అసిడియేషియా

వికీపీడియా నుండి
అసిడియేషియా
శిలాజ విస్తృతి: మూస:Fossil range
Halocynthia sp.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
Subphylum: యూరో కార్డేటా
తరగతి: అసిడియేషియా
Nielsen, 1995
క్రమాలు

అసిడియేషియా (Ascidiacea ; commonly known as the ascidians or sea squirts) యూరో కార్డేటా (Urochordata) తరగతికి చెందిన సముద్రంలో నివసించే జీవ జాతులు. ఇవి ఒక సంచి వలె కనిపించే అకశేరుకాలు. అసిడియన్లు ట్యూనిసిన్ అనే గట్టి పొరను కలిగివుంటాయి.

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇవి తక్కువ లోతున్న నీటిలో లవణాల శాతం 2.5 శాతం కన్నా ఎక్కువ కలిగిన పరిస్థితులలో నివసిస్తాయి. ఇవి స్థానబద్ధ జీవులుగా రాతి మీద అతుక్కొని ఉంటాయి.

వీనిలో సుమారు 2,300 జాతులు మూడు రకాలుగా గుర్తించబడ్డాయి

[మార్చు] లక్షణాలు

  • ఇవి సరళ లేక సహనివేశక జీవులు
  • గ్రసని మీద అడ్డు వరుసలలో ఏర్పడిన శైలికామయ శ్వాసరంధ్రాలు లేక మొప్పచీలికలు ఆట్రియమ్ లోనికి తెరుచుకుంటాయి. ఆట్రియల్ రంధ్రము పృష్టతలములో ఉంటుంది.
  • ఢింబక దశలో పృష్టవంశము తోక భాగములో వుండి, ప్రౌఢ దశలో లోపించి వుంటుంది.
  • శరీరాన్ని కప్పుతూ రక్షణ కొరకు ట్యూనిసిన్ అనే పదార్ధముతో నిర్మితమైన కవచము లేక కంచుకము ఉంటుంది.
  • ప్రత్యుత్పత్తి మొగ్గతొడిగే విధానము వలన జరుగుతుంది. తిరోగామి రూపవిక్రియ ప్రదర్శిస్తాయి.
Ernst Haeckel's interpretation of several ascidians from Kunstformen der Natur, 1904

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు