అందరూ దొంగలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందరూ దొంగలే
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణం అక్కినేని ఆనందరావు
తారాగణం శోభన్ బాబు,
లక్ష్మి
ఎస్.వి.రంగారావు,
నాగభూషణం,
సత్యనారాయణ
నిర్మాణ సంస్థ పల్లవి ప్రొడక్షన్స్
భాష తెలుగు

"విక్టోరియా 203" హిందీ సినిమా ఆధారంగా నిర్మించబడ్డ చిత్రం. హీరో హీరోయిన్లు శోభన్, లక్ష్మి ఐనా చిత్రానికి ప్రధానాకర్షణ ఎస్.వి.రంగారావు, నాగభూషణం ధరించిన దొంగల పాత్రలే. వీరిపై రెండు పాటలు చిత్రీకరింపబడ్డాయి (చంటిబాబు ఓ బుజ్జి బాబు, గురుదేవ మహదేవ). హిందీలో ఈ పాత్రల్ని అశోక్ కుమార్, ప్రాణ్ లు పోషించారు. ఒక గుర్రపుబండిలో దాచబడ్డ వజ్రాలకు సంబంధించి కథ. (బొంబాయి (ముంబయ్) లో గుర్రపు బళ్ళను విక్టోరియా లని పిలుస్తారు.) వి.రామకృష్ణ నేపథ్యగానంతో కొన్ని హిట్ గీతాలున్నాయి.

పాటలు


వరుస సఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద కొసరాజు రాఘవయ్య చౌదరి కె.వి.మహదేవన్
2 గుడు గుడు గుంచం గుళ్లో రాగం కె.వి.మహదేవన్
3 చూసానురా ఈ వేళ కె.వి.మహదేవన్
4 చంటి బాబు...ఓ బుజ్జి బాబు ఆరుద్ర కె.వి.మహదేవన్