
సిక్కింలో "దిఖ్ చూ" వద్ద తీస్తా నది పైన నిర్మించిన ఆనకట్ట. ఇది దక్షిణ సిక్కిం జిల్లాలో ఉంది. ఫోటో సౌజన్యం: A. J. T. Johnsingh |
17వ వారం |
బావురు పిల్లి, పులి బావురు అని పిలిస్తారు (Fishing Cat) ఇవి మడ అడవులు, తీర ప్రాంత చిత్తడి నేలలలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటాయి. ఫోటో సౌజన్యం: Kelinahandbasket |
18వ వారం |
శ్రీ సన్యాసేశ్వర స్వామి, ధర్మవరం, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా. ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్ |
19వ వారం |
డా.షేక్ చిన్న మౌలానా. ప్రముఖ నాదస్వర విద్వాంసులు. ఫోటో సౌజన్యం: Sksyedbabu |
20వ వారం |
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేం జిల్లా పాల్వంచ వద్ద కిన్నెరసాని నది పైన నిర్మించిన ఆనకట్ట(డ్యాం) ఫోటో సౌజన్యం: Pranayraj1985 |
21వ వారం |
విశాఖ జిల్లాలో అరకు రైలు సముదాయం ప్రవేశద్వారం ఫోటో సౌజన్యం: Madan kumar 007 |
22వ వారం |
పొలుసు పంది. ఇది చెదలను, చీమలను తినే జంతువు. వీటి చర్మం కోసం విపరీతంగా వేటాడడం వల్ల ఇవి అంతరించిపోతున్నయి. ఫోటో సౌజన్యం: U.S. Fish and Wildlife Service Headquarters |
23వ వారం |
అమరావతి పట్టణంలో వాసిరెడ్ది వెంకటాద్రి నాయుడు గారి కాంస్య విగ్రహం. ఫోటో సౌజన్యం: Krishna Chaitanya Velaga |
24వ వారం |
అడ్డాకులతో తయారు చేసిన విస్తరాకులు. అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
25వ వారం |
ఏలూరు లోని కోటదిబ్బ వద్ద వేంగి చాళుక్యుల మండపం. ఫోటో సౌజన్యం: Vamsi Janga |
26వ వారం |
90వ దశకంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం. ఫోటో సౌజన్యం: Aero Icarus |
27వ వారం |
పద్మాక్షి అమ్మవారి చిత్రం. పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలో ఉంది.ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం.ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
28వ వారం |
గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి. ఫోటో సౌజన్యం: Ashahar Khan |
29వ వారం |
పశ్చిమ బెంగాల్ లో ఒక జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న వృక్షాలు. నేడు అభివృద్ధి పేరున రహదారులకిరువైపుల ఉన్న చెట్లను విచ్చలవిడిగా తొలగిస్తున్నారు. ఫోటో సౌజన్యం: Biswarup Ganguly |
30వ వారం |
కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం. కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు. ఫోటో సౌజన్యం: Srikar Kashyap |
31వ వారం |
ఖమ్మం జిల్లా కూసుమంచిలో కాకతీయ కాలంనాటి గణపేశ్వరాలయం ముందువైపు దృశ్యం. ఫోటో సౌజన్యం: Katta Srinivasa Rao |
32వ వారం |
విశాఖ జిల్లా లంబసింగి వద్ద సుందర దృశ్యం ఫోటో సౌజన్యం: IM3847 |
33వ వారం |
హైదరాబాద్ సంజీవయ్య ఉద్యానవనములోని భారత జాతీయ పతాకం. ఫోటో సౌజన్యం: Mhdmzml |
34వ వారం |
తిరుపతిలోని కపిలతీర్థం వద్ద జలపాతం పై భాగం. ఈ కొండరాళ్ళ సమూహం ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
35వ వారం |
గంగా నదిలో ఒక "గండుమీను (డాల్ఫిన్)". ఇది మన "జాతీయ నీటి జంతువు". ఫోటో సౌజన్యం: Zahangir Alom |
36వ వారం |
తెలంగాణ రాష్ట్రములోని వనపర్తి వద్ద గరుడ పుష్కరిణి. ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న |
37వ వారం |
యల్లాప్రగడ సుబ్బారావు. భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:వైజాసత్య |
38వ వారం |
చెరియాల పటచిత్రాల కళ తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినది. ఈ కళ స్థానిక మూలాంశాలతో చిత్రిస్తారు, దీనిని నకాశి కళగా కూడా వర్ణిస్తారు. స్థానిక పురాణాలు మరియు జానపద కథల నుండి ఈ పటచిత్రాలు సూచిస్తాయి. ఫోటో సౌజన్యం: Rangan Datta Wiki |
39వ వారం |
ఉలవ మొక్క. ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu |
40వ వారం |
ప్రస్తుత బంగ్లాదేశ్ లోని నౌఖాలి ప్రాంతంలో 1946 లొ జరిగిన అల్లర్ల తర్వాత పర్యటించిన మహాత్మ గాంధి. ఫోటో సౌజన్యం: Deeptrivia |
41వ వారం |
బీహార్ లోని విక్రమశిల విశ్వవిద్యాలయ శిథిలాలు. పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించాడు. ఇది ప్రముఖమైన ప్రాచీన బౌద్ధ అభ్యాసకేంద్రం. ఫోటో సౌజన్యం: Saurav Sen Tonandada |
42వ వారం |
వైగై నదీతీరంలో 1860ల నాటి పురాతన మదురై చిత్రం. ఫోటో సౌజన్యం: BishkekRocks |
43వ వారం |
రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యొక్క గ్రంథాలయ భవనం లో నడక దారి. ఫోటో సౌజన్యం: Vamsi Matta |
44వ వారం |
రాజస్తాన్ లోని కోట ప్రాంతంలో కొండల నడుమ చంబల్ నది. ఫోటో సౌజన్యం: Jangidno2 |
45వ వారం |
కేరళ లోని తిరువెగురప్ప దేవాలయంలో దీపాల పండుగ. ఫోటో సౌజన్యం: Argopal |
46వ వారం |
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న కొత్తూరు ధనదిబ్బలు బౌద్ధారామం అవశేషాల వద్ద రాళ్ళను తొలిచి చేసిన పురాతన గుహలు. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
47వ వారం |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం జలపాతం దారిలో అడవి. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. ఫోటో సౌజన్యం: Chandrananrshah |
48వ వారం |
బీహార్ రాష్ట్రములోని ససరాంలో షేర్ షా సూరి సమాధి. ఫోటో సౌజన్యం: Nandanupadhyay |
49వ వారం |
బిర్లా ప్లానిటోరియంలో 12వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకులు విగ్రహం ఫోటో సౌజన్యం: Rajkumar6182 |
50వ వారం |
విశాఖపట్నంలో ఉన్న తెన్నేటి ఉద్యానవనం వద్ద ఇసుకపైన తీగలు. ఇసుక తీగలు తీరప్రాంతాలలొ సముద్రపు కోతను నివారిస్తాయి. ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
51వ వారం |
చెట్టు తొర్రలోని పిల్లలకి "హార్న్ బిల్" పక్షి (ఎబ్బెర పిక్క) ఆహరాన్ని తీసుకువెలుతున్న చిత్రం. ఫోటో సౌజన్యం: Angadachappa |
52వ వారం |
గోవాలోని గీతాంజలి ఆర్ట్ గాలరీ. ఫోటో సౌజన్యం: Shambhavi Karapurkar |