Jump to content

వికీపీడియా నిర్వాహకులు

వికీపీడియా నుండి
వికీపీడియాలో నిర్వాహకులను సూచించే గుర్తు

వికీపీడియా నిర్వాహకులు, అనగా వికీపీడియాలో నిర్వాహక విధులు నిర్వర్తిస్తున్న వాడుకరులు. చాలాకాలం నుండి వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న విశ్వసనీయ వాడుకరులను నిర్వాహకులుగా నియమిస్తారు. వీరిని నిర్వాహకులు, సిసోప్స్, కాపలాదారులు అని కూడా పిలుస్తారు. 2021, జనవరి నాటికి తెలుగు వికీపీడియాలో 12 మంది నిర్వాహకులు ఉన్నారు. ఇతర వాడుకరులతో పోలిస్తే, నిర్వాహకులకు అదనపు సాంకేతిక అధికారాలు ఉంటాయి.

వికీపీడియాలో నిర్వాహకుడిగా మారడాన్ని "తుడుపుకర్రను ఇవ్వడం (తీసుకోవడం)" అని పిలుస్తారు.[1] ఈ పదం మరికొన్నింటిలో కూడా ఉపయోగించబడుతుంది.[2] 2006లో వికీపీడియాలో 1,000 మంది నిర్వాహకులు ఉన్నారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.[3] 2005, 2006 సంవత్సరాల్లో ప్రతినెలా 40 నుండి 50 మందిని నిర్వాహకులుగా నియమించారు. కాని 2012 మొదటిభాగంలో మొత్తం తొమ్మిది మంది మాత్రమే నియమించబడ్డారు.[4] దీనికి సంబంధించి వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్, "సుమారు రెండు సంవత్సరాలుగా నిర్వాహకుల సంఖ్య స్థిరంగా ఉందని" అని అన్నాడు.[5] వేల్స్ ఇంతకుముందు (ఫిబ్రవరి 11, 2003 న ఇంగ్లీష్ వికీపీడియా మెయిలింగ్ జాబితాకు పంపిన సందేశంలో) నిర్వాహకుడిగా ఉండటం "పెద్ద విషయం కాదు, ఇది కేవలం సాంకేతిక విషయం" అని పేర్కొన్నాడు.[6]

జాన్ బ్రాటన్ రాసిన వికీపీడియా: ది మిస్సింగ్ మాన్యువల్ అనే పుస్తకంలో, వికీపీడియాలో నిర్వాహకులను న్యాయమూర్తులుగా భావించినప్పటికీ, నిర్వాహకులు సాధారణంగా "పేజీలను తొలగించడం", "అత్యధిక వివాదాస్పద మార్పులు జరుగుతున్న పేజీలను సంరక్షణలో ఉంచుతారు" అని ఆయన చెప్పారు.[7]

నిర్వాహక హోదా కోసం అభ్యర్థనలు

[మార్చు]

2001, అక్టోబరులో జిమ్మీవేల్స్ మొదటి వికీపీడియా నిర్వాహకుడిని నియమించాడు.[8] వికీపీడియాలో నిర్వాహక అధికారాలు అనేవి అభ్యర్థన విధానం ద్వారా ఇవ్వబడ్డాయి.[9] ఎవరైనా వికీ వాడుకరి తనను తాను నిర్వాహక హోదాకి నామినేట్ చేసుకోవచ్చు లేదా నామినేట్ చేయమని మరొక వాడుకరిని అభ్యర్థించవచ్చు. ఈ ప్రక్రియ అనేది "సుప్రీంకోర్టు ద్వారా ఒకరిని నియమించడానికి సమానం" అని ఆంగ్ల వికీపీడియాలో నిర్వాహకుడిగా వ్యవహరించే శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఆండ్రూ లిహ్ పేర్కొన్నాడు.

విధులు

[మార్చు]

ఒక వాడుకరికి నిర్వాహక అధికారాలను ఇచ్చిన తర్వాత, కొన్ని విధులను నిర్వహించడానికి అ వాడుకరికి అదనపు అనుమతులు ఉంటాయి.[4] వీటిలో "వ్యాసాల శుద్దిపరిచే పని",[9] అనుచితమైనవిగా భావించే వ్యాసాలను తొలగించడం, పేజీలను సంరక్షించడం (ఆ పేజీకి సవరణ హక్కులను పరిమితం చేయడం),[10] అంతరాయం కలిగించే వాడుకరుల ఖాతాలను నిరోధించడం ముఖ్యమైన విధులు. వాడుకరులను నిరోధించడం అనేది వికీపీడియా విధానాల ప్రకారం జరగాలి, నిరోధానికి కారణాలు కూడా చెప్పాలి.

వాడుకరులు నిర్వాహక హోదా పదోన్నతి పొందిన తరువాత, వారు గతంలో చేసినదానికంటే వికీలో జరిగే వివాదాస్పద అంశాల గురించి ఎక్కువ దృష్టి పెడతారు. నిర్వాహకులను ఎన్నుకోవటానికి ఓటింగ్ పద్ధతి ప్రతిపాదించబడింది. ఈ పద్ధతిలో అనుభవజ్ఞులైన వాడుకరుల ఓట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.[11]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Wikipedia:Administrators". Wikipedia. Wikimedia Foundation. Retrieved 10 January 2021.
  2. Burke, Moira; Kraut, Robert (April 2008). Taking Up the Mop: Identifying Future Wikipedia Administrators. pp. 3441–3446. doi:10.1145/1358628.1358871. ISBN 978-1-60558-012-8. {{cite book}}: |work= ignored (help)
  3. Hafner, Katie (17 June 2006). "Growing Wikipedia Refines Its 'Anyone Can Edit' Policy". The New York Times. Retrieved 10 January 2021.
  4. 4.0 4.1 Meyer, Robinson (16 July 2012). "3 Charts That Show How Wikipedia Is Running Out of Admins". The Atlantic. Retrieved 10 January 2021.
  5. Lee, Dave (18 July 2012). "Jimmy Wales denies Wikipedia admin recruitment crisis". BBC News. Retrieved 10 January 2021.
  6. Wales, Jimmy (11 February 2003). "Sysop Status". EN-I Wikimedia Mailing List. Retrieved 10 January 2021.
  7. Broughton, John (2008). Wikipedia – The Missing Manual. O'Reilly Media. p. 199.
  8. Schiff, Stacy (31 July 2006). "Know It All". The New Yorker. Retrieved 10 January 2021.
  9. 9.0 9.1 Ayers, Phoebe; Matthews, Charles; Yates, Ben (2008). How Wikipedia Works. No Starch Press. ISBN 978-1-59327-176-3.
  10. Ebersbach, Anja; Adelung, Andrea; Dueck, Gunter; Glaser, Markus; Heigl, Richard; Warta, Alexander (2008). Wiki: Web Collaboration. Springer. ISBN 978-3-540-68173-1.
  11. Das, Sanmay (2013). Manipulation Among the Arbiters of Collective Intelligence: How Wikipedia Administrators Mold Public Opinion (PDF). pp. 1097–1106. doi:10.1145/2505515.2505566. ISBN 978-1-4503-2263-8. Archived from the original (PDF) on 2021-02-19. Retrieved 2021-01-10. {{cite book}}: |work= ignored (help)