శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల (భువనగిరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల (భువనగిరి)
రకంఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్
స్థాపితం1973
ప్రధానాధ్యాపకుడుడా. ఎన్. శ్రీనివాస్
స్థానంభువనగిరి, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుమహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో ఉన్న కళాశాల.[1] ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ సంస్థల ఆర్థిక సహకారంతో కళాశాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.[2]

పరిపాలన భవనం
డిగ్రీ భవనం
పిజీ భవనం
గ్రంథాలయ భవనం
సాంస్కృతిక కార్యక్రమాల వేదిక

చరిత్ర[మార్చు]

భువనగిరి పట్టణంలో కళాశాల నెలకొల్పడానికి సామాజికవేత్తలు పోత్నాక్ పెంటాజీ, కరేపే భవనాజీ తదితరులు భువనగిరి పట్టణ శివారులో 10 ఎకరాల భూమిని విరాళంగా, మరో 10 ఎకరాలను నామమాత్రపు ధరకు ఇచ్చారు. అప్పటి సబ్ కలెక్టర్ ఎ.ఎన్. తివారీ, వ్యాపారవేత్త మంచాల మల్లేశం, సర్దార్ పటేల్ కళాశాల అప్పటి ప్రిన్సిపాల్ తోట ఆనందరావు, న్యాయవాది కె. వెంకటేశ్వరరావు తదితరులు కళాశాల నిర్మాణానికి కావలసిన డబ్బను సేకరించారు.

ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా 1973లో డిగ్రీ కళాశాలగా స్థాపించబడింది. ఇక్కడికి సమీపంలోనే నరసింహ క్షేత్రమైన యాదగిరిగుట్టలో కొలువైవున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి పేరును ఈ కళాశాలకు పెట్టారు. 1956 చట్టం ప్రకారం 2(ఎఫ్), 12(బి) కింద యూజీసిచే గుర్తించబడిన నల్గొండ పట్టణంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అనుబంధంగా మార్చబడింది.[1]

కోర్సులు[మార్చు]

  • డిగ్రీ కోర్సులు: బిఏ, బికామ్, బిఎస్సీ.
  • పిజీ కోర్సులు: ఎంకామ్, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, మ్యాథ్స్)

కోర్సులు ప్రారంభించిన వివరాలు[మార్చు]

డిగ్రీ కోర్సులు
క్రమసంఖ్య కోర్సు విభాగాలు భాష ప్రారంభించిన సంవత్సరం
1 బిఏ (ఈపిపి) ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తెలుగు 1977
2 బికాం (జెనరల్) కామర్స్ తెలుగు 1973
3 బికాం (సిఏ) కంప్యూటర్ అప్లికేషన్స్ ఇంగ్లీష్ 2007
4 బిఎస్సీ (ఏ.జెడ్.సి.) అప్లైడ్ న్యూట్రీషన్ - పబ్లిక్ హెల్త్, జువాలజీ, కెమిస్ట్రీ ఇంగ్లీష్ 1981
5 బిఎస్సీ (బి.జెడ్.సి.) బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇంగ్లీష్ 1985
6 బిఎస్సీ (ఎం.పి.సి.) మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంగ్లీష్ 1996
7 బిఎస్సీ (ఎం.పి.సిఎస్.) మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ 2002
పిజీ కోర్సులు
క్రమసంఖ్య కోర్సు విభాగాలు భాష ప్రారంభించిన సంవత్సరం
1 ఎంకాం కామర్స్ ఇంగ్లీష్ 2003
2 ఎమ్మెస్సీ మ్యాథ్స్ ఇంగ్లీష్ 2005
3 ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ 2006

సదుపాయాలు[మార్చు]

21 ఎకరాల పచ్చని క్యాంపస్‌లో ఈ కళాశాలకు స్వంత భవనాలతోపాటు ఈ కింది సదుపాయాలు కూడా ఉన్నాయి.[3]

  • గ్రంథాలయం: 1973లో కళాశాల ప్రారంభంలో పుస్తకాల సేకరణ జరుగుతూనే ఉంది. ఈ 50 ఏళ్ళలో దాదాపు 30,000 పుస్తకాలు సేకరించబడ్డాయి.
  • క్రీడలు: కళాశాల ప్రాంగణంలో ఇండోర్ (క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్), అవుట్‌డోర్ (వాలీబాల్, బాస్కెట్ బాల్) ఆటలకు సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో రాణించి కళాశాలకు గుర్తింపు తెచ్చారు.[4]
  • ఫలహారశాల (కేఫ్టేరియా): కేఫ్టేరియాలో స్నాక్స్, డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని వస్తువుల ధరలు, నాణ్యతపై క్యాంటీన్ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం నిఘా ఉంటుంది. కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు తక్కువ ధరకు లభిస్తున్నాయి.
  • హాస్పిటల్: ప్రథమ చికిత్స సౌకర్యంతో కూడిన ఆరోగ్య కేంద్రం ఉంది.
  • కంప్యూటర్ ల్యాబ్: కళాశాలలో ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయంతో కూడిన మూడు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. భువనగిరి పట్టణంలో కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించిన మొదటి కళాశాల ఇది. కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లో 45 కంప్యూటర్లు, కామర్స్ ల్యాబ్ లో 20 కంప్యూటర్లు, ఇంగ్లీష్ ల్యాబ్ లో 15 కంప్యూటర్లు ఉన్నాయి.
  • ప్రయోగశాలలు: కళాశాలలో విద్యార్థుల కోసం వారివారి కోర్సుల ఆధారంగా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, న్యూట్రిషన్ కోర్సుల ప్రయోగశాలు ఉన్నాయి.
  • ఎన్.సి.సి./ఎన్.ఎస్.ఎస్.: విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి ఈ కళాశాలలో నేషనల్ క్రెడిట్ క్రాప్స్ (ఎన్.సి.సి.), జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) యూనిట్లు ఉన్నాయి. వాటిద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
  • జిమ్: ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో విద్యార్థుల కోసం 14+8 స్టేషన్ జిమ్ తో కూడిన ఫిట్‌నెస్ సెంటర్ ఉంది.

కళాశాల పూర్వ విద్యార్థులు[మార్చు]

  1. ప్రణయ్‌రాజ్ వంగరి: నాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "SRI LAKSHMI NARASIMHA SWAMY COLLEGE". SLNS College Website (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-12. Retrieved 2022-02-12.
  2. "OUR SPONSORS – SRI LAKSHMI NARASIMHA SWAMY COLLEGE" (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
  3. "Sri Lakshmi Narasimha Swamy College, Bhongir Facilities Details". www.careers360.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-12. Retrieved 2022-02-12.
  4. telugu, NT News (2021-12-09). "ఐసీటీ వాలీబాల్‌ విజేత భువనగిరి". Archived from the original on 2022-02-13. Retrieved 2022-02-13.

బయటి లింకులు[మార్చు]