వ్యోమ నంది
వ్యోమ నంది | |
---|---|
జననం | జామ్‌నగర్, గుజరాత్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
వ్యోమ నంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మోడల్.[1] 2016లో మరల తెలుపునా ప్రియ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి, 2017లో మల్హర్ థాకర్ సరసన క్రైమ్ థ్రిల్లర్ సినిమా క్యాష్ ఆన్ డెలివరీ సినిమాతో గుజరాతీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. గుజ్జుభాయ్-మోస్ట్ వాంటెడ్ (2018), ఆక్సిజన్ (2018), లువ్ నీ లవ్ స్టోరీస్ (2020) వంటి అనేక విజయవంతమైన గుజరాతీ సినిమాలలో నటించింది.[2] క్యాష్ ఆన్ డెలివరీ సినిమాలో తన నటనకు గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డును గెలుచుకుంది.
జీవిత విషయాలు
[మార్చు]వ్యోమ నంది గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో ప్రమేష్ నంది, చాందిని నంది దంపతులకు జన్మించింది. ఆమె కుటుంబం కెనడాలోని టొరంటోకు మారింది. చింగుఅకౌసీ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది, యార్క్ విశ్వవిద్యాలయం నుండి మనస్తత్వశాస్త్రంలో పట్టభద్రురాలైంది.
నటనారంగం
[మార్చు]నంది కెనడాకు వెళ్ళడానికి ముందు చిన్నతనంలోనే ప్రసిద్ధ బ్రాండ్‌ల కోసం వివిధ ప్రకటనలలో మోడల్‌గా నటించింది. సినిమాలలో నటించడానికి 2014లో భారతదేశానికి తిరిగి వచ్చి,[3] ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్ నుండి నటనలో డిప్లొమా పూర్తిచేసింది. 2016లో ప్రిన్స్ సిసిల్ కి జోడీగా మరల తెలుపనా ప్రియ అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. క్రైమ్ థ్రిల్లర్ క్యాష్ ఆన్ డెలివరీలో తన పాత్రకు 2017లో ఉత్తమ తొలి నటి గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
గుజ్జుభాయ్-మోస్ట్ వాంటెడ్ (2018), గుజ్జుభాయ్ ఫిల్మ్ సిరీస్‌లో రెండవ సినిమా, గుజ్జుభాయ్ ది గ్రేట్ (2015)కి సీక్వెల్‌లో నటించింది. ఈ సినిమా సానుకూల సమీక్షలను పొందడంతోపాటు వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఆక్సిజన్ (2018)లో అన్షుల్ త్రివేది సరసన నటించింది.[4] ఈ సినిమా కూడా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
2020లో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా లవ్ నీ లవ్ స్టోరీస్[5][6]లో కీలక పాత్ర పోషించింది.
2018లో కలర్స్ గుజరాతీలో ప్రసారమైన గుజరాతీ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ మారి సాతే[7] మొదటి సీజన్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అహ్మదాబాద్ టైమ్స్ నుండి టివి 2019లో గుజరాత్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.[8]
అహ్మదాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 బిరుదు అందుకుంది.[9] టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో టాప్ 50లో కూడా నిలిచింది.[10]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2016 | మరల తెలుపనా ప్రియా | వైష్ణవి | తెలుగు | |
2017 | క్యాష్ ఆన్ డెలివరీ | అదితి | గుజరాతీ | |
2018 | గుజ్జూభాయ్-మోస్ట్ వాంటెడ్ | ప్రియా రాజ్‌గురు | గుజరాతీ | [11] |
2018 | ఆక్సిజన్ | నటాషా మెహతా | గుజరాతీ | [12] |
2020 | లవ్ నీ లవ్ స్టోరీస్ | సోనమ్ గుప్తా | గుజరాతీ | [13] |
2022 | భూల్ భూలయ్యా 2 | రజ్జో | హిందీ |
టెలివిజన్, వెబ్ సిరీస్లు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2018 | నాచ్ మారి సాతే | ఆమెనే | కలర్స్ గుజరాతీ | న్యాయమూర్తి | [14] |
2021 | అన్ నౌన్ టూ నోన్ | దిశా | షెమరూమీ | [15] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2017 | గుజరాతీ ఐకానిక్ ఫిల్మ్ అవార్డులు | ఉత్తమ తొలిచిత్ర నటి | క్యాష్ ఆన్ డెలివరీ | విజేత | |
2021 | ఫిల్మ్ ఎక్సలెన్స్ అవార్డులు గుజరాతీ | ఉత్తమ నటి | లవ్ నీ లవ్ స్టోరీస్ | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ "Khushi Shah to Vyoma Nandi: Top FIVE regional actresses who entertained with Dhollywood films". The Times of India (in ఇంగ్లీష్). 19 January 2020. Retrieved 2023-01-13.
- ↑ "'Love Ni Love Storys' song 'Manzil' teaser: Pratik Gandhi and Vyoma Nandi's will entertain you with their romance". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "I always wanted to be an actress: Vyoma Nandi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "I cherished my experience of working in Oxygen: Vyoma Nandi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "I could relate to my character in Luv Ni Love Storys: Vyoma Nandi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "Photos: Vyoma Nandi gears up for 'Love Ni Love Storys' promotion". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Actress Vyoma Nandi speaks about her hectic work schedule of 2018". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "Gujarat's Most Desirable Woman on TV 2019: Vyoma Nandi". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "Vyoma Nandi is Ahmedabad Times Most Desirable Woman 2020". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "Vyoma Nandi grabs the top spot on Ahmedabad Times Most Desirable Women 2020 list". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ GujjuBhai: Most Wanted Movie Review {4/5}: Critic Review of GujjuBhai: Most Wanted by Times of India, retrieved 2023-01-13
- ↑ Oxygen Gujarati Movie Review {3/5}: Oxygen makes good use of human emotions to strike a chord, retrieved 2023-01-13
- ↑ Luv Ni Love Storys Movie Review: Luv Ni Love Storys, retrieved 2023-01-13
- ↑ "Revanta Sarabhai & Vyoma Nandi to make their telly debut". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-13.
- ↑ "Gujarati web series 'Unknown to Known' all set to release on ShemarooMe, premium OTT platform, on Thursday - Navjeevan Express". 8 June 2021. Retrieved 2023-01-13.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వ్యోమ నంది పేజీ
- ఇన్స్టాగ్రాం లో వ్యోమ నంది