అసాదుల చిందులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆసాదులంటే మాల మాదిగ కులాలలో పూజారి వర్గానికి చెందిన వారని ఆరుద్ర అన్నారు
ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా జిల్లాలలో మాల మాదిగ కులాల వారు విస్తారంగా వున్నారు. మాల కులంలో మాల దాసరులున్నట్లు, మాదిగ కులంలో ఆసాదులనే వారు ఒక తెగకు చెందిన వారు. అయితే రాష్ట్ర వ్వాపితంగా మాల దాసరులు లేనట్లే ఈ ఆసాదులు కూడా రాష్ట్ర వ్యాపితంగా లేరు. ఒక వేళ వున్నా వారి ప్రాముఖ్యం అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా నాగరికత చెందిన సర్కారు ప్రాంతాల్లో ఈ తెగ అంతగా కనిపించడం లేదు. వెనుక అడిన తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఆసాదులూ, వారి ఆచార వ్వహహారాలూ, కళా ప్రదర్శనలూ జరుగుతూనే ఉన్నాయి.

ఆసాదులూ, అమ్మవారి జాతర్లు[మార్చు]

ముఖ్యంగా రాయల సీమలో ఆసాదులనే వారు మాదిగ కులంలో ఒక తెగగా ప్రాచుర్యం పొందారు. ఆసాదులంటే మాల మాదిక కులాలలో పూజారి వర్గానిని చెందిన వారని ఆరుద్ర గారు అంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఒకనాడు విరివిగా జరిగే అమ్మవారి జాతర్ల సందర్భంలో దున్నపోతుల్నీ, మేక పోతుల్నీ, బలి ఇచ్చే ముందు అమ్మవారిని స్త్రోత్రం చేస్తూ మాల ఆసాదులు పాటలు పాడుతూ వుండగా, మాదిగ ఆసాదులు చేడిక వాయిస్తూ వుంటే, మాతంగ కన్యలలో ముఖ్యులైన వారికి పూనకం వస్తుంది. ఆ పూనకంలో అమ్మవారి కోరికలు చెల్లించ లేదంటూ అడ్డమైన తిట్లు తిడతారు. మరికొన్నికోరికలు కోరుతారు. కోపంతో భక్తుల్నికొడతారు. భక్తులు పూనకంలో వున్న అమ్మ వారిని శాంతింప చేస్తారు. పూనకం దిగిన తరువాత అమ్మ వారి మీద పాటలు పాడుతూ ఆవేశంతో చిందు నృత్యం చేస్తారు. మాదిక ఆసాదులు ముఖ్యంగా ఎల్లమ్మ కథను గానం చేస్తారు. సమాజంలో వీరిని హీన జాతిగా పరిగణించినా, అగ్ర కులాల్లోలేని విలక్షణమైన ఆచారాలు వీరి కున్నాయంటారు. అవి చిందుల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ తెలుస్తుంది వీరి చరిత్ర. దీనిని ఆది ఆంధ్ర కర్ణాటక సంస్కృతిగా గుర్తించ వచ్చు. దక్షిణ దేశంలో శాక్తేయ మతం అనవచ్చు.

గ్రామ దేవత, పెద్ద స్వామి:[మార్చు]

గ్రామాలలో వర్షాలు కురవ నప్పుడూ, కలరా, మశూచి మొదలైన అమ్మవారు సోకినప్పుడూ, పల్లెలలో ఆసాదుల చిందులు ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరమూ ఉగాది మరుసటి రోజున గ్రామ దేవత పెద్ద స్వామికి మేలుకొలుపు పాటలతో చిందు నృత్యాలు ఆవేశంగా గేయాలు పాడతారు.

పౌర్ణమి రోజున పెద్ద స్వామిని, కాపుల ఇళ్ళ దగ్గరకు తీసుకు వచ్చి బలి ఇవ్వబోయే పోతునూ, బోన కుండను, గంట దుత్తను ఆసాదుల చిందులతో గుడి దగ్గరకు వచ్చి తమ జవనికల్ని ఉధృతంగా వాయిస్తూ, కాపుల పూర్వీకులందరినీ పేరుపేరునా స్తుతిస్తారు. గుడి దగ్గరకు వచ్చిన కుమ్మరి పూజారి కాపుల వస్తువులనన్నిటినీ అక్కడ పెట్టి గ్రామ ప్రజల ముందు చిందులు వేస్తాడు.వంత పాడతారు. పాట పాడుతూ వలయాకారంగా తిరుగుతూ వెనుకకూ ముందుకూ అడుగులు వేస్తూ వంగుతూ లేస్తూ చేతులను ఆడిస్తూ గజ్జెల కాళ్ళతో చిందులను త్రొక్కుతారు. ఒక ప్రక్క వాయిద్యం మ్రోగుతూనే వుంటుంది. నాయకుడు చేతిని వూపుతూ చూపుడు వ్రేలును చెవిలో పెట్టుకుంటూ రాగం తీస్తారు. పాదాలు పైకెత్తి మునికాళ్ళమీద అరచేతితో కొడుతూ పెద్దమ్మ స్వామి దగ్గరకు పోయి నమస్కారం చేస్తాడు. కథకుణ్ణి అనుసరిస్తూ వంతలు నేత్రానందంగా నృత్యం చేస్తారు. వారి ముగ్గురి నాట్యమూ త్రిమూర్తుల నృత్యంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో కొందరికి పూనకం వస్తుంది. పూనకం వచ్చిన వారి చేత వేపాకులు తినిపించటం, కల్లు ముంతలోని కల్లును వేపముండతో అందరి మీదా చిలకరించి గ్రామాన్ని రక్షించమని గాయకుడు దేవతల్ని ప్రార్థిస్తూ వచ్చి చిందులు వేస్తూ గేయాలనూ, కథా గేయాలనూ పాడుతారు. ముఖ్యంగా వారు గానం చేసే కథా గేయాలు, పెద్దమ్మ కథ ... చల్లారమ్మ కథ .... యల్లమ్మ కథ. వీరు చక్కగా అలంకరించుకుని గ్రామ ప్రజల ముందు, ఆరు బయలులో ఆహ్లాదంగా నృత్యం చేస్తారు. గ్రామ ప్రజలు ఎంతగానో ఆనందిస్తారు. సంతోషంగా వారికి కానుకలు ముట్ట చెపుతారు. కథను మూడు రోజులు మొదలు తొమ్మిది రోజుల వరకూ పొడిగించి చెప్పగలరు. కథ చెప్పే ప్రతి ప్రతి రోజూ, పెద్దమ్మ స్వామికి పూజలు చేస్తూ, ఆ మహాదేవిని కొలుస్తూ గ్రామస్థుల చేత కొలిపిస్తూ గ్రామాన్ని కాపాడ మని ఆసాదుల మధ్య వర్తులుగా గ్రామ ప్రజల ఆర్థ నాదాన్ని దేవతకు అందచేసే మాతలుగా వుంటున్నారు.

వేషధారణ[మార్చు]

ఆసాది కథకుకు మోకాలి దాకా పంచ కట్టి, కథ చెప్పే వ్వక్తి కత్ఘకుడు మాత్రం నల్ల కోటు ధరించి, ఎర్ర పాగా చుట్టి వెనుక కుచ్చు వదిలి, నడుము కట్టుతో నుదుట బంగారు బొట్టు పెట్టి చేతిలో వేపమండల్ని పట్టుకొని ఝుళిపిస్తూ కథలు చెపుతారు. కథా ప్రారంభంలో పెద్ద స్వామికి నైవేద్యం పెట్టె సందర్భంలో వారు కల్లు త్రాగుతారు. ఒక వేళ గ్రామస్థులు కథలు చెప్పించకపోతే ఉగాది మరుసటి రోజున తప్పకుండా చిందులు వేస్తారు. అందుకే వారిని ఆయగాళ్ళంటారు. దేవత సమక్షంలో జంతువుల బలి సమయంలో, ఈ విధంగా పాడుతారు.

ఆసాదుల బృంద నృత్యం[మార్చు]

సామాన్యంగా ఆసాదుల బృందంలో ముగ్గురుంటారు. అందరి వద్దా వాయిద్యాలు వుంటాయి. ప్రధాన నాయకుడు పాడితే మిగతా ఇద్దరూ చిందులు వేస్తూ వంత పాడతారు. పాట పాడుతూ వలయాకారంగా తిరుగుతూ వెనుకకూ ముందుకూ అడుగులు వేస్తూ వంగుతూ లేస్తూ చేతులను ఆడిస్తూ గజ్జెల కాళ్ళతో చిందులను త్రొక్కుతారు. ఒక ప్రక్క వాయిద్య మ్రోగుతూనే వుంటుంది. నాయకుడు చేతిని వూపుతూ చూపుడు వ్రేలును చెవిలో పెట్టుకుంటూ లయాచితంగా రాగం తీస్తారు. పాదాలు పైకెత్తి మునికాళ్ళమీద అరచేతితో కొడుతూ పెద్దమ్మ స్వామి దగ్గరకు పోయి నమస్కారం చేస్తాడు.

కథకుణ్ణి అనుసరిస్తూ వంతలు నేత్రానందంగా నృత్యం చేస్తారు. వారి ముగ్గురి నాట్యమూ త్రిమూర్తుల నృత్యంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో కొందరికి పూనకం వస్తుంది. పూనకం వచ్చిన వారి చేత వేపాకులు తినిపించటం, కల్లు ముంత లోని కల్లును వేప మండతో అందరి మీదా చిలకరించి గ్రామాన్ని రక్షించమని గాయకుడు దేవతల్ని ప్రార్థిస్తూ వచ్చి చిందులు వేస్తూ గేయాలనూ, కథా గేయాలనూ పాడుతారు. ముఖ్యంగా వారు గానం చేసే కథా గేయాలు, పెద్దమ్మ కథ ... చల్లారమ్మ కథ .... యల్లమ్మ కథ. వీరు చక్కగా అలంకరించుకుని గ్రామ ప్రజల ముందు, ఆరు బయలులో ఆహ్లాదంగా నృత్యం చేస్తారు. గ్రామ ప్రజలు ఎంతగానో ఆనందిస్తారు. సంతోషంగా వారికి కానుకలు ముట్ట చెపుతారు. కథను మూడు రోజులు మొదలు తొమ్మిది రోజుల వరకూ పొడిగించి చెప్పగలరు. కథ చెప్పే ప్రతి ప్రతి రోజూ, పెద్దమ్మ స్వామికి పూజలు చేస్తూ, ఆ మహాదేవిని కొలుస్తూ గ్రామస్థుల చేత కొలిపిస్తూ గ్రామాన్ని కాపాడమని ఆసాదుల మధ్యవర్తులుగా గ్రామ ప్రజల ఆర్తనాదాన్ని దేవతకు అందచేసే మాతలుగా వుంటున్నారు.

పెద్దమ్మ తల్లికి[మార్చు]

పూజ చేతామురో యమ్మ - పెద్దమ్మ తల్లికి
పూజ చేత్తామురో - పున్ని మంతులు మీరు
మల్లి పూవులు దెచ్చి - మనసార వెల్లుదాము
బాగుగా బలిపిల్లలు గొట్టి - కర్మ పోతులను
కడగా కొట్టి ఆసాది వాండను - ఆటలాడమని
సన్నమేళముల సందడి చేయమని
సకియలారో, పెద్దమ తల్లికి జూజ చేద్దాము
రొయక్క్; కొంద చక్కెర, కర్జూరములు, మంచి తేనియో
మా పెద్దమ్మ స్వామికి పలము రుసుములు పూజ సేత్తము.

అంటూ సుబ్బారావు పేటకు చెందిన మాదిగ నాగన్న పాడిన పాట.
ఇది అనంతపురం జిల్లాలో ధర్మవరం తాలూకాలో వున్న ఆసాదుల కళారూప మిది.

సూచికలు[మార్చు]

  • తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.