నిజామాబాదు మండలం

వికీపీడియా నుండి
  ?నిజామాబాదు మండలం
నిజామాబాదు • ఆంధ్ర ప్రదేశ్
నిజామాబాదు జిల్లా పటములో నిజామాబాదు మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో నిజామాబాదు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నిజామాబాదు మండలం
జిల్లా(లు) నిజామాబాదు
గ్రామాలు 34
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
3,72,350 (2001)
• 187950
• 184950
• 66.55
• 76.41
• 56.61


నిజామాబాదు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. నిజామాబాదు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తరువాత మూడవ పెద్ద నగరము. నగర జనాభా 4,23,253. దేశంలోనే పెద్దదయిన 7వ నంబర్ మరియు 16 నంబర్ జాతీయ రహదారులు నిజామాబాద్ గుండా పోతాయి. ఇది ఉత్తర, దక్షిణ భారతావనిని కలిపే రహదారి. ఒకప్పుడు తెలంగాణకు ధాన్యాగారంగా విలసిల్లి, ఆసియా ఖండంలోనే ప్రసిద్ది పొందిన నిజాం చక్కెర కర్మాగారం నిజామాబాద్ జిల్లాలో ఉంది.

[మార్చు] చరిత్ర

8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్య వర్ష ఇంద్రసోముడనే రాజు బోధన్ను రాజధానిగా చేసుకొని పరిపాలించడంతో ఈ ప్రాంతానికి ఇందూరు ఇంద్రపురి అని పేరు వచ్చింది. 1905 సంవత్సరంలో సికిందరాబాద్ నుండి మన్మాడ్ మద్య రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.ఆసందర్భంలో ఇందూరు ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేసారు. నిజాం ప్రభువు పరిపాలనలో ఉన్న ప్రాంతం కావడం వలన ఈ రైల్వే స్టషన్ కు నిజామాబాద్ అని పేరు పెట్టారు. కాలక్రమేణ ఈ ప్రాంతం ఇందూరు నుండి నిజామాబాద్ గామారింది. 1952లో మున్సిపాలిటీగా మారింది. 1981లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 2005 సంవత్సరంలో మున్సిపల్ కార్పోరేషన్ గా అవతరించింది. నిజామాబాద్ ఒక పెద్ద వ్యాపార కూడలిగా విలసిల్లింది. ఒకప్పుడు నిజామాబాద్ మార్కెట్ కమిటీకి రోజుకు 1 కోటి చొప్పున నెలకు 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. 1920 ప్రాంతంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు వలన నిజామాబాద్ జిల్లాలోని 2,50,000 ఎకరాలు సస్యశామలంగా మారాయి.

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • నిజామాబాదు

[మార్చు] గ్రామాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు