ఇక్రమ్ అలీఖిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇక్రమ్ అలీఖిల్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2000-09-29) 2000 సెప్టెంబరు 29 (వయసు 23)
కాబూల్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రవికెట్-కీపర్ batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 13)2019 మార్చి 15 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 45)2019 మార్చి 2 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 22 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 14 20 42
చేసిన పరుగులు 7 238 886 956
బ్యాటింగు సగటు 7.00 23.80 36.91 28.96
100లు/50లు 0/0 0/2 1/5 0/8
అత్యుత్తమ స్కోరు 7 86 103* 94
క్యాచ్‌లు/స్టంపింగులు 4/1 3/3 45/5 35/4
మూలం: Cricinfo, 21 September 2022

ఇక్రమ్ అలీఖిల్ ( జననం 2000 సెప్టెంబరు 29) ఆఫ్ఘన్ క్రికెటరు. [1] అతను 2019 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు.[2]

దేశీయ, U19 కెరీర్[మార్చు]

అతను 2017 సెప్టెంబరు 14న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ కోసం తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. [3] దానికి ముందు అతను, 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఆడాడు. [4] అతను 2017 ACC అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో అజేయ శతకాన్ని సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు వారి తొలి ACC అండర్-19 కప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో సహాయం చేశాడు. [5]

2017 డిసెంబరులో అతను, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [6]

అతను 2018 మార్చి 1న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో స్పీన్ ఘర్ రీజియన్‌కు తన తొలి ఫస్ట్-క్లాస్ ఆడాడు.[7] అతను 2018 జూలై 10న 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ ప్రాంతీయ వన్డే టోర్నమెంట్‌లో స్పీన్ ఘర్ రీజియన్‌కు తన తొలి లిస్ట్ A మ్యాచ్‌ ఆడాడు. [8]

2018 సెప్టెంబరులో, అతను ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో బాల్ఖ్ జట్టుకు ఎంపికయ్యాడు. [9]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2018 డిసెంబరులో అతను, 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. [10]

2019 ఫిబ్రవరిలో భారతదేశంలో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెస్టు, వన్ డే ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లలోకి ఇక్రమ్‌ను తీసుకున్నారు.[11] [12] అతను 2019 మార్చి 2న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్‌డేల్లోకి ప్రవేశించాడు.[13] 2019 మార్చి 15న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు [14]


2019 జూన్ 6న, ఇక్రమ్‌ను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో తీసుకున్నారు. మోకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగిన మహ్మద్ షాజాద్ స్థానంలో అతను చేరాడు. [15]

మూలాలు[మార్చు]

  1. "Who is Ikram Ali Khil?". International Cricket Council. Retrieved 8 June 2019.
  2. "Ikram Ali Khil". ESPN Cricinfo. Retrieved 14 September 2017.
  3. "7th Match, Shpageeza Cricket League at Kabul, Sep 14 2017". ESPN Cricinfo. Retrieved 14 September 2017.
  4. "All 16 squads confirmed for ICC U19 Cricket World Cup 2016". International Cricket Council. Retrieved 23 May 2017.
  5. "Faizi ton, Mujeeb five-for hand Afghanistan maiden U-19 Asia Cup title". ESPN Cricinfo. Retrieved 24 November 2017.
  6. "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
  7. "1st Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Amanullah, Mar 1-4 2018". ESPN Cricinfo. Retrieved 4 March 2018.
  8. "Group B, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Khost, Jul 10 2018". ESPN Cricinfo. Retrieved 10 July 2018.
  9. "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
  10. "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
  11. "Mujeeb left out for Ireland Test, Shahzad out of T20Is". ESPN Cricinfo. Retrieved 7 February 2019.
  12. "No Mujeeb in Tests as Afghanistan announce squads for Ireland series". International Cricket Council. Retrieved 7 February 2019.
  13. "2nd ODI (D/N), Ireland tour of India at Dehra Dun, Mar 2 2019". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  14. "Only Test, Ireland tour of India at Dehra Dun, Mar 15-19 2019". ESPN Cricinfo. Retrieved 15 March 2019.
  15. "Mohammad Shahzad out of CWC19, Ikram Ali Khil called up". International Cricket Council. Retrieved 7 June 2019.