కవి
వికీపీడియా నుండి
కవిత్వము రాసేవాడు కవి. రవిగాంచని చోట కవి గాంచును.
కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు మరియు శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది.
[మార్చు] జంట కవులు
ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు.
- తిరుపతి వేంకట కవులు - దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి
- శేషాద్రి రమణ కవులు సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. దూపాటి శేషాచార్యులు మరియు దూపాటి వెంకట రమణాచార్యులు కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
- పింగళి కాటూరి కవులు
- కొప్పరపు సోదర కవులు
- దేవులపల్లి సోదర కవులు
[మార్చు] దిగంబర కవులు
- ప్రధాన వ్యాసం: దిగంబర కవులు
అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు మరియు 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ