హర్షవర్థనుడు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
హర్షుని సామ్రాజ్యము हर्षवर्धन హర్షవర్థనుడు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
607–647 | |||||||||
రాజధాని | కనౌజ్ | ||||||||
ప్రభుత్వం | ఏకరాజాధిపత్యము | ||||||||
Emperor | |||||||||
• 606–647 | చిత్ర | ||||||||
చరిత్ర | |||||||||
• స్థాపన | 607 | ||||||||
• పతనం | 647 | ||||||||
|
హర్షవర్థనుడు లేదా హర్షుడు భరతమాత మేటి పుత్రులలో ఒకడైన చక్రవర్తి భారతదేశ చరిత్రలో హర్షుని పేరు మిక్కిలి ప్రసిద్ధికెక్కినది శాంతి యుద్ధము ఈ రెండు రంగాములలోను అతను సరిసమానమైన కీర్తిని గడించెను . అతడు ఒక మహా చక్రవర్తి, ధీర వీర సైన్యధిపతి, సహిత్య కాలాభిమాని, నాటక కర్త మహనీయ గుణసంపన్నుడు ఆకర్షనీయమైన వ్యక్తి.
స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించి హిందూస్థానాన్ని పాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి హర్షవర్థనుడు. గౌడ శశాంకుడి నుంచి కనౌజ్‌ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్‌కు మార్చాడు. శశాంకుడి అనంతరం గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది. హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టుడు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తుంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. కానీ పులకేశి వారసులు ఈ యుద్ధంలో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు.
ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. పండిన పంటలో 1/6వ వంతుని శిస్తుగా వసూలు చేసేవాడు. ప్రభుత్వాధికారులకు జీతాలకు బదులు భూములు ఇచ్చేవాడు. దీన్ని ఫ్యూడలిజం అంటారు. బానిసలతో బలవంతంగా పని చేయించేవాడు. హర్షుడు స్వయానా కవి. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు. మయూరుడు సూర్యశతకాన్ని, భర్తృహరి శృంగార, వైరాగ్య శతకాలను రచించాడు. నలంద, వల్లభి విశ్వవిద్యాలయాలు ఇతడి కాలంలో వర్థిల్లాయి.
సా.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. ఏటా రాజధానిలో బౌద్ధమత సమావేశాలు నిర్వహించేవాడు. నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానంగా ఇచ్చాడు. అందుకే ఇతని కాలంలో నలంద బౌద్ధ విశ్వవిద్యాలయం చాలా ఉన్నత దశలో ఉందని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. 10 వేల మంది విద్యార్థులు, 1,500 మంది గురువులతో ఈ విశ్వవిద్యాలయం గొప్పగా విలసిల్లిందని అతడు తెలిపాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు. హర్షుడు పండిత పోషణకు తన ఆదాయంలో 1/4 వంతు వినియోగించాడు.హర్షుని కాలం రాజ భాష : సంసృతం.
సంస్కృతంలో గౌతమ బుద్ధుని అవతారమని చెప్పబడే జీమూత వాహనుని కథను నాగానంద నాటకంగా రచించి యశస్సును పొందాడు. గర్భవతి అయిన వాసవదత్త విమానంలో ఉదయనునితోను యౌగంధ రాయణుతోను కలసి విహారయాత్ర చేస్తూ ఉంటుంది. ఆమెకు అంతకుముందు తాను ఆకాశంలో ఎగురుతూ వుంటే విద్యాధర కన్యకలు వచ్చి గానం చేస్తూ తన్ను సేవిస్తున్నట్లు స్వప్నం వస్తుంది. అందుకని ఈవిద్యాధరులను గూర్చి వినగోరుతున్నానని ఆమె అడుగగా యౌగంధరాయణుడు అమ్మా! మీకు వచ్చింది దివ్య స్వప్నం. మీ గర్భాన విద్యాధరుడెవరో జన్మించబోతున్నాడు. విద్యాధరులంటే మహాత్ములు. ఉదాహరణకు మహాసత్వుడుగా, దానవీరుడిగా అయిన జీమూతవాహనుడనే విద్యాధరుని కథను చెబుతాను వినండి. అని ఆ కథ చెబుతాడు. దీనిని హర్షుడు తన నాగానంద నాటకవృత్తాంతంగా స్వీకరించాడు. గుణాడ్యుడు రచించిన బృహత్కథఈ కథకు మూలకర్త. ఆయన వ్రాసిన జీమూత వాహనుని కథలో కొన్ని మార్పులూ జేర్పులూ చేశాడు. హర్షుడు సా.శ. 7వ శతాబ్దం వాడు. గుణాఢ్యుడు శాతవాహనుని సమకాలికుడు. అంటే క్రీ.పూ. 2వ శతాబ్దం వాడు. అతను రాజు పుష్పవర్మన్ కుమార్తె పుష్పవతిని వివాహం చేసుకున్నాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- 1974 భారతి మాస పత్రిక. వ్యాసము: గుణాఢ్యుడు-హర్షుడు వ్యాసకర్త:డా.ముదిగొండ శివప్రసాద్
- ↑ Schwartzberg, Joseph E. (1978). A Historical atlas of South Asia. Chicago: University of Chicago Press. p. 146, map XIV.2 (d). ISBN 0226742210.