స్ట్రైక్ రేటు
స్ట్రైక్ రేట్ అనేది క్రికెట్ క్రీడలో రెండు వేర్వేరు గణాంకాలను సూచిస్తుంది. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ అనేది ఒక బ్యాటర్ ఎంత త్వరగా బ్యాటింగు చేస్తాడో కొలమానం. ప్రతి 100 బంతుల్లో చేసిన పరుగులతో దీన్ని కొలుస్తారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. బౌలింగ్ స్ట్రైక్ రేట్ అనేది బౌలర్ బౌలింగ్ సామర్థ్యానికి ఒక లెక్క. ఒక్కో వికెట్ తీయడానికి ఎన్ని బంతులు వేసాడో ఇది చెబుతుంది. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ఉత్తమం. బౌలర్ల కోసం, ఎకానమీ రేటు (పొదుపు) అనేది తరచుగా చర్చించబడే గణాంకం.
రెండు స్ట్రైక్ రేట్‌లు సాపేక్షంగా కొత్త గణాంకాలు. 1970లలో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే వీటిని కనుగొన్నారు, ఆ తరువాత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
బ్యాటింగ్ స్ట్రైక్ రేట్
[మార్చు]బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ( s/r ) అనేది బ్యాటర్‌కు సగటున 100 బంతులకు చేసిన పరుగుల సంఖ్యగా నిర్వచించబడింది. ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటరు, వేగంగా పరుగులు చేస్తాడని అర్థం.
టస్టు క్రికెట్‌లో, బ్యాటరు అవుటవకుండా పరుగులు చేయగల సామర్థ్యం తరువాత స్ట్రైక్ రేట్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. దీని అర్థం టెస్టు బ్యాటర్ల అత్యంత ముఖ్యమైన గణాంకం, స్ట్రైక్ రేట్ కంటే బ్యాటింగ్ సగటుగా పరిగణించబడుతుంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో, స్ట్రైక్ రేట్‌లకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి జట్టు ఒక ఇన్నింగ్స్‌లో పరిమిత సంఖ్యలోనే బంతులుంటాయి కాబట్టి, బ్యాటరు ఎంత వేగంగా స్కోర్ చేస్తే, జట్టు అంత ఎక్కువ పరుగులు చేయగలదు. ట్వంటీ 20 క్రికెట్‌లో 150కి పైగా స్ట్రైక్ రేట్లు సర్వసాధారణం అయ్యాయి. [1] స్ట్రైక్ రేట్ బహుశా వన్డే క్రికెట్‌లో బ్యాటర్‌కు కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం, ఎక్కువ స్ట్రైక్ రేట్లు ఉన్న బ్యాటర్లు, ముఖ్యంగా ట్వంటీ 20 మ్యాచ్‌లలో తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న వారి కంటే ఎక్కువ విలువైనవి. స్ట్రైక్ రేట్ అనేది ఒక బ్యాటర్ విభిన్న రకాల బౌలింగ్‌లకు (ఉదా. స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్) వ్యతిరేకంగా పరుగులు తీయగల సామర్థ్యాన్ని పోల్చడానికి కూడా ఉపయోగపడుతుంది.
కెరీర్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ (T20I)
[మార్చు]List of women's Twenty20 International records
Strike rate | Batter | Runs | Balls faced | Period | ||
---|---|---|---|---|---|---|
137.21 | Chloe Tryon | 1,036 | 755 | 2010–2023 | ||
132.98 | Rebecca Blake | 754 | 567 | 2022–2023 | ||
132.20 | Ashleigh Gardner | 1,248 | 944 | 2017–2023 | ||
131.05 | Shafali Verma | 1,363 | 1,040 | 2019–2023 | ||
133.41 | Alyssa Healy | 2,547 | 1,996 | 2010–2023 | ||
Qualification: 500 balls.
Last updated: 11 September 2023[2] |
కెరీర్లో అత్యధిక స్ట్రైక్ రేట్ (ODI)
[మార్చు]బౌలింగ్ స్ట్రైక్ రేట్
[మార్చు]బౌలింగ్ స్ట్రైక్ రేట్ అనేది బౌలర్‌కి సగటున ఒక వికెట్ తీసేందుకు వేసిన బంతుల సంఖ్యగా నిర్వచించబడుతుంది. తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న బౌలరు త్వరగా వికెట్లు తీయడంలో ప్రభావవంతంగా ఉంటాడని అర్థం.
1980వ దశకంలో వన్-డే క్రికెట్ ఎదిగే సమయంలో బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌కు తోడుగా దీన్ని ప్రవేశపెట్టినప్పటికీ, బౌలింగ్ స్ట్రైక్ రేట్‌కు వన్-డే ఇంటర్నేషనల్‌ల కంటే టస్టు క్రికెట్‌లో నిస్సందేహంగా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే టస్టు క్రికెట్‌లో బౌలరు ప్రాథమిక లక్ష్యం వికెట్లు తీయడం, అయితే వన్డే మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేస్తే సరిపోతుంది - తక్కువ వికెట్లు తీసినప్పటికీ వీలైనన్ని తక్కువ పరుగులు ఇవ్వడం.
అత్యుత్తమ కెరీర్ స్ట్రైక్ రేట్ (వన్‌డే, T20I)
[మార్చు]అత్యుత్తమ కెరీర్ స్ట్రైక్ రేట్ (టస్టు)
[మార్చు]
|
|
|
|
మూలాలు
[మార్చు]- ↑ "Records - Twenty20 Internationals - Batting records - Highest career strike rate - ESPN Cricinfo".
- ↑ "Records–Twenty20 Internationals–Batting records–Highest career strike rate–ESPN Cricinfo". ESPNcricinfo. ESPN. Retrieved 1 February 2023.
- ↑ 3.0 3.1 "Test matches – Bowling records – Best career strike rate". Cricinfo. ESPN. Retrieved 26 February 2021.
- ↑ "Women Test matches | Bowling records | Best career strike rate". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-27.
- ↑ https://stats.espncricinfo.com/ci/engine/stats/index.html?class=8;filter=advanced;orderby=bowling_strike_rate;qualmin2=500;qualval2=balls;size=200;template=results;type=bowling