చెయ్యాల్సిన మార్పుచేర్పులన్నీ చేసాక,ఇక ప్రచురించడానికి సిద్ధమని మీరు భావించినపుడు, ముందు చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి.
మీరు చేసిన మార్పులు, మీరు అనుకున్న విధంగానే ఉన్నాయని నిర్ధారించుకోడానికి, మునుజూపు చూపుబొత్తాన్ని నొక్కి మునుజూపును పరిశీలించండి. మనం మానవ మాత్రులం, పొరపాట్లు చెయ్యడం సహజం. పొరపాట్లేమైనా జరిగి ఉంటే పరిశీలించుకుని సరిదిద్దుకునే అవకాశం ఈ అంగలో లభిస్తుంది.
"దిద్దుబాటు సారాంశం" పెట్టెలో కొద్ది పాటి దిద్దుబాటు సారాంశం రాయండి. ఇతర వాడుకరులు మీరు చేసిన మార్పు ఏమిటో అది ఎందుకు చేసారో అర్థం చేసుకోడానికి అది ఉపయోగపడుతుంది. మీ వివరణ బాగాఆ క్లుప్తంగా ఉన్నా ఫరవాలేదు. ఉదాహరణకు, మీరు అక్షరదోషాలను సవరిస్తే, "అక్షర సవరణ" అని రాయవచ్చు.
మీరు చేసినది వివాదాస్పదం కాని చిన్న మార్పు అయితే (అక్షర దోషాల సవరణ, వ్యాకరన సవరణ వంటివి) "☑ ఇది ఒక చిన్న సవరణ" అనే పెట్టెలో టిక్కు పెట్టవచ్చు. చిన్న సవరణ అంటే, వాక్యపు అర్థాన్ని మార్చనివి, వివాదాస్పదం కానివీ అని అర్థం.
పేజీని మీ వీక్షణ జాబితా లోకి చేర్చాలంటే (వీక్షణ జాబితాలో ఉండే పేజీల్లో మార్పులు జరిగితే మీకు తెలుస్తుంది), "☑ ఈ పుట మీద కన్నేసి ఉంచు" పెట్టెను వాడండి. పేజీకి పైన ఉండే నక్షత్రాన్ని నొక్కి కూడా పేజీని మీ వీక్షణ జాబితా లోకి చేర్చుకోవచ్చు..
మునుజూపు చూసారా? దిద్దుబాటు సారాంశం రాసేసారా? అయితే ఇక తుది అడుగుకు సిద్ధమైనట్లే: మార్పులను ప్రచురించుబొత్తాన్ని నొక్కండి, మీరు చేసినా మార్పుచేర్పులు వికీపీడియాలో భద్రమౌతాయి!