Jump to content

అరవింద్ అడిగ

వికీపీడియా నుండి
అరవింద్ అడిగ

అరవింద్ అడిగ (ఆంగ్లం: Aravind ; (కన్నడం: ಅರವಿಂದ ಅಡಿಗ) (జననం: 23 అక్టోబర్ 1974) భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వంద్వ పౌరుసత్వం కలిగిన పాత్రికేయుడు, రచయిత. ఇతను రచించిన ది వైట్ టైగర్ (The White Tiger) అను నవల 2008 వ సంవత్సరపు బుకర్ బహుమతిని గెలచింది.

బాల్యం, చదువు

[మార్చు]

అరవింద్ అడిగ 1974న చెన్నైలో, కర్ణాటకకు చెందిన మాధవ అడిగ, ఉషా దంపతులకు జన్మించాడు. అరవింద్ తండ్రి, తండ్రి కె.సూర్యనారాయణ అడిగ కర్ణాటక బ్యాంక్ చైర్మన్ గా పనిచేశాడు.[1][2] అతని తాత (అమ్మ వైపు) యు.రామారావు, మద్రాసులో ప్రముఖ డాక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. [3]

అరవింద్ మంగళూరులో పెరిగాడు. అక్కడ కెనెరా ఉన్నత పాఠశాలలోనూ, సెయింట్ అలోయిసస్ కళాశాలలోనూ చదువుకున్నాడు. 1990లో ఎస్.ఎస్.ఎల్.సిలో రాష్ట్రంలోనే మొదటి స్థానం సంపాదించాడు అతను.[2][4]

కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వలస వెళ్ళిపోయిన తరువాత, సిడ్నీలోని జేమ్స్ రూస్ అగ్రికల్చరల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు అరవింద్. ఆ తరువాత, 1990లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రముఖ లెక్చరర్ సిమన్ షామా వద్ద చదువుకున్న అరవింద్ తన బ్యాచ్ లో రెండవ స్థానంలో నిలిచినందుకు సాల్యుటటొరియన్ అనే బిరుదును కూడా పొందాడు.[5] ఆక్స్ ఫర్డ్ లోని మగ్డలెన్ కళాశాలలో కూడా చదువుకున్నాడు అతను.

కెరీర్

[మార్చు]

పాత్రికేయునిగా తన కెరీర్ ను ఫినాన్షియల్ టైమ్స్ అనే పత్రికలో ఫినాన్షియల్ జర్నలిస్ట్ గా ఇంటెర్న్ షిప్ తో ప్రారంభించాడు అరవింద్. అతను రాసే వ్యాసాలు ఫినాన్షియల్ టైమ్స్, మనీ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. స్టాక్ మార్కెట్, పెట్టుబడి రంగాల గురించి వ్యాసాలు రాసేవాడు అతను. తన కెరీర్ లో డోనాల్డ్ ట్రంప్ వంటి వారితో సహా ఎందరో వ్యాపార ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు అరవింద్. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న రచయిత పీటర్ క్యారీ రాసిన ఆస్కార్ అండ్ లుకిండా అనే పుస్తకంపై అరవింద్ రాసిన సమీక్ష, అంతర్జాతీయ సాహిత్య సమీక్షా వెబ్ సైట్ ది సెకెండ్ సర్కిల్ లో ప్రచురితమైంది.[6]

ఆ తరువాత టైం పత్రిక అతన్ని ఉద్యోగంలోకి తీసుకుంది. ఆ పత్రికలోనే దక్షిణ ఆసియా మొత్తానికి కరెస్పాండెంట్ గా మూడేళ్ళు పనిచేశాడు అతను. ఆ తరువాత ఫ్రీలాన్స్ పాత్రికేయునిగా మారాడు.[7] ఆ సమయంలోనే " ది వైట్ టైగర్ " అనే పుస్తకాన్ని రాశాడు అరవింద్. ప్రస్తుతం భారతదేశంలో, మహారాష్ట్రలోని ముంబైలో ఉంటున్నాడు అరవింద్.[8]

బుకర్ ప్రైజ్

[మార్చు]

అరవింద్ రాసిన మొట్టమొదటి నవల "ది వైట్ టైగర్" తోనే బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం విశేషం. 2008 సంవత్సరానికిగానూ ఈ పురస్కారం అందుకున్నాడు అతను. ఈ పురస్కారం పొందిన నాలుగవ భారతీయ రచయిత అరవింద్. అతనికి ముందు సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ (భారత సంతతికి చెందిన వాడే అయినా కరేబియన్ ద్వీపంలో పుట్టాడు) వంటి వారు ఈ పురస్కారం అందుకున్నారు.[9] భారత్ ప్రపంచ నూతన ఆర్థిక శక్తిగా ఎదగడం, ఈ నవల ఇతివృత్తం. ఈ నవలలోని కథానాయకుడు బలరాం గ్రామీణ పేదరికం నేపథ్యంగా కలవాడు.[10]

ఇతర రచనలు

[మార్చు]

అరవింద్ ఇప్పటివరకు "ది వైట్ టైగర్", "బిట్వీన్ ది అస్సాసినేషన్స్" (Between the Assassinations) అను రెండు ఆంగ్ల నవలలను రచించాడు. ఇతను బుకర్ బహుమతిని గెలచిన భారతీయులలో మూడవ వ్యక్తి.

రచనల జాబితా

[మార్చు]

నవలలు

[మార్చు]
  • ది వైట్ టైగర్. 2008
  • బిట్వీన్ ది అస్సాస్సినేషన్స్ 2008
  • లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్. 2011
  • సెలెక్షన్ డే. 2016

చిన్న కథలు

[మార్చు]
  • "ది సుల్తాన్స్ బ్యాటరీ" (ది గార్డియన్ పత్రికలో, 2008 అక్టోబరు 18న ప్రచురితమైంది. online text)
  • "స్మాక్" (ది సండే టైమ్స్ పత్రికలో, 2008 నవంబరు 16న ప్రచురితమైంది. online text Archived 2011-06-16 at Archive.today)
  • "లాస్ట్ క్రిస్మస్ ఇన్ బాంద్రా" (ది టైమ్స్ పత్రికలో, 2008 డిసెంబరు 19న ప్రచురితమైంది. online text[permanent dead link])
  • "ది ఎలిఫాంట్" (ది న్యూయార్కర్ పత్రికలో, 2009 జనవరి 26న ప్రచురితమైంది. online text)

మూలాలు

[మార్చు]
  1. "Booker for KannAdiga". Deccan Herald. 16 October 2008. Archived from the original on 6 April 2012. Retrieved 2008-10-16.
  2. 2.0 2.1 "Karnataka/Mangalore News:Mangaloreans rejoice over aravind adiga's win". The Hindu. 16 October 2008. Archived from the original on 20 October 2008. Retrieved 2008-10-16.
  3. Muthiah, S. (3 November 2008). "A lineage of success". The Hindu. Archived from the original on 10 నవంబరు 2012. Retrieved 10 ఏప్రిల్ 2018.
  4. "Almamater celebrates Adiga's win". Bangalore Mirror. 16 October 2008. Archived from the original on 18 అక్టోబరు 2008. Retrieved 2008-10-16.
  5. "At Last! Commencement For More than 8,900 Today. Columbia University Record. MAY 21, 1997". Archived from the original on 27 జూన్ 2010. Retrieved 10 ఏప్రిల్ 2018.
  6. "The Second Circle". Archived from the original on 25 మే 2010. Retrieved 10 ఏప్రిల్ 2018.
  7. Adiga is the first current or former TIME staffer to win the Man Booker Prize, or its predecessor, the Booker Prize.
  8. "The second circle". Archived from the original on 6 ఫిబ్రవరి 2010. Retrieved 10 ఏప్రిల్ 2018.
  9. "First-timers seeking Booker glory". BBC. 9 సెప్టెంబరు 2008. Archived from the original on 17 January 2010. Retrieved 2008-10-16.
  10. Robins, Peter (9 ఆగస్టు 2008). "Review: The White Tiger by Aravind Adiga". The Telegraph. Archived from the original on 17 January 2010. Retrieved 2008-10-16.