ఆస్కార్ వైల్డ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆస్కార్ వైల్డ్
Oscar Wilde Sarony.jpg
నెపోలియన్ సరోనీ చే 1882 లో తీయబడిన చిత్రం.
జననం Oscar Fingal O'Flahertie Wills Wilde
(1854-10-16)16 అక్టోబరు 1854
డర్బిన్ , ఐర్లాండ్
మరణం నవంబరు 30, 1900(1900-11-30) (వయసు 46)
పారిస్, ఫ్రాన్స్
వృత్తి రచయిత, కవి, నాటక రచయిత
భాష ఇంగ్లీషు, ఫ్రెంచ్
జాతీయత ఐరిష్
పనిచేసిన విశ్వవిద్యాలయాలు ట్రినిటీ కాలేజి, డర్బిన్
మాగ్డలిన్ కాలేజీ, ఆక్స్‌ఫర్డు
కాలము Victorian era
రచనా శైలి డ్రామా, చిన్న కథలు, డైలాగులు, జర్నలిజం.
సాహితీ విప్లవము Aestheticism
పేరెన్నికగల రచనలు The Importance of Being Earnest, The Picture of Dorian Gray
భార్య(లు) / భర్త(లు) కాన్‌స్టన్స్ లాయిడ్ (1884–1898)
పిల్లలు సిరిల్ హాలండ్, వైవయాన్ హాలండ్
బంధువులు Sir విల్లియం వైల్డ్, జానే, Lady లేడీ వైల్డ్

సంతకము

ఆస్కార్ వైల్డ్' (అక్టోబర్ 16, 1854నవంబర్ 30, 1900) ఐర్లండుకు చెందిన ఒక నాటక రచయిత, నవలా రచయిత, కవి మరియు కథా రచయిత. ఆయన రచనల్లోని చతురత పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. లండన్ ను విక్టోరియా రాణి పరిపాలించే కాలంలో ఆయన ప్రముఖ రచయితల్లో ఒకడిగానే కాక ఆయన సమకాలికుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

బాల్యం[మార్చు]

ఆస్కార్ వైల్డ్ డబ్లిన్ లోని 21, వెస్ట్‌లాండ్ రో అనే ప్రదేశంలో జన్మించాడు. ఒక ఆంగ్లో-ఐరిష్ కుటుంబంలో ఆయన రెండో సంతానంగా జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సర్ విలియం వైల్డ్, జేన్ ఫ్రాంకెస్కా వైల్డ్. జేన ఒక మంచి రచయిత్రి మాత్రమే కాకుండా యంగ్ ఐర్లాండర్స్ అనే ఒక విప్లవ సంస్థకు కవయిత్రిగా కూడా పనిచేసేది. జీవితాంతం ఐరిష్ జాతీయురాలుగానే గడిపింది. [1]

సర్ విలియం ఐర్లాండ్ లోనే పేరొందిన కన్ను మరియు చెవి వ్యాధుల స్పెషలిస్టు. 1864 లో వైద్య రంగానికి ఆయన చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుదునిచ్చి సత్కరించింది.[1] ఆయన పురావస్తు శాస్త్రం మీద మరియు జానపదుల మీద కూడా కొన్ని పుస్తకాలు రాశాడు. పేరొందిన వితరణశీలి. ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ కు వెనుక ఉన్న లింకన్ ప్లేస్ అనే ప్రదేశంలో ఉన్న డిస్పెన్సరీ లో ఆయన నగరంలోని పేదప్రజలకు ఉచితంగా వైద్యం చేసేవాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Literary Encyclopedia - Oscar Wilde". Litencyc.com. 2001-01-25. Retrieved 2009-04-03.