అనోనేసి

వికీపీడియా నుండి

అనోనేసి
Annona squamosa fruit
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Magnoliales
కుటుంబము: అనోనేసి
Juss.
ప్రజాతులు
See text

అనోనేసి (Annonaceae) కుటుంబంలో దాదాపు 80 ప్రజాతులకు చెందిన 820 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాలలో వ్యాప్తిచెంది ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 129 జాతులను గుర్తించారు.

[మార్చు] కుటుంబ లక్షణాలు

  • వృక్షాలు లేదా పొదలు, కొన్ని ఎగబ్రాకే పొదలు, కలప గ్రంధి భరితం.
  • లఘుపత్రాలు, ఏకాంతరము, పుచ్ఛరహితము.
  • ఒంటరి పుష్పాలు, త్రిభాగయుతము, అర్థచక్రీయము.
  • పొడవైన, శంఖువంటి పుష్పాసనము.
  • కేసరములు, ఫలదళములు అనేకము, అసంయుక్తము, సర్పిలాకారంగా అమరి ఉంటాయి.
  • సంకలితఫలము, చిరుఫలము, మృదుఫలము.
  • రూమినేట్ అంకురచ్ఛదము.

[మార్చు] ముఖ్యమైన మొక్కలు

  • అనోనా స్క్వామోజా - (సీతాఫలం)
  • అనోనా రెటిక్యులేటా - (రామాఫలం)
  • అనోనా మ్యూరికేటా - (లక్ష్మణఫలం)

[మార్చు] మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
పేజీకి సంభందించిన లింకులు