సహాయం:వికీ మార్కప్తో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/1
దిద్దుబాటు చెయ్యడం
ఆకృతీకరణ
లింకులూ వికీలింకులూ
మార్పులను భద్రపరచడం
కొత్త వ్యాసాలను సృష్టించడం
సారాంశం
|
మొబైల్ పరికరాల్లో దిద్దుబాట్లు చెయ్యడం గురించి ఒక గమనిక: చాలా మంది వికీపీడియన్లు కంప్యూటర్ నుండి దిద్దుబాట్లు చేసేందుకే ఇష్టపడతారు, ఎందుకంటే దిద్దుబాటు ఇంటర్ఫేస్ అక్కడ బాగా పనిచేస్తుంది. మీరు మొబైల్ పరికరం నుండి కూడా చెయ్యవచ్చు. మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడండి. వికీపీడియా తన స్వంత కంప్యూటరు భాష, వికీ మార్కప్ను వాడుతుంది. దీన్ని వికీటెక్స్ట్ అని కూడా అంటారు. ఇది నేర్చుకోవడం బహు తేలిక.
ఇక రెండో పరికరం, విజువల్ ఎడిటరును వాడవచ్చు. ఇది మైక్రోసాఫ్టు వర్డ్ లాంటి వర్డ్ ప్రాసెసరు లాగానే పని చేస్తుంది. విజువల్ ఎడిటరు వాడడం చాలా సులువు. సోర్సు ఎడిటరు ప్రయోజనం ఏంటంటే దాని ద్వారా కొన్ని పనులు సులువుగా చేసెయ్యవచ్చు. దిద్దుబాటు చేసేటపుడు దీన్నుంచి దానికి, దాన్నుంచి దీనికీ ఇట్టే మారిపోవచ్చు - పక్కనున్న బొమ్మలో చూడండి.
వికీ మార్కప్ వాడి పేజీని దిద్దేందుకు, పేజికి పైన ఉండే మూలపాఠ్యాన్ని సవరించు ట్యాబ్ను నొక్కండి. అప్పుడు తెరుచుకునే ఎడిటరులో పాఠ్యాన్ని టైపు చెయ్యడం, వికీ మార్కప్ వాడి పాఠ్యాన్ని ఆకృతీకరించడం, బొమ్మలు, పట్టికలు వంటి అంశాలను చేర్చడం చెయ్యవచ్చు. ఈ రెండు అంశాల గురించి రాబోయే పాఠాల్లో నేర్చుకుంటారు.
|