హైడ్రోకొర్టిసోన్
హైడ్రోకొర్టిసోన్ ఒక స్టెరాయిడ్ (కొర్టికోస్టెరాయిడ్) ఔషధం.నొప్పి, దురద, వాపు (మంట) తగ్గించడానికి శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందనను శాంతపరచడం ద్వారా ఇది పనిచేస్తుంది. సహజ ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ తగినంతగా లేని వ్యక్తులకు ఇది హార్మోన్ పునఃస్థాపనగా కూడా ఉపయోగించవచ్చు. హైడ్రోకొర్టిసోన్ అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఔషధం వివిధ రూపాల్లో వస్తుంది, వీటిలో శరీరం, తల చర్మం కోసం క్రీములు, ఇంజెక్షన్లు, మాత్రల రూపంలో ఉండును.[1]
హైడ్రోకొర్టిసోన్ అణు నిర్మాణం
[మార్చు]హైడ్రోకొర్టిసోన్ లేదా కార్టిసోల్ అనేది 17ఆల్ఫా-హైడ్రాక్సీ-సి21-స్టెరాయిడ్, ఇది 3, 20 స్థానాల్లో ఆక్సో గ్రూపులు, 11, 17, 21 స్థానాల్లో హైడ్రాక్సీ గ్రూపులచే ప్రెగ్నన్-4-ఎన్ ప్రత్యామ్నాయంగా ఉంటుంది.[2] కొర్టిసొల్ అనేది కొ ర్టికోస్టెరాయిడ్ హార్మోన్ లేదా గ్లూకోకార్టికాయిడ్ అనేది జోనా ఫాసిక్యులాటా ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. అడ్రినల్ కొర్టెక్స్, ఇది అడ్రినల్ గ్రంథిలో ఒక భాగం.హైడ్రోకొర్టిసోన్, లేదా కొ ర్టిసోల్, అడ్రినల్ కార్టెక్స్ ద్వారా స్రవించే గ్లూకోకార్టికాయిడ్.హైడ్రోకొర్టిసోన్ రోగనిరోధక, శోథ, నియోప్లాస్టిక్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.దీనిని 1930లలో ఎడ్వర్డ్ కెండాల్ కనుగొన్నారు, దీనిరసాయన సమ్మేళనానికి ఎఫ్ లేదా 17-హైడ్రాక్సీకార్టికోస్టెరాన్ అని పేరు పెట్టారు.హైడ్రోకొర్టిసోన్ 5 ఆగస్టు 1952న FDA ఆమోదం పొందింది.[3]
సంశ్లేషణ
[మార్చు]హైడ్రోకొర్టిసోన్, ఇతర కొర్టికోస్టెరాయిడ్స్ యొక్క బయోసింథసిస్ క్షీరదాల అడ్రినల్ గ్రంధిలో సంభవిస్తుంది.సాధారణ పూర్వగామి కొలెస్ట్రాల్.హైడ్రోకార్టిసోన్ యొక్క తక్షణ పూర్వగాములు ప్రాథమికంగా 11-డెసోక్సీ-కార్టిసోల్, ఇది 11β హైడ్రాక్సిలేట్ ఎంజైమ్‌గా ఉంటుంది, కార్టికోస్టెరాన్, ఇది కార్బన్ 17 వద్ద హైడ్రాక్సిలేట్ చేయబడుతుంది.హైడ్రోకొర్టిసోన్ α, β-అసంతృప్త కీటోన్‌లకు విలక్షణమైన అతినీలలోహిత శోషణ స్పెక్ట్రమ్‌ను ప్రదర్శిస్తుంది.హైడ్రోకార్టిసోన్ మాస్ స్పెక్ట్రమ్‌లోని క్షేత్ర నిర్జలీకరణ గతిశాస్త్రం (M-C2H3O2)+ అయాన్లు హైడ్రోకార్టిసోన్ మాలిక్యులర్ అయాన్ యొక్క గ్యాస్ ఫేజ్ వియోగం ద్వారా ఏర్పడతాయని సూచిస్తున్నాయి>10−9.8 s.[4]
భౌతిక ధర్మాలు
[మార్చు]లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C21H30O5[5] |
అణు భారం | 362.5 గ్రా /మోల్[5] |
స్థితి | ఘన స్థితి [6] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 220°C[5] |
వాసన | వాసన లేదు[7] |
హైడ్రోకొర్టిసోన్ రంగు తెల్లని స్పటికాకర రూపం[7] అలాగే వాసన లేదుమరియు చేదు గా వుండును.[7]
వివిధ ద్రావకాలలో ద్రావణీయత
[మార్చు]హైడ్రోకొర్టిసోన్ ద్రవాణీయత వివిధ ద్రవకాలల్లో ఈ క్రింది విధంగా[8]
ద్రావణం/ద్రావణి | మి.గ్రా /మి.లీ 25°వద్ద |
ఇథనాల్ | 15.0 |
మిథనాల్ | 6.2 |
అసిటోన్ | 9.3 |
క్లోరోఫామ్ | 1.6 |
ఈథర్ | 0.35 |
పాలి ప్రొపైలిన్ గ్లైకోల్ | 12.7 |
ఔషధంగా ఉపయోగాలు
[మార్చు]- హైడ్రోకొర్టిసోన్ ను చ్గర్మం ఎరుపు గా మారడం, వాపు, దురద, వివిధ చర్మ రోగ అసౌకర్యానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. హైడ్రోకార్టిసోన్, కార్టికోస్టెరాయిడ్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది వాపు, ఎరుపు, దురదను తగ్గించడానికి చర్మంలోని సహజ పదార్ధాలను సక్రియం చేయడం ద్వారా పనిచేస్తుంది.[9]
ఈ ఔషధం ఎలా ఉపయోగించాలి?
[మార్చు]- హైడ్రోకార్టిసోన్ చర్మంపై ఉపయోగం కోసం లేపనం, క్రీమ్, ద్రావణం (ద్రవ), స్ప్రే వంటి ఔషదం రూపంలో వస్తుంది. చర్మ సమస్యలకు సాధారణంగా హైడ్రోకార్టిసోన్ నురోజుకు ఒకటి నుండి నాలుగు సార్లు ఉపయోగిస్తారు.ప్రతిరోజూ దాదాపు ఒకే సమయంలో ఉపయోగించాలి.ఖచ్చితంగా వైద్యుడు సూచించిన విధంగా హైడ్రోకార్టిసోన్ ఉపయోగించాలిడ. వైద్యుడు సూచించిన దాని కంటే ఎక్కువ లేదా తక్కువ లేదా ఎక్కువసార్లు వాడరాదు.[9]
- ఈ ఔషధం చర్మంపై ఉపయోగం కోసం మాత్రమే. హైడ్రోకార్టిసోన్ కళ్ళు లేదా నోటిలోకి వెళ్ళనివ్వరాదు.అలాగే దానిని తిన/మింగరాదు.[9]
- సహజ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగినంతగా లేని వ్యక్తులకు ఇది హార్మోన్ పునఃస్థాపనగా కూడా ఉపయోగించవచ్చు.[10]
- హైడ్రోకొర్టిసోన్ ను,తామర, కాంటాక్ట్ డెర్మటైటిస్ (చర్మం తాకిన వాటికి ప్రతిస్పందించినప్పుడు),వేడి దద్దుర్లు (చెమట కాయలు),కీటకాలు కాటు, కుట్టడం వలన ఏర్పడిన ప్రతిచర్యల నివారణకు,సోరియాసిస్ కు,నురగు పొక్కులకు నివారణ ఔషధంగా వాడెదరు.[10]
దుష్పలితాలు
[మార్చు]హైడ్రోకొర్టిసోన్ ఔషధంగా అవసరమైన ప్రభావాలతో పాటు, కొన్ని అవాంఛిత ప్రభావాలను కలిగిస్తుంది. ఈ దుష్ప్రభావాలన్నీ సంభవించకపోయినా, అవి సంభవించినట్లయితే వారికి వైద్య సహాయం అవసరం కావచ్చు.[11]
కొన్ని సాధారణ దుష్పలితాలు
[మార్చు]- దూకుడు గా ప్రవర్తించడం
- ఆందోళన గా వుందటం
- దృష్టి మసక గా అవడం
- కళ్ళు మంట, పొడి లేదా దురద రావడం
- మూత్రం విసర్జన మొత్తంలో తగ్గుదల
- మైకము కమ్మడం
- నోరు ఎందిపోవడం
- చెవి లో రోదగా అనిపించడం
- జ్వరం
- తలనొప్పి
- క్రమరహిత హృదయ స్పందనలు
- చిరాకు కలగడం
- మానసిక వ్యాకులత
- చేతులు లేదా కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు
- ముక్కు కారడం లేదా మూసుకుపోవడం
- వణుకు పుట్తడం
- తుమ్ములు
- గొంతు మంట
- వేళ్లు, చేతులు, పాదాలు లేదా దిగువ కాళ్ళ వాపు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- నిద్రకు ఇబ్బంది
- ఆలోచించడం, మాట్లాడటం లేదా నడవడంలో ఇబ్బంది
- అసాధారణ అలసట లేదా బలహీనత
- బరువు పెరుగుట
ఇవి కూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Hydrocortisone". nhs.uk. Retrieved 2024-04-06.
- ↑ "cortisol". ebi.ac.uk. Retrieved 2024-04-06.
- ↑ "Hydrocortisone". go.drugbank.com. Retrieved 2024-04-06.
- ↑ "Hydrocortisone". sciencedirect.com. Retrieved 2024-04-06.
- ↑ 5.0 5.1 5.2 {{citeweb|url=https://pubchem.ncbi.nlm.nih.gov/compound/Hydrocortisone |title=Hydrocortisone |publisher= pubchem.ncbi.nlm.nih.gov|accessdate=2024-04-06}
- ↑ "Showing metabocard for Cortisol (". hmdb.ca. Retrieved 2024-04-06.
- ↑ 7.0 7.1 7.2 Lewis, R.J. Sr.; Hawley's Condensed Chemical Dictionary 14th Edition. John Wiley & Sons, Inc. New York, NY 2001., p. 585
- ↑ O'Neil, M.J. (ed.). The Merck Index - An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals. 13th Edition, Whitehouse Station, NJ: Merck and Co., Inc., 2001., p. 855
- ↑ 9.0 9.1 9.2 "Hydrocortisone Topical". medlineplus.gov. Retrieved 2024-04-07.
- ↑ 10.0 10.1 "Hydrocortisone". nhs.uk/. Retrieved 2024-04-07.
- ↑ "Hydrocortisone (Oral Route)". mayoclinic.org. Retrieved 2024-04-07.