వికీపీడియా లోని కీలకమైన అంశాల్లో వికీలింకులు ఒకటి. వికీలింకులు వికీ పేజీలను ఒకదానితో ఒకటి అనుసంధించి వికీపీడియాను ఒక కట్టగా కలిపి ఉంచుతాయి.
సాధారణంగా, ఏదైనా వ్యాసంలో వ్యాసానికి సంబంధించి ముఖ్యమైన, పాఠకులు తెలుసుకోవాల్సిన అంశాల ప్రసక్తి వచ్చినపుడు, అవి పాఠ్యంలో తొలిసారి వచ్చిన చోట లింకు పెట్టాలి.
వికీలింకు ఇవ్వాలంటే రెండు స్క్వేర్ బ్రాకెట్లను ఇలా పెట్టాలి: [[లక్ష్యిత పేజీ]]
ఏదైనా వ్యాసం పేజీకి లింకు ఒవ్వాలి, కానీ లింకులో పాఠకుడికి కనబడాల్సినది మాత్రం వేరే పాఠ్యం అయితే పైపు పట్టాలి. | divider (⇧ Shift+\):
[[లక్ష్యిత పేజీ|కనబడే పాఠ్యం]]
పేహీలోని ఏదో ఒక విభాగానికి నేరుగా లింకు ఇవ్వవచ్చు. అందుకు # వాడాలి:
[[లక్ష్యిత పేజీ#లక్ష్యిత విభాగం|కనిపించే పాఠ్యం]]
[[నందమూరి తారక రామారావు|ఎన్టీయార్]] అని రాస్తే ఎన్టీయార్ అని కనిపిస్తుంది
[[నందమూరి తారక రామారావు#చలనచిత్ర జీవితం|ఎన్టీయార్ సినిమా జీవితం]] అని రాస్తే ఎన్టీయార్ సినిమా జీవితం అని కనిపిస్తుంది
కొన్ని వ్యాసాల్లో మీకు మూసలు కనిపిస్తాయి. ఒకే విషయాన్ని అనేక పేజీల్లో చేర్చాలంటే ఈ మూసలను వాడుతారు. వీటిని ఇలా మీసాల బ్రాకెట్లలో చూపిస్తాం: {{మూస పేరు|పరామితులు}}
ఉదాహరణకు, [ఆధారం చూపాలి]అనే మూసను చేర్చాలంటే కింది కోడ్ను చేర్చాలి:
{{Citation needed|date=డిసెంబరు 2024}}