అంపిలేపి

వికీపీడియా నుండి
(అడవి మామిడి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అంపిలేపి ఒక ఆకులు రాల్చే వృక్షం, సాధారణంగా 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది, కొన్ని సందర్భాలలో 27 మీటర్ల ఎత్తు కూడా పెరుగుతుంది. అంపిలేపిని అడవిమామిడి, అధ్వము, అంబాళము అని కూడా అంటారు. ఈ చెట్టును ఆంగ్లంలో వైల్డ్ మ్యాంగో (Wild Mango), ఇండియన్ హాగ్ ప్లం (Indian hog plum) అంటారు. ఈ చెట్టు యొక్క వృక్ష శాస్త్రీయ నామం స్పాండియాస్ మ్యాంగిఫిరా (Spondias mangifera), ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు పసుపు గోధుమ రంగుతో కూడిన మృదువైన శాఖలతో ఉంటుంది. ఆకు కాడలు 10 నుంచి 15 సెం.మీ. పొడవు ఉంటాయి. 5 నుంచి 11 ఎదురెదురుగా ఉన్న చిన్న ఆకుల సమ్మేళనంతో రెమ్మలు 30 నుంచి 40 సెం.మీ. పొడవు ఉంటాయి. చిన్న ఆకులు (లీఫ్లెట్స్) దీర్ఘచతురస్ర అండాకారం నుంచి దీర్ఘచతురస్ర వృత్తాకారం వరకు 7 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు, 4 నుంచి 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. ఆకు పునాది భాగం కొడవలి ఆకారం నుంచి గుండ్రని ఆకారంలో మొదలై తరచుగా ఏటవాలుగా ఉండి చివరన మొన వలె ఉంటుంది.

మార్చి, ఏప్రిల్ నెలల్లో పుష్పిస్తుంది.

ఆయుర్వేదం

[మార్చు]

చెట్టు బెరడు, కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.


మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అంపిలేపి&oldid=4299236" నుండి వెలికితీశారు