Jump to content

స్టేడియం మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
స్టేడియం మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationఉప్పల్, హైదరాబాదు, తెలంగాణ,
Coordinates17°24′23.4″N 78°33′01.6″E / 17.406500°N 78.550444°E / 17.406500; 78.550444
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Openedనవంబరు 29, 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-29)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

స్టేడియం మెట్రో స్టేషను, హైదరాబాదులో ఉప్పల్ ప్రాంతంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న మెట్రో స్టేషను.[1][2] హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[3]

చరిత్ర

[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

స్టేడియం ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. మెట్రో స్టేషను నుండి క్రికెట్ స్టేడియానికి అనుసంధానంగా స్కైవే నిర్మాణానికి ప్రణాళిక చేయబడింది.[4]

స్టేషను లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ రాయదుర్గం → వైపు
ఉత్తర దిశ వైపు ← నాగోల్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. "Hyderabad Metro to run midnight service for IPL matches".
  2. "'Metro for IPL from NGRI station too'".
  3. "Metro rides to Stadium are all the rage this T20 season".
  4. "Hyderabad Metro to run midnight service for IPL matches".
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

[మార్చు]