సజ్జాపురం (సంతమాగులూరు)
సజ్జాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′55″N 79°58′56″E / 16.065151°N 79.982213°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | సంతమాగులూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి తేలప్రోలు కనకమ్మ |
పిన్ కోడ్ | 523302 |
ఎస్.టి.డి కోడ్ |
సజ్జాపురం, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో , సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ వినాయకస్వామివారి ఆలయం
శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]సజ్జాపురం గ్రామంలోని బి.సి.కాలనీలో రు. 25 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో, 2014, జూన్-18, బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠాకార్యక్రమాలు ప్రారంభమైనవి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విశేషపూజలు నిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమం కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, గర్భగుడిలో మూలవిరాట్టును ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో వేదపండితులు, అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. పలువురు పుణ్యదంపతులు పీటలమీద కూర్చొని, ప్రత్యేకపూజలు, హోమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలతోపాటు, పరిసరగ్రామాల నుండి అధికసంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పూజలు చేసారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి, అన్నసంతర్పణ కార్యక్రమం చేపట్టినారు.
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2017,ఏప్రిల్-24వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి, భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించినవి. పరిసర ప్రాంతాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.