హైయన్ తుఫాన్

వికీపీడియా నుండి
(హైయాన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హైయన్ టైఫూన్ (యొలాండా)
Typhoon (JMA)
Category 5 సూపర్ టైఫూన్ (SSHS)
Typhoon Haiyan approaching the Philippines on November 7, 2013
Typhoon Haiyan approaching the Philippines on November 7, 2013
ఏర్పడిన తేదీ నవంబరు 3, 2013 (2013-11-03)
సమసిపోయిన తేదీ నవంబరు 11, 2013 (2013-11-11)
అత్యధిక గాలులు 10-minute sustained:
230 km/h (145 mph)
1-minute sustained:
315 km/h (195 mph)
అత్యల్ప పీడనం 895 mbar (hPa); 26.43 inHg
(Preliminary)
మరణాలు 1,804 confirmed, >10,000 reported
నష్టం $710.6 million (2013 USD)
(Preliminary total)
ప్రభావిత ప్రాంతాలు
Part of the 2013 పసిఫిక్ తైఫూన్ కాలం

హైయన్ తుఫాను (ఫిలిప్పీన్స్ లో "టైఫూన్ యొలాండా"గా పిలుస్తారు) అనేది అనధికారికంగా అత్యంత బలమైన తుఫానుగా నమోదు చేయబడిన తుఫాను. ఇది భూమి పై 315 km/h (195 mph).[1] వేగం గలిగిన పెద్ద తుపాను. ఇది "2013 పసిఫిక్ తుపాను కాలం"లో 13 వ తుఫానుగా నమోదు చేయబడింది. ఈ తుఫాను నవంబర్ 2 న ఫెడరేటెడ్ స్టేట్ ఆఫ్ మైక్రోనేసియా లోని పోన్‌పైకు కొన్ని వందల కిలోమీటర్ల ఆగ్నేయంగా అత్యల్ప పీడనంతో ప్రారంభమైనది. ఇది ఆ తర్వాత ట్రాపికల్ తుఫానుగా తయారైన తర్వాత నవంబర్ 4 వ తేదీ 000 UTC లకు దీనికి "హైయన్"గా నామకరణం చేశారు. ఇది నవంబర్ 5 వ తేదీ 1800 UTC లకు తీవ్రరూపం దాల్చి శరవేగంతో ఉధృతంగా తయారైనది. నవంబర్ 6 న జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ (JTWC) దీనిని ఐదవ వర్గం సూపర్ తుఫానుగా సాఫిర్ సింప్సన్ హరికేన్ విండ్ స్కేలుపై నమోదు చేసింది. ఈ తుఫాను బలం పొందిన తర్వాత పలావ్ లోని కయాంజెల్ మీదుగా ప్రయాణించింది. ఆ తర్వాత ఇది తీవ్ర రూపంలో కనసాగి నవంబర్ 7 వ తేది 200 UTC లకు జపాన్ మెటొరాజికల్ ఏజెన్సీ (JMA) దీని గాలితీవ్రతను పది నిమిషాల గాలి ప్రవాహాలు 315 km/h (195 mph) వేగంతో ఉన్నట్లు నవీకరించారు. అనధికారికంగా "హైయన్" నిరంతరం పరిశీలించిన తుఫానులలో నాల్గవ అత్యంత తీవ్ర ఉష్ణ తుఫానులగా తయారైనది. అనేక గంటల తర్వాత ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో గుయన్, తూర్పు సమర్ ప్రాంతంలో తీరం దాటినది. తీరం దాటిన సందర్భంలో కూడా దాని తీవ్రత తగ్గలేదు. పరిశీలిస్తే "హైయన్" తుఫాను తీరం దాటిన బలమైన తుఫానుగా రికార్డులకెక్కింది. ఇది వరకు 1969 అట్లాంటిక్ హరికేన్ కాలం లో 305 km/h (190 mph) వేగంతో ఉన్న తుఫాను రికార్డును ఈ "హైయన్" తుఫాను అధికమించింది. క్రమంగా బలహీనపడి ఈ తుఫాను ఐదు ద్వీపాల భూభాగాలలో తీరందాటి దక్షిణ చైనా సముద్రం గుండా పోయింది. ఇది నైరుతి దిశగా తిరిగి ఉత్తర వియాత్నాంలో నవంబరు 10 న ప్రమాదకర తుఫానుగా ప్రవేశించింది. ఈ తుఫాను ఫిలిప్పీన్స్ లో తీవ్ర నష్టం కలిగించింది. ప్రత్యేకంగా సమార్ ద్వీపం, లేటే ప్రాంతాలు ఈ తుఫాను ధాటికి అతలాకుతలం అయినవి. ఆ ప్రాంత గవర్నర్ అంచనాల ప్రకారం ఒక్క టాల్కోబాన్ లోనే 10,000 వరకు మరణాలు సంభవించినట్లు తెలిసింది.[2]

తుఫాను వలన నష్టం

[మార్చు]
Satellite image of a large tropical cyclone. Though there is no eye, multiple rainbands wrap in an organized fashion about the storm's center.
Typhoon Haiyan over the Philippines on November 8
Animated enhanced infrared satellite loop of Typhoon Haiyan from peak intensity to landfall in the Philippines

భయంకర తుఫాను హైయన్ ధాటికి ఫిలిప్పైన్స్ విలవిలలాడింది. ఈ పెను తుఫాను ధాటికి 10,000 మందికి పైగా మరణించి ఉంటారని భయపడుతున్నారు. ఒక్క లేటి ద్వీప రాష్ట్రంలోనే 10,000 మందికి పైగా మరణించారని, సమర్ ద్వీపంలో మరణాలు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఫిలిప్పైన్స్ అధికారులు చెబుతున్నారు. లేటే రాష్ట్రం మొత్తం దాదాపు నాశనం అయిందని స్ధానిక అధికారులను ఉటంకిస్తూ "రష్యా టుడే"లో తెలిపింది. లేటి రాష్ట్రంలో 80 శాతం భాగం పూర్తిగా ధ్వంసం అయిందని ఆ రాష్ట్ర చీఫ్ సూపరింటెండ్ ఎల్మర్ సోరియా చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. చనిపోయినవారిలో అత్యధికులు నీళ్ళలో మునిగిపోవడం వలన గానీ, భవనాలు కూలిపోవడం వలన గానీ చనిపోయారని ఫిలిప్పైన్స్ అధికారులు చెప్పారు. టాక్లోబన్ నగర అధికారి టెక్సన్ లిమ్ ప్రకారం ఒక్క టాక్లోబన్ నగరంలోనే మరణాల సంఖ్య 10,000 దాటుతుంది (ఎ.ఎఫ్.పి).

ఫిలిప్పైన్స్ హోమ్ కార్యదర్శి (మన హోమ్ మంత్రితో సమానం) మార్ రోగ్జాస్ పరిస్ధితిని “భయంకరం”గా అభివర్ణించాడు. ఈ తుఫాను తాకిడి వల్ల ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా మృత కళేబరాలే. ఆధునిక జీవనానికి సంబంధించిన అన్నీ సౌకర్యాలూ, వ్యవస్థలూ -సమాచార వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా- నాశనం అయ్యాయి. మీడియా కూడా పని చేయకపోవడంతో ప్రజలను సామూహికంగా సహాయంకోసం సంప్రదించే మార్గం లేకుండా పోయింది. ఇంత భారీ స్ధాయిలో ప్రజలు చనిపోవడం ఫిలిప్పైన్స్ లో ఇదే ప్రథమం. ఫిలిప్పైన్స్ చరిత్రలోనే ఇంత భారీ జన, ధన, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.

నవంబరు 10 మధ్యాహ్నానికి తుఫాను వియత్నాం తీరం దాటవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. తీర ప్రాంతాల నుండి 5 లక్షల మందికి పైగా ప్రజలను వియాత్నాం ప్రభుత్వం ఖాళీ చేయించింది.

సమర్ ద్వీపంలో 300 మందికి పైగా మరణించినట్లు ధ్రువీకరించగా 2,000 మంది ఆచూకీ గల్లంతయింది. తీర ప్రాంతంలో సముద్ర అలలు 20 నుండి 50 అడుగుల వరకు ఎగిసిపడ్డాయి. ఈ ద్వీపంలో అనేక గ్రామాలకు ఇంకా చేరుకోవలసి ఉంది. విద్యుత్ లేదు. టవర్లు కూలిపోవడంతో సెల్ ఫోన్ సంకేతాలు కూడా అందడం లేదు. నీటి ప్రవాహం వల్ల రోడ్డు సౌకర్యాలు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. ఫలితంగా అనేక గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.

ఇతర ద్వీపాలలో కూడా అనేక మంది చనిపోయియారు.

అంతర్జాతీయ సహాయం

[మార్చు]

తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలకు వివిధ అంతర్జాతీయ సంస్ధలు సహాయం చేసే ఏర్పాట్లలో ఉన్నాయి. ఇప్పటివరకు రెడ్ క్రాస్ సంస్ధ సహాయ పనుల్లో ముందంజలో ఉంది. వివిధ చోట్ల చిక్కుకుపోయినవారిని వెతికి రక్షించడానికి సిబ్బందిని పంపుతామని, ఒక మొబైల్ ఆసుపత్రి కూడా పంపగలమని రష్యా అత్యవసర శాఖ మంత్రి ప్రకటించాడు. 50 మంది సిబ్బంది 2 విమానాలు పంపనున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు. సహాయానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. తమ నౌకాదళం నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

ఐరాస ప్రకృతి విపత్తు సహాయ విభాగం బృందం టాక్లోబన్ నగరానికి చేరుకుంది. స్ధానిక అధికారుల నేతృత్వంలో సహాయ కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్నామని UNDAC ప్రతినిధి తెలిపారు. ఐరాస పిల్లల సంస్ధ UNICEF, ప్రపంచ ఆహార సంస్ధలు కూడా రంగంలోకి దిగాయి. UNICEF ప్రకారం 1.7 మిలియన్ల మంది పిల్లలు హైయన్ వల్ల ప్రభావితులయ్యారు. అత్యవసర ఔషధాలు, పోషకార సరఫరాలు, రక్షిత నీరు తదితర సరఫరాలు అందించే ప్రయత్నం చేస్తున్నామని UNICEF ప్రతినిధులు తెలిపారు.

ప్రపంచ ఆహార సంస్ధ ఇప్పటివరకు 2 మిలియన్ డాలర్లను హైయన్ తుఫాను సహాయ కార్యక్రమాలకు కేటాయించినట్లు తెలిపింది. బాధితులకు 40 మెట్రిక్ టన్నుల హై ఎనర్జీ బిస్కట్లు పంపామని తెలిపింది. ‘సేవ్ ద చిల్డ్రన్’, ‘వరల్డ్ విజన్’ తదితర ఎన్.జి.ఓ సంస్ధలు కూడా రంగంలోకి దిగాయి. ఈ రెండు సంస్ధలు ఆన్ లైన్ ద్వారా నిధులు సేకరించే కార్యక్రమానికి ఉపక్రమించాయి.

మూలాలు

[మార్చు]
  1. Sedghi, Ami (November 8, 2013). "Typhoon Haiyan: how does it compare with other tropical cyclones? | World news". The Guardian. Retrieved November 11, 2013.
  2. Sunshine Lichauco de Leon and Calum MacLeod (November 11, 2013). "Horror stories as 10,000 feared dead in Typhoon Haiyan". USA Today. Retrieved November 11, 2013.

ఇతర లింకులు

[మార్చు]