ఆర్.కె.శ్రీకంఠన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.కె.శ్రీకంఠన్
2006లో ఒక సంగీత కచేరీలో పాడుతున్న శ్రీకంఠన్ (ఆకుపచ్చశాలువా)
జననం
రుద్రపట్న కృష్ణశాస్త్రి శ్రీకంఠన్

14 జనవరి 1920
రుద్రపట్న, హసన్ జిల్లా, కర్ణాటక
మరణం2014 ఫిబ్రవరి 17(2014-02-17) (వయసు 94)
వృత్తిగాత్ర విద్వాంసుడు
పిల్లలురత్నమాలా ప్రకాశ్

రుద్రపట్న కృష్ణశాస్త్రి శ్రీకంఠన్ (14 జనవరి 1920 – 17 ఫిబ్రవరి 2014) ఒక సంప్రదాయ కర్ణాటక సంగీత గాయకుడు. 2011లో ఇతనికి భారతదేశపు మూడవ అతిపెద్ద పౌరపురస్కారం పద్మభూషణ్ లభించింది.

ఆరంభ జీవితం[మార్చు]

ఇతడు 1920, జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా రుద్రపట్న గ్రామంలో ఒక సంకేతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1][2] ఇతని తాత బెట్టదపుర నారాయణస్వామి (వీణ నారాయణస్వామిగా పరిచితుడు) వీణావాయిద్య విద్వాంసుడు. అతడు వీణ శేషణ్ణ, వీణ సుబ్బణ్ణల సమకాలికుడు.[3] ఇతని తండ్రి ఆర్.కృష్ణశాస్త్రి గమక కళావిశారదుడు, మంచి వక్త, నాటక రచయిత, హరికథా విద్వాంసుడు.

విద్యాభ్యాసం[మార్చు]

ఇతని ప్రాథమిక విద్య మైసూరులోని "సద్విద్య పాఠశాల"లోను, మాధ్యమిక విద్య భానుమయ్య హైస్కూలులోను గడచింది. మహారాజా కళాశాలలో బి.ఎ. చదువుకున్నాడు.

సంగీత శిక్షణ[మార్చు]

ఇతడు తొలుత తన తండ్రి కృష్ణశాస్త్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత తన అన్న ఆర్.కె.వెంకటరామశాస్త్రి వద్ద, వీణ సుబ్బణ్ణ వద్ద, తిరుమకూడలు చౌడయ్య వద్ద సంగీతం అభ్యసించాడు.[3] ఇతడు మైసూరు రాజదర్బారులో జరిగే అన్ని సంగీత కచేరీలకు హాజరయ్యేవాడు. ఇతడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, అరియకుడి రామానుజ అయ్యంగార్,ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ వంటి విద్వాంసులచే ప్రభావితమయ్యాడు. ఇతని సంగీతంలో సాహిత్య శుద్ధి, శృతి శుద్ధి మెండుగా ఉండేది.

అవార్డులు, బిరుదులు[మార్చు]

ఇతడు పొందిన పురస్కారాలలో కొన్ని:

  • 1979 - కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు.[4]
  • 1981 - కర్ణాటక రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అవార్డు.[5]
  • 1995 - మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారం.[6]
  • కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చే కనక-పురందర పురస్కారం.
  • 2011 - భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం.[7]
  • 2012 - కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే టాగూర్ రత్న అవార్డు.
  • 2013 - సంగీత ప్రభాకర [8]
  • 2012 - విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారిచే నాద విద్యాభారతి.[9]
  • 2011 - సద్గురు త్యాగరాజ హంసధ్వని పురస్కారం[10]
  • 1947 - అన్నవసతి సంఘ, బెంగళూరు వారిచే గాన భాస్కర బిరుదు.[5]
  • 1973 - బెంగళూరు సిటీ కార్పొరేషన్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.[5]
  • 1976 - గురు సేవా మండలి, బెంగళూరు వారిచే గానకళా ప్రవీణ బిరుదు.[5]
  • 1978 - శ్రీ పార్థసారథి సభ, సరస్వతి గాన సభ బెంగళూరు వారిచేకర్ణాటక సంగీతరత్న.[5]
  • 1983 - తులసీవన సంగీత పరిషత్, ట్రివేండ్రం వారిచేగాయక చూడామణి బిరుదు.[5]
  • 1983 - మద్రాసు సంగీత అకాడమీ వారి టి.టి.కె.మెమోరియల్ అవార్డు.[5]
  • 1991 - పురందర ప్రతిష్టాన, బెంగళూరు వారిచేహరిదాస అవార్డు.[5]
  • 1992 - పెర్కుసివ్ ఆర్ట్ సెంటర్, బెంగళూరు వారిచేపళని సుబ్రహ్మణ్య పిళ్ళై అవార్డు.[5]
  • 1994 - అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వారిచే చౌడయ్య జాతీయ స్థాయి అవార్డు.[5]
  • 1994 - త్యాగరాజ ట్రస్టు, తిరుపతి వారిచే సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదు.[5]
  • 1994 - కర్ణాటక ప్రభుత్వంచేకర్ణాటక రాజ్య సంగీత విద్వాన్ బిరుదు.[5]

సంగీత పాఠాలు[మార్చు]

శ్రీకంఠన్ అమృతవర్షిణి అనే ఎఫ్.ఎం.రేడియోలో సంగీత పాఠాలను నిర్వహించాడు.

మరణం[మార్చు]

ఇతడు 2014, ఫిబ్రవరి 17న అస్వస్థత కారణంగా తన 94వ యేట మరణించాడు.[1]

శిష్యులు[మార్చు]

ఇతని శిష్యులలో ఇతని కుమారుడు ఆర్.ఎస్.రమాకాంత్, ఎం.ఎస్.షీలా,శశాంక్ సుబ్రహ్మణ్యం, టి.ఎస్.సత్యవతి, ఆర్.ఎ.రమామణి, ఎం.టి.సెల్వనారాయణ, అమిత్ నాడిగ్, హెచ్.కె.నారాయణ మొదలైనవారు ఉన్నారు. ఇతని కుమార్తె రత్నమాలా ప్రకాష్ కూడా ఇతని శిష్యురాలే. ఈమె కన్నడ సుగమ సంగీతంలో నిష్ణాతురాలు. కొన్ని సినిమాలకు నేపథ్య గానం కూడా చేసింది.[11][12][13]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Govind, Ranjani (18 February 2014). "R.K. Srikantan passes away". The Hindu. The Hindu Group. Archived from the original on 5 April 2014. Retrieved 7 October 2018.
  2. Ramanan, Sumana (18 February 2014). "RK Srikantan, last link to a golden age of Carnatic music, dies at 94". Scroll.in. Scroll Media. Archived from the original on 7 October 2018. Retrieved 7 October 2018.
  3. 3.0 3.1 RAMNARAYAN, GOWRI (12 January 2007). "Purity of the highest order". The Hindu. Chennai. Archived from the original on 21 జనవరి 2007. Retrieved 15 December 2013.
  4. SNA Awardees List Archived 30 మే 2015 at the Wayback Machine
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 "Sangita Kalanidhi R.K. Srikantankiik". Archived from the original on 15 December 2013. Retrieved 15 December 2013.
  6. Recipients of Sangita Kalanidhi Archived 4 మార్చి 2016 at the Wayback Machine
  7. "Padma Awards Announced" (Press release). Ministry of Home Affairs. 25 January 2011. Retrieved 26 January 2011.
  8. "Award for R. K. Srikantan". The Hindu. India. 1 November 2013. Retrieved 13 December 2013.
  9. "Award for R. K. Srikantan". The Hindu. India. 12 August 2012. Retrieved 13 December 2013.
  10. "Musician R. K Srikantan honoured with award". The Hindu. India. 28 March 2012. Retrieved 13 December 2011.
  11. Face-to-Face with Sangeeta Kalanidhi R.K.Srikantan « ಅಲ್ಲಿದೆ ನಮ್ಮ ಮನೆ
  12. "ThatsKannada.com - Face to Face with R.K. Srikantan, exponent of Carnataic Music". Archived from the original on 2006-09-08. Retrieved 2021-02-16.
  13. "MusicalNirvana - R K Srikantan". Archived from the original on 2012-02-08. Retrieved 2021-02-16.

బయటి లింకులు[మార్చు]