షర్మిలా మాండ్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షర్మిలా మాండ్రే
2013లో షర్మిలా మాండ్రే
జననం (1990-10-28) 1990 అక్టోబరు 28 (వయసు 33)
ఇతర పేర్లుషర్మిల మండ్రే
విద్యసోఫియా హై స్కూల్, బెంగళూరు
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
బంధువులుసునంద మురళీ మనోహర్ (మేనత్త)

షర్మిలా మాండ్రే (జననం 1990 అక్టోబరు 28) భారతీయ నటి, సినిమా నిర్మాత. ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటిస్తుంది. ఆమె సజ్ని (2007)తో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం కృష్ణతో విజయాన్ని అందుకుంది. అలాగే ఆమె వెంకట ఇన్ సంకట (2009), స్వయంవర (2010) చిత్రాలకు ప్రశంసలు అందుకుంది. ఆమె తమిళంలో మిరట్టల్ (2012), తెలుగులో కెవ్వు కేక (2013) సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది.[1] ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రానికి SIIMA అవార్డు అందుకుంది. షర్మిలా మాండ్రే కెరీర్ లో ఆకే (2017), గాలిపాట 2 (2022) చిత్రాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఆమె తమిళ చిత్రం ఎవనుక్కు ఎంగేయో మ్యాచ్ ఇరుక్కు (2018)తో నిర్మాతగా మారింది. బెంగుళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో షర్మిలా మాండ్రే 2012లో 10వ స్థానంలో నిలవగా 2014లో 8వ స్థానం సాధించింది. అలాగే బెంగుళూరు టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ 2020లో ఆమె 20వ స్థానంలో నిలిచింది.

బాల్యం, విద్య

[మార్చు]

ఆమె 1990 అక్టోబరు 28న కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించింది. ఆమె తన పాఠశాల విద్యను బెంగళూరులోని సోఫియా హైస్కూల్‌లో పూర్తి చేసింది. ఆమె తండ్రి దయానంద మాండ్రే వ్యాపారవేత్త, కార్ రేసింగ్ ఔత్సాహికుడు. ఆమె తాత రామానంద నారాయణరావు మాండ్రే సినిమా నిర్మాత, పంపిణీదారు. అలాగే ఆయన బెంగళూరులోని సంగమ్ టాకీస్ వ్యవస్థాపకుడు. షర్మిలా మాండ్రే మేనత్త సునంద మురళీ మనోహర్ సినీ నిర్మాత.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

షర్మిలా మాండ్రే 2013లో తన పేరుకు అదనపు "ఇ" (Sharmiela Mandre) జోడించింది. 2020లో బెంగళూరులో ఆమె ప్రయాణిస్తున్న కారు స్తంభానికి ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

నటిగా

[మార్చు]
Year Title Role Notes Ref.
2007 సజ్ని సజ్ని [2]
కృష్ణ అంజలి
ఈ బంధన శృతి
2008 నవగ్రహ కిరణ్
మస్త్ మజా మాడి ఆమెనే స్పెషల్ అప్పియరెన్స్
2009 శివమణి శృతి
వెంకట ఇన్ సంకట రిపోర్టర్
2010 స్వయంవర అనూష
కరి చిరతే శృతి
2011 ధన్ ధనా ధన్ ఛార్మి
2012 మిరట్టల్ దీపిక తమిళం సినిమా [3]
2013 కెవ్వు కేక మహాలక్ష్మి తెలుగు సినిమా [4]
2014 గోవా
2015 ముంతాజ్ అంజలి / ముంతాజ్
2017 ఆకే షర్మిలా దేశాయ్ / మాయ [5]
మాస్ లీడర్ షర్మిల
2022 గాలిపట 2 షర్మిల [6]
2023 మండల: UFO ఇన్సిడెంట్ మాయ పోస్ట్ ప్రొడక్షన్ [7]
దసరా అనికా పూర్తయింది [8]

నిర్మాతగా

[మార్చు]
Year Title Cast Language Ref.
2018 ఎవనుక్కు ఎంగేయో మ్యాచ్ ఇరుక్కు విమల్, అష్నా జవేరి Tamil [9]
2021 నానుమ్ సింగిల్ థాన్ అట్టకత్తి దినేష్, దీప్తి సతి Tamil [10]
2023 సందక్కారి విమల్, శ్రియ శరణ్ Tamil
దసరా సతీష్ నినాసం, షర్మిల మాండ్రే Kannada [11]
కాదల్ కొంజం తూకలా కాళిదాస్ జయరామ్, అమలా పాల్, దుషార విజయన్ Tamil [12]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
Year Award Category Film Result Ref.
2008 హలో గాంధీనగర అవార్డ్స్ ఉత్తమ తొలి నటి సజ్ని
2010 సౌత్ స్కోప్ స్టైల్ అవార్డ్స్ మోస్ట్ స్టైలిష్ నటి - కన్నడ స్వయంవర [13]
2013 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం - తెలుగు కెవ్వు కేక [14]

మూలాలు

[మార్చు]
  1. "Allari Naresh Kevvu Keka Movie Shooting Completed - Sakshi". web.archive.org. 2023-02-12. Archived from the original on 2023-02-12. Retrieved 2023-02-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Sajni: Archived copy". Archived from the original on 19 మే 2008. Retrieved 12 మార్చి 2009.
  3. "Sharmila Mandre's in dilemma". The Times of India. Archived from the original on 2012-11-04.
  4. Christopher, Kavya. "Sharmila to debut in Tollywood". The Times of India. Archived from the original on 28 October 2012. Retrieved 4 October 2012.
  5. "Chiranjeevi Sarja and Sharmiela Mandre's "Aake" is completed." News Karnataka. 24 December 2016.
  6. "Meet the girl gang of Yogaraj Bhat's next titled Gaalipata 2!". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 November 2019.
  7. "A multi-starrer sci-fi adventure drama in the works in Kannada". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 6 April 2019.
  8. "Sathish Ninasam and Sharmiela Mandre's next has a new title". The Times of India. Retrieved 25 June 2020.
  9. "Kannada actress Sharmiela Mandre produces Vimal's film". Deccan Chronicle. Retrieved 17 July 2018.
  10. Subramanian, Anupama (11 August 2019). "Dinesh, Deepthi Thivesh team up for a rom-com". Deccan Chronicle.
  11. "Exclusive - Sathish Ninasam and Sharmiela Mandre unite for a murder mystery titled Dasara". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 November 2019.
  12. "Sharmiela Mandre to back Balaji Mohan's next, Kaadhal Konjam Thookala". Cinema Express (in ఇంగ్లీష్). Archived from the original on 25 జనవరి 2023. Retrieved 15 September 2021.
  13. "I'll soon be a size zero: Swayamvara's Sharmila Mandre". Times of India. Retrieved 2 April 2010.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. Seshagiri, Sangeetha (July 21, 2014). "SIIMA 2014 Telugu Nominations: Pawan Kalyan's 'Attarintiki Daredi' Nominated in 12 categories". International Business Times. Archived from the original on January 25, 2015. Retrieved July 22, 2014.