అక్షాంశ రేఖాంశాలు: 26°10′25″N 50°32′52″E / 26.17361°N 50.54778°E / 26.17361; 50.54778

ఇసా టౌన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదీనత్ ఇసా మున్సిపాలిటీని సూచిస్తున్న బహ్రయిన్ చిత్రపటం

ఇసా టౌన్ (అరబ్బీ: مدينة عيسى‎, మదీనత్ ఇసా) బహ్రయిన్ దేశంలోని ఉత్తరమధ్య ప్రాంతంలో నెలకొని ఉన్న ఒక మధ్యతరహా పట్టణం.

వ్యుత్పత్తి

[మార్చు]
ఇసా బిన్ సల్మాన్ ఖలీఫా ఇతని పేరుమీదనే ఇసా టౌన్ నిర్మించబడింది

ఇసా అనే పేరు బహ్రయిన్ను సా.శ.1961-1999ల మధ్య పాలించిన ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నుండి స్వీకరించబడింది.

ప్రసిద్ధ స్థలాలు

[మార్చు]

ఇసా టౌన్ సంప్రదాయమైన మార్కెట్‌ప్లేస్‌కు ప్రసిద్ధి[1].బహ్రయిన్ లోని ఎక్కువ ప్రైవేటు పాఠశాలలు ఇక్కడే నెలకొని ఉన్నాయి. ఇండియన్ స్కూల్, న్యూ ఇండియన్ స్కూల్, పాకిస్తాన్ ఉర్దూ స్కూల్, నసీమ్‌ ఇంటర్నేషనల్ స్కూల్, సేక్రెడ్ హార్ట్ స్కూల్, సెయింట్ క్రిస్టఫర్స్ స్కూల్ మొదలైనవి ఈ పట్టణంలో ఉన్నాయి. యునివర్సిటీ ఆఫ్ బెహ్రయిన్ యొక్క క్యాంపస్ కూడా ఇక్కడ ఉంది. నేషనల్ డ్రైవింగ్ స్కూల్, డైరెక్టరేట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ముఖ్య కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. విద్యామంత్రిత్వశాఖ, సమాచార మంత్రిత్వశాఖల కార్యాలయాలు, బహ్రయిన్ రేడియో & టి.వి.బ్రాడ్‌కాస్టింగ్ స్టేషన్లు, బెహ్రయిన్ జాతీయ స్టేడియం, బహ్రయిన్ పాలిటెక్నిక్ మొదలైనవి కూడా ఇసా టౌన్ స్థావరంగా కలిగి ఉన్నాయి.

భౌగోళిక స్థితి

[మార్చు]

ఇసా టౌన్‌కు సరిహద్దులుగా కవారా, జుర్దాబ్, సనద్, రిఫ్ఫా, జయీద్ టౌన్ పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణం 12.43 చ.కి.మీ (4.8 చదరపు మైళ్లు) విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది బహ్రయిన్ దేశ విస్తీర్ణంలో 1.62 శాతం మాత్రమే. ఇక్కడి వాతావరణం ఎక్కువ వేడిగా ఉంటుంది. వేసవిలో 66° నుండి83°ల ఫారిన్ హీట్ ఉంటుంది.

జనాభా సంఖ్య

[మార్చు]

2001 గణాంకాల ప్రకారం ఇసా టౌన్‌ 36,833 మంది జనాభాను కలిగి ఉంది. ఇది బహ్రయిన్ దేశజనాభాలో 5.66 శాతం. వీరిలో 50.03 శాతం పురుషులు కాగా 49.97 శాతం స్త్రీలు ఉన్నారు. ఈ జనాభాలో 15818 మంది పురుషులు, 15643 మంది స్త్రీలు బహ్రయిన్ దేశస్థులు కాగా 2763 మంది పురుషులు, 2609 మంది స్త్రీలు విదేశాలనుండి వలస వచ్చినవారు. బహ్రయిన్ దేశస్థులు, ఇతరదేశాల నుండి వచ్చి స్థిరపడిన వారి నిష్పత్తి 100:17 గా ఉంది. జనసాంద్రత చదరపు మైలుకు 7674 మంది ఉన్నారు.[2]

ప్రభుత్వం

[మార్చు]

బహ్రయిన్ లోని 12 మునిసిపాలిటీలలో ఇసా టౌన్ ఒకటి. 1988లో దీనిని మునిసిపాలిటీగా మార్చారు. ఇది సెంట్రల్ గవర్నరేట్‌లో భాగంగా ఉంది. అద్నాన్ అల్ మల్కీ ఈ ప్రాంతానికి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ఇసా టౌన్ విల్లాలకు ప్రసిద్ధి చెందింది. ఇది బహ్రయిన్ లోని పురాతన మోడల్ పట్టణం. పార్కులు, విశాలమైన రోడ్లు, హెల్త్ సెంటర్లు, విద్యుత్తు, నీరు, పారిశుద్ధ వనరులను కలిగి ఉంది. ఈ పట్టణపు మౌలిక సదుపాయాలను మెఱుగు పరచడానికి బహ్రయిన్ మునిసిపాలిటీ వ్యవహారాలు, అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ కొత్త ప్రాజెక్టులను చేపట్టింది.[3]

సాంస్కృతిక కార్యక్రమాలు

[మార్చు]

బహ్రయిన్ తెలుగు కళాసమితి ఇసా టౌన్‌లోని ఇండియన్ స్కూల్‌లో 2012లో మధురం పేరుతో మ్యూజికల్ నైట్‌ను, 2014లో వేడుక పేరుతో స్టార్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వీటిలో మధుప్రియ, హేమచంద్ర, శ్రావణ భార్గవి, గోరటి వెంకన్న, పూనం బాజ్వ మొదలైన కళాకారులు పాల్గొన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Bahrain Shopping Souqs". Click Bahrain. Archived from the original on 20 జూన్ 2012. Retrieved 15 July 2012.
  2. "2011 జనాభా గణాంకాలు". Archived from the original on 2016-03-11. Retrieved 2020-06-10.
  3. Isa Town infrastructure projects underway[permanent dead link]
  4. ఫేస్‌బుక్ లో బహ్రయిన్ తెలుగు కళాసమితి పేజీ

26°10′25″N 50°32′52″E / 26.17361°N 50.54778°E / 26.17361; 50.54778

"https://te.wikipedia.org/w/index.php?title=ఇసా_టౌన్&oldid=3501147" నుండి వెలికితీశారు