అలీమ్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలీమ్ ఖాన్
జననం
మహ్మద్ అలీముల్లా ఖాన్

(1956-07-15) 1956 జూలై 15 (వయసు 67)
విద్యఎంఏ
పిహెచ్‌డి
విద్యాసంస్థమౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం
సోషియో-రిఫార్మ్-సొసైటీ
ఉద్యమంవరకట్న నిర్మూలన
పురస్కారాలుఇండియా ఫ్రటర్నిటీ ఫోరమ్

అలీమ్ ఖాన్ (జననం 1956) తెలంగాణకు చెందిన సామాజికవేత్త. భారత ఉపఖండం నుండి వరకట్నాన్ని నిర్మూలించడానికి పోరాడుతున్నాడు.[1][2] ఉర్దూ కవిత్వానికి కూడా ప్రసిద్ది చెందాడు. సోషియో-రిఫార్మ్-సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. వరకట్నంపై ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అనేక పుస్తకాలు రాశాడు.[3][4]

జీవిత విశేషాలు[మార్చు]

మహ్మద్ అలీముల్లా ఖాన్ 1956, జూలై 15 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 1956లో జన్మించాడు. తండ్రి మహమ్మద్ ఖలీలుల్లా ఖాన్‌ ఉర్దూ పండితుడు.[2][4] అలీమ్ ఖాన్ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేసాడు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం నుండి "ముస్లిం సమాజంలో మహిళ మార్జినలైజేషన్" అనే అంశంపై పిహెచ్‌డి కూడా చేశాడు. యూకెలోని లీసెస్టర్ వివాహ కౌన్సెలింగ్‌లో డిప్లొమా సాధించాడు. 3 దశాబ్దాలకు పైగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో తన స్వంత కంపెనీని నడిపాడు.[2]

వరకట్న వ్యతిరేక ప్రచారం[మార్చు]

అలీమ్ ఖాన్, వరకట్న వ్యతిరేక ప్రచారాన్ని ఈ యుగపు జిహాద్‌గా పేర్కొన్నాడు. అన్ని దురాచారాలకు ఈ వరకట్నమే మూలమని, ఈ వ్యవస్థకు స్వస్తి పలికితే కాలక్రమేణా వందలాది సామాజిక దురాచారాలను, పేదరికాన్ని ప్రజలు దూరం చేసుకోవచ్చన అలోచనతో వరకట్న వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాడు.[2]

ఆడపిల్లల లేదా సోదరీమణుల కట్నం భారాన్ని తొలగిస్తే, 50%మంది పురుషులు సామాజిక, ఇతర సేవలలో పాలుపంచుకునేలా స్వేచ్ఛగా జీవిస్తారని అలీమ్ ఖాన్ అభిప్రాయం.[2][4]

సోషియో-రిఫార్మ్-సొసైటీ[మార్చు]

పరకట్న నిర్మూలన కోసం 1992లో సోషియో-రిఫార్మ్-సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత ఈ సంస్థలో చాలామంది ఇతర సామాజిక కార్యకర్తలు సభ్యులుగా చేరారు. వారంతా భారతదేశంలోని వివిధ కళాశాలల్లో వరకట్నంపై ఉపన్యాసాలు ఇస్తారు, సమావేశాలు నిర్వహిస్తారు.[2][4]

పుస్తకాలు[మార్చు]

  • మర్ద్ భీ బిక్తే హైం....జాహెజ్ కే లియే (పురుషులు కూడా కట్నం కోసం అమ్ముతారు)
  • లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ముస్లిమ్స్
  • ఏక్ కోషిష్ ఔర్.
  • బాత్ హై జమానే కి (ఉర్దూ హాస్యం)[3]

మూలాలు[మార్చు]

  1. "Indian activist launches anti-dowry matrimonial service". Dnaindia.com. 13 January 2014. Retrieved 2022-05-30.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Aleem Khan: A relentless fighter against dowry - TwoCircles.net". twocircles.net. Retrieved 2022-05-30.
  3. 3.0 3.1 "About Author « Life Insurance and the Muslims". li.aleemkhanfalaki.com. Retrieved 2022-05-30.
  4. 4.0 4.1 4.2 4.3 "Crusader against 'jehez' on mission impossible?". The Hindu. Retrieved 2022-05-30.

బయటి లింకులు[మార్చు]