శ్రీపతి రాజేశ్వర్ రావు
శ్రీపతి రాజేశ్వర్ రావు | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 – 1985 | |||
నియోజకవర్గం | ముషీరాబాద్ నియోజకవర్గం | ||
---|---|---|---|
మాజీ ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1984 - 1989 1994 - 1999 | |||
నియోజకవర్గం | సనత్‌నగర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1941 పాన్ బజార్, సికింద్రాబాద్,తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
తల్లిదండ్రులు | ఈశ్వరయ్య, రాజమణి | ||
జీవిత భాగస్వామి | ప్రమీల దేవి | ||
సంతానం | సతీష్, సంతోష్, సత్యలక్ష్మి | ||
నివాసం | సింహపురి కాలనీ, మారేడుపల్లి, సికింద్రాబాద్ |
శ్రీపతి రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకియ నాయకుడు. ఆయన ముషీరాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]శ్రీపతి రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్, పాన్ బజార్ లో 1941లో ఈశ్వరయ్య, రాజమణి దంపతులకు జన్మించాడు. ఆయన ఆదయ్య స్మారక పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేసి, మహబూబ్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శ్రీపతి రాజేశ్వర రావు సినీనటుడు ఎన్టీఆర్ వీరాభిమాని, ఆయన 1962లో అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించాడు. ఆయన 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. రాజేశ్వర రావు అనంతరం టీడీపీలో చేరి 1985,[2] 1994లో జరిగిన ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.
ఎమ్మెల్యేగా పోటీ
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం పేరు | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ప్రత్యర్థి పేరు | పార్టీ |
---|---|---|---|---|---|
1983 | ముషీరాబాద్ | శ్రీపతి రాజేశ్వర్ రావు | స్వతంత్ర అభ్యర్థి | నాయిని నర్సింహారెడ్డి | జనతా పార్టీ |
1985 | సనత్‌నగర్ | శ్రీపతి రాజేశ్వర్ రావు | టీడీపీ | పి. ఎల్. శ్రీనివాస్ | కాంగ్రెస్ పార్టీ |
1989 | సనత్‌నగర్ | ఎం. చిన్న రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | శ్రీపతి రాజేశ్వర్ రావు | టీడీపీ |
1994 | సనత్‌నగర్ | మర్రి శశిధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | శ్రీపతి రాజేశ్వర్ రావు | టీడీపీ |
1999 | సనత్‌నగర్ | శ్రీపతి రాజేశ్వర్ రావు | స్వతంత్ర అభ్యర్థి | మర్రి శశిధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
2004 | సనత్‌నగర్ | మర్రి శశిధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | శ్రీపతి రాజేశ్వర్ రావు | టీడీపీ |
మరణం
[మార్చు]శ్రీపతి రాజేశ్వర్ రావు మూత్రపిండ సంబంధింత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2013 ఏప్రిల్ 28న మరణించాడు. ఆయనకు భార్య ప్రమీల, కుమారులు సతీష్, సంతోష్, కుమార్తె సత్యలక్ష్మి ఉన్నారు.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (2013). "తుది వరకు అన్న ధ్యాసే". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
- ↑ Sakshi (31 October 2018). "సంక్షోభం.. మధ్యంతరం". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
- ↑ News18 (28 April 2013). "NTR fan, former minister Sripathi Rajeshwar Rao is dead" (in ఇంగ్లీష్). Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hans India (24 July 2013). "TDP ex-minister Rajeshwar passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
- ↑ Webdunia (2013). "మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ అంత్యక్రియలు నేడు". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.