Jump to content

సీతాదయాకర్ రెడ్డి

వికీపీడియా నుండి
సీతాదయాకర్ రెడ్డి
సీతాదయాకర్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
నియోజకవర్గం దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబర్ 27, 1961
సదాశివనగర్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి కొత్తకోట దయాకర్ రెడ్డి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

సీతాదయాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరపున దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

సీతాదయాకర్ రెడ్డి 1961, అక్టోబరు 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్లో జన్మించింది. ఆర్.బి.వి.ఆర్.ఆర్. మహిళా కళాశాలలో ఇంటర్ (1977-79), బి.ఏ. (1979-82) చదివింది. 1982-84 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సోషియాలజీ చదివింది.[2]

వివాహం - పిల్లలు

[మార్చు]

1984, ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్).[3]

రాజకీయరంగ ప్రస్థానం

[మార్చు]

సీతాదయాకర్ రెడ్డి 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2001లో దేవరకద్ర జడ్పీటీసి సభ్యులుగా విజయం సాధించి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయింది. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ సుధాకర్, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ భూషణ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.ఎస్.రవి కుమార్, లోక్‌సత్తా పార్టీ తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[4][5]

2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీచేసిన ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి చేతిలో పరాజయం పొందింది.

మూలాలు

[మార్చు]
  1. 10tv Mahaboobnagar. "THURSDAY, 12 SEPTEMBER 2013 జిల్లా నుంచి గెలిచిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు". 10tvmahaboobnagar.blogspot.in. Retrieved 16 May 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  2. మైనేత.కాం. "Seetha Dayakar Reddy". myneta.info. Retrieved 16 May 2017.
  3. Sakshi (17 April 2014). "సీతమ్మ వెనక తోడు'నీడ'". Archived from the original on 2 August 2021. Retrieved 2 August 2021.
  4. EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  5. Eenadu (26 October 2023). "అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.

ఇతర లంకెలు

[మార్చు]