Jump to content

వికీపీడియా:దిద్దుబాటు యుద్ధం

వికీపీడియా నుండి

ఏదైనా పేజీలోని పాఠ్యంపై విభేదించిన రచయితలు, ఒకరి మార్పులను మరొకరు పదేపదే రద్దు చేసుకుంటూ పోతూంటే దాన్ని దిద్దుబాటు యుద్ధం అంటారు. వివాదంలో పాలుపంచుకున్న ఎడిటర్లు యుద్ధాలకు దిగకుండా ఒక ఏకాభిప్రాయానికి రావాలి, లేదా వివాద పరిష్కార మార్గాలను అనుసరించాలి. దిద్దుబాటు యుద్ధం విచ్ఛిన్నకారకం. ఎడిటర్ల మధ్య శతృత్వానికి దారితీసి, ఏకాభిప్రాయానికి మార్గం కష్టతరం చేస్తుంది. యుద్ధాలకు దిగిన వాడుకరులు నిరోధానికి, నిషేధానికీ కూడా గురయ్యే ప్రమాదం ఉంది. తనకు నచ్చిన కూర్పును పదేపదే పునరుద్ధరించే ఎడిటరు దిద్దుబాటు యుద్ధానికి దిగినట్లే; వారి మార్పులు సరైనవి అయినా, కాకపోయినా! "నా మార్పుచేర్పులు సరైనవి. కాబట్టి నాది దిద్దుబాటు యుద్ధం కాదు" అనేది వారి ప్రవర్తనకు సమర్ధన కాబోదు.

వికీపీడియా:3RR_నియమం అనే స్పష్టమైన విధానముంది. తిరగకొట్టడమంటే (రివర్టు) ఒక వాడుకరి చేసిన మార్పులను రద్దు చెయడమే. 3RR ప్రకారం, 24 గంటల వ్యవధిలో, ఒకే పేజీలో మూడు కంటే ఎక్కువ సార్లు తిరగకొట్టడం చెయ్యకూడదు -ఒకే పాఠ్యాన్ని గాని, భిన్నమైన పాఠ్యాన్ని గానీ; పూర్తిగా గాని, పాక్షికంగా గానీ. 24 గంటల వ్యవధి దాటటం కోసం ఎదురు చూసి, అది పూర్తి కాగానే చేసే నాలుగో రివర్టును కూడా దిద్దుబాటు యుద్ధంగానే పరిగణించవచ్చు. 3RR కు కొన్ని మినహాయింపులున్నాయి. దుశ్చర్యను తొలగించడం, జీవించి ఉన్న వ్యక్తుల జీవిత చరిత్రల విషయంలో విధానాన్ని అతిక్రమించడాన్ని నిరోధించడం వంటివి ఈ మినహాయింపులు.

దిద్దుబాటు యుద్ధమంటే

[మార్చు]

దిద్దుబాటు చేసేందుకు వెనకాడవద్దని వికీపీడియా ప్రోత్సహిస్తుంది. కానీ ఏదైనా వివాదాస్పద మార్పు చేసినపుడు వేరే వాడుకరి దాన్ని తిరగ్గొట్టవచ్చు. ఇది చర్చకు ప్రారంభం కావచ్చు. ఇది వరసబెట్టి తిరగ్గొట్టడం, తిరిగి రాయడం, మళ్ళీ తిరగ్గొట్టడం వంటి చర్యలకు దారితీస్తే దిద్దుబాటు యుద్ధం మొదలైనట్లే. ఏదేమైనప్పటికీ, ప్రతీ రివర్టు, లేదా ప్రతీ వివాదాస్పద మార్పూ దిద్దుబాటు యుద్ధం కావు:

  • దుశ్చర్యను తిరగ్గొట్టడం దిద్దుబాటు యుద్ధం కాదు. అయితే, ఒక దృక్కోణంతో చేసిన మార్పుచేర్పులు, మామూలుగా చేసే చేర్పులు తొలగింపులూ, సదుద్దేశంతో చేసే ఇతర మార్పులనూ దుశ్చర్యగా పరిగణించరు. వికీపీడియా:దుశ్చర్య § దుశ్చర్యల్లో రకాలు, వికీపీడియా:దుశ్చర్య § దుశ్చర్యలు కానివి చూడండి.
  • వికీపీడియా విధానాలను అమలు చేసేందుకు చేసే రివర్టులు దిద్దుబాటు యుద్ధం కిందకి రావు.ఉదాహరణకు, జీవించి ఉన్న వ్యక్తుల వ్యాసంలో మూలాల్లేని ప్రతికూల పాఠ్యం చేరిస్తే చెరుపు జరుగుతుంది కాబట్టి, రివర్టు అవసరం.
  • నిరోధిత, నిషేధిత వాడుకరుల మార్పుచేర్పులను తిరగ్గొట్టడం దిద్దుబాటు యుద్ధం కాదు.
  • తన స్వంత వాడుకరి పేజీలోని మార్పులను తిరగ్గొట్టడాన్ని దిద్దుబాటు యుద్ధంగా సాధారణంగా పరిగణించరు. వాడుకరులు తమ స్వంత వాడుకరి పేజీని నిర్వహించుకోవడం పట్ల వికీపీడియా కొంత ఎక్కువ సంయమనం పాటిస్తుంది.

తిరగ్గొట్టేటపుడు కారణాలను చూపించండి. దీన్ని దిద్దుబాటు సారాంశంలో గానీ చర్చా పేజీలో గానీ పెట్టవచ్చు. వివాదాస్పద పేజీల్లో ట్వింకిల్, హగుల్, రోల్‌బ్యాక్ వంటి పరికరాలను సరైన దిద్దుబాటు సారాంశం లేకుండా వాడరాదు.

3RR నియమం

[మార్చు]

ఈ నియమం గురించి విపులమైన సమాచారం కోసం వికీపీడియా:3RR నియమం చూడండి.

మినహాయింపులు

[మార్చు]

దిద్దుబాటు యుద్ధం నుండి కింది రివర్టులు మినహాయింపు:

  1. స్వంత మార్పులను తిరగ్గొట్టడం.
  2. మీ స్వంత వాడుకరి పేజీల్లోని దిద్దుబాట్లను వెనక్కి తిప్పడం - మీరు వాడుకరి పేజీ మార్గదర్శకాలను మన్నిస్తున్నట్లైతే.
  3. నిషేధిత వాడుకరులు గాని, నిరోధిత, నిషేధిత వాడుకరుల సాక్ పపెట్లు గానీ చేసే మార్పుచేర్పులను తిరగ్గొట్టడం.
  4. స్పష్టంగా కనిపించే దుశ్చర్యను తిరగ్గొట్టడం. ఉదాహరణకు పేజీని తుడిచివెయ్యడం, అనుచితమైన భాషను వాడటం.
  5. స్పష్టంగా కనిపించే కాపీహక్కుల అతిక్రమణలను గానీ, the non-free content policy (NFCC) ని సందేహాతీతంగా అతిక్రమించే పాఠ్యాన్ని గానీ తిరగ్గొట్టడం. NFCC కింద అతిక్రమణ అనేది వివాదాస్పమయ్యే అవకాశం ఉంది. అందుచేత అది ముందు అతిక్రమణే అని నిర్ధారణ కావాల్సి ఉంటుంది.
  6. అమెరికా, భారత చట్టాలకు సంబంధించి చట్ట విరుద్ధమయ్యే పనులను తిరగ్గొట్టవచ్చు. ఉదా: పైరసీ, అశ్లీలత.
  7. జీవిత చరిత్ర వ్యాసాల్లో నిందాపూర్వక, పక్షపాత, మూలాల్లేని, సరైన మూలాల్లేని కంటెంటును తీసెయ్యడం.

If you are claiming an exemption, make sure there is a clearly visible edit summary or separate section of the talk page that explains the exemption. When in doubt, do not revert. Instead, engage in dispute resolution, and in particular ask for help at relevant noticeboards such as the Edit war/3RR noticeboard.