ఉత్ప్రేరకాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Solid heterogeneous catalysts such as in automobile catalytic converters are plated on structures designed to maximiకze their surface area.

జీవ చర్యలో పాల్గొంటూ తాము ఎటువంటి మార్పు చెందకుండా చర్యను ప్రేరేపించే పదార్ధాలను ఉత్ప్రేరకాలు (Catalysts) అంటారు. రసాయన చర్యలో పాల్గొనకుండ చర్యా వేగాన్ని పెంచే పదార్థాలను ఉత్ప్రేరకాలు అంటారు. ఉదాహరనకు ఆమ్లజనిని తయారు చేయునపుడు సాధారణంగా పొటాషియం పర్మాంగనేట్(సినాల రంగు) ను వేడి చేయుట ద్వారా తయారు చేస్తారు. ఈ చర్య జరగడానికి కొంత వ్యవధి పడుతుంది. ఈ చర్యా వేగాన్ని పెంచుటకు చర్య జరిగేటప్పుడు క్రియా జనకాలు అయిన పొటాషియం పర్మాంగనెటుకు మాంగనీస్ డై ఆక్సైడ్ కలిపి వేడి చేస్తారు. ఈ విధం గా చేయటం వల్ల చర్యా వేగం పెరిగి ఆమ్లజని వెంటనే తయారవుతుంది. ఈ చర్యలో మాంగనీస్ డై ఆక్సైడ్ రసాయన చర్యలో పాల్గొనదు. కాని చర్యా వేగాన్ని పెంచుతుంది.

నిత్య జీవితం లో అనువర్తనాలు[మార్చు]

  • అసంతృప్త నూనె లను సంతృప్త క్రొవ్వులుగా మార్చు విధానంలో నూనెల హైడ్రోజనీకరణం చేయునపుడు ఉత్రేరకంగా నికెల్ ను వాడతారు.
  • కఠిన జలం తో పప్పు ఉడక నప్పుడు ఆ చర్య వేగవంతం చెయుటకు అందులో వంట సోడా(సోడియం బైకార్బొనేట్) ను ఉత్ప్రేరకంగా కలుపుతారు.
  • ఆహారం జీర్ణం కానపుడు జీర్ణ ప్రక్రియ వేగవంతం చేయుటకు సోడా(కార్బానికామ్లం) ను ఉత్ప్రేరకంగా తీసుకుంటాం.

దుర్వినియోగం[మార్చు]

  • క్రీడాకారులు తమ సామర్థాన్ని తాత్కాలికంగా పెంచుకొనుటకు ఉత్ప్రేరకాలను తీసుకుంటారు. అందువలన క్రీడా ప్రారంభం లో డోపింగ్ టెస్ట్ చేయిస్తారు.
  • నేటి యువత లో కొద్దిమంది మత్తు పదార్థాలైన ఉత్ప్రేరకాలకు బానిసలై సమాజ శ్రేయస్సుకు నష్టం కలిగిస్తున్నారు.