అవంతిక శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవంతిక శెట్టి
జననం (1986-08-01) 1986 ఆగస్టు 1 (వయసు 37)
వృత్తినటి, మోడల్, డ్యాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

అవంతిక శెట్టి (జననం 1986 ఆగస్టు 1) భారతీయ నటి, ప్రకటనకర్త. ప్రధానంగా కన్నడ సినిమాలలో నటించే ఆమె రంగితరంగ (2015)తో తన సినీ రంగ ప్రవేశం చేసింది.[1] ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటిగా ఆమె నామినేట్ చేయబడింది.[2]

సినిమాలకు ముందు, ఆమె ముంబైలో కొన్ని టెలివిజన్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది.

బాల్యం[మార్చు]

మంగళూరులోని తుళు మాట్లాడే తుళువ బంట్ కుటుంబంలో 1986 ఆగస్టు 1న అవంతిక శెట్టి జన్మించింది.

కెరీర్[మార్చు]

అనూప్ భండారి దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా చిత్రం రంగితరంగ (2015)తో ఆమె పెద్ద తెరపైకి అడుగుపెట్టింది. ఈ చిత్రం అనేక దేశాల్లో విడుదలై మంచి సమీక్షలను అందుకుంది. అలాగే, ఇది కన్నడ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో నామినేషన్ పొందింది. ఈ విజయవంతమైన అరంగేట్రం తరువాత, ఆమె ఆర్. అనంతరాజు దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం కల్పన 2లో ఉపేంద్ర సరసన నటించింది.[3] రాఘవ లారెన్స్ నటించి, రూపొందించిన విజయవంతమైన తమిళ చిత్రం, కాంచన 2 రీమేక్, ఒరిజినల్‌లో తాప్సీ పన్ను పోషించిన పాత్రను పోషించింది. నటుడు వి. రవిచంద్రన్ ఆవిష్కరించిన రియాల్టీ షో డ్యాన్సింగ్ స్టార్స్ 3లో పాల్గొన్నది. ఆమె రాజరథ చిత్రంలో నటించింది. ఇది రాజరథం (2018) అనే పేరుతో తెలుగులోనూ విడుదలైంది.

టెలివిజన్[మార్చు]

సంవత్సరం ధారావాహిక పాత్ర భాష ఛానల్
2008 ధరమ్ వీర్ సాక్షి హిందీ ఎన్డీటీవి ఇమాజిన్
2009-10 సజన్ ఘర్ జానా హై గౌరీ సుమేర్ రఘువంశీ హిందీ స్టార్ ప్లస్
2012-15 నా ఆనా ఈజ్ దేస్ లాడో రాగిణి హిందీ కలర్స్ టీవీ
2019-2020 మేరే డాడ్ కీ దుల్హన్ అంజలి అంబర్ శర్మ హిందీ సోనీ ఎంటర్‌టైన్‌మెంట్

మూలాలు[మార్చు]

  1. "Mangaluru beauty readies for Kannada debut". The Times of India. 24 June 2015.
  2. "Nominations for the 63rd Britannia Filmfare Awards (South)". Filmfare. 7 June 2016.
  3. "Uppi is Very Large- Hearted, Says Rangitaranga Actress". The New Indian Express. 13 January 2016. Archived from the original on 9 జూన్ 2016. Retrieved 23 అక్టోబర్ 2023. {{cite web}}: Check date values in: |access-date= (help)