ఉప్పలపు శ్రీనివాస్
యు. శ్రీనివాస్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | భారత శాస్త్రీయ సంగీతము |
వాయిద్యాలు | మండొలిన్ |
వెబ్‌సైటు | Official website / అధికారిక వెబ్ సైట్ |
సభ్యులు | ఎ |
మాండొలిన్ శ్రీనివాస్ (ఫిబ్రవరి 28, 1969 - సెప్టెంబర్ 19, 2014) గా ప్రసిద్ధిచెందిన ఉప్పలపు శ్రీనివాస్ ప్రముఖ భారతీయ మాండొలిన్ వాద్య నిపుణుడు.
బాల్య జీవితం
[మార్చు]శ్రీనివాస్ ఫిబ్రవరి 28, 1969, పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లులో జన్మించాడు.[1] తండ్రి సత్యనారాయణ క్లారినేట్ వాద్యకారుడు. శ్రీనివాస్ బాల సంగీత మేధావి. ఆరు సంవత్సరాల వయసులోనే మాండొలిన్ ను చేతబట్టాడు. శ్రీనివాస్ తొమ్మిదేళ్ల వయసులోనే 1978లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్ మాండలిన్ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. కొడుకులోని కళాతృష్ణను గుర్తించిన తండ్రి తన గురువైన రుద్రరాజు సుబ్బరాజు దగ్గరకు శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుకు మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. 19వ సంవత్సరంలో మాండలిన్ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. వీరికి ఒక సోదరి ఉంది. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రథమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్. భారతదేశంలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్ విద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
కలిసి పనిచేసిన కళాకారులు
[మార్చు]విదేశీ వెస్ట్రన్ సంగీత కళాకారులు మైఖేల్‌బ్రూక్, జాన్ మెర్ లాగ్లిన్, నైగెల్ కొండి టైగన్, మైఖేల్ వైమన్ వంటి వారితో కలసి విదేశాలలో పలు ప్రోగ్రామ్‌లు చేశాడు. శ్రీనివాస్ కర్నాటక సంగీతంతోబాటు హిందుస్థానీ సంగీతంలోను ప్రావీణ్యం గడిరచాడు. హిందుస్థానీ క్లాసికల్ సంగీత కళాకారులు హరిప్రసాద్ చౌరాసియా, జాకీర్ హుస్సేన్ వంటి వారితో కలసి పనిచేసాడు.
అవార్డులు
[మార్చు]అతి పిన్న వయసులోనే మాండలిన్ శ్రీనివాస్‌ను (1998లో) పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు. 1983లోనే బెర్లిన్‌లో జరిగిన బజ్ ఫెస్టివల్‌లో శ్రీనివాస్ మాండలిన్ వాదన ఆహూతుల్ని అలరించింది. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్ గెలుచుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవి నలంకరించాడు. సనాతన సంగీత పురస్కార్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, నేషనల్ సిటిజన్ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వంటి పలు అవార్డులు శ్రీనివాస్‌కు అలంకారం అయ్యాయి. శ్రీనివాస్ పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు.
మరణం
[మార్చు]శ్రీనివాస్ (45) శుక్రవారం చెన్నైలో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం సెప్టెంబర్ 19, 2014 మరణించారు.[2] కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాండలిన్ శ్రీనివాస్ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్ శ్రీనివాస్ తుదిశ్వాస విడిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ Hunt, Ken. "U. Srinivas - Biography". Allmusic. Retrieved 2009-06-02.
- ↑ http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece
బయటి లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1969 జననాలు
- 2014 మరణాలు
- తెలుగువారిలో సంగీతకారులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- పశ్చిమ గోదావరి జిల్లా సంగీత విద్వాంసులు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు