ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం
ఆలీసాగర్ డ్యామ్
ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం is located in Telangana
ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం
Telangana లో ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం స్థానం
దేశంభారత దేశం
ప్రదేశంకోస్లి, నిజామాబాదు జిల్లా
ఆవశ్యకతసాగునీరు
ప్రారంభ తేదీ2007

ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం, నిజామాబాదు జిల్లాలోని ఎత్తిపోతల పథకం. ఇది ఒక పర్యాటక కేంద్రం. ఇది నిజామాబాదు జిల్లా, ఎడపల్లి మండలం, థానాకలాన్ గ్రామంలో ఉంది.[1] దీన్ని 1930 లో నిజాం పరిపాలనలో ఏర్పాటు చేశారు. అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది.

నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ. నిజాంసాగర్ నుండి వచ్చే ప్రధాన కాలువ ద్వారా ఆలీసాగర్ జలాశయం లోకి నీరు వస్తుంది.

ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం[మార్చు]

నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టులో నీరు అందని ప్రాంతాలకు నీటి సౌకర్యం కలిగించేందుకు ఆలీ సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. నిజామాబాదు జిల్లా, నవీపేట మండలం కోస్లి వద్ద గోదావరి నది కుడి గట్టునుండి నీటిని మూడు దశల్లో ఎత్తిపోసి ఆలీసాగర్ వద్దకు చేర్చడం ఈ పథకంలో ప్రధాన అంగం. మొదటి దశలో కోస్లి నుండి తాడ్‌బిలోలి వరకు ఎత్తిపోస్తారు. రెండవ దశలో అక్కడి నుండి పోచారం చెరువు వరకు పంపిస్తారు. మూడవదశలో అక్కడి నుండి ఆలీసాగర్ దిగువన నిజాం సాగర్ కాలువలోకి తోడిపోస్తారు. మొత్తం 17.35 కిలోమీటర్ల దూరం పంపిస్తారు.

ఈ పథకం వలన కొత్తగా ఆయకట్టు ఏర్పడదు. నవీపేట, రేంజల్, ఎడపల్లి, నిజామాబాదు, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో ఉన్న నిజాంసాగర్ ఆయకట్టు లోని 53,793 ఎకరాలకు సాగునీటి పారుదల స్థిరీకరణ జరుగుతుంది. మండలం వారీగా ప్రయోజనం పొందే భూమి వివరం:[2]

గెస్ట్ హౌజ్
మండలం విస్తీర్ణం

(ఎకరాల్లో)

నవీపేట 17,513
రేంజల్ 10,102
ఎడపల్లి 600
నిజామాబాదు 11,675
డిచ్‌పల్లి 6,244
మాక్లూర్ 7,657

ఈ పథకం 2007 లో పూర్తై, 2007-2008 ఖరీఫ్ పంట నుండి నీటిని అందిస్తోంది.

చిత్రమాలిక[మార్చు]

Alisagar lake
అలీసాగర్ జలాశయం

మూలాలు[మార్చు]

  1. "Ali Sagar Lift Irrigation Project JI00001". Archived from the original on 13 August 2016. Retrieved 17 May 2016.
  2. "Irrigation Projects in Telangana". irrigation.telangana.gov.in. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-17.