కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష
నాయకుడుగాలి జనార్ధన్ రెడ్డి
స్థాపకులుజి. జనార్దన రెడ్డి
స్థాపన తేదీ25 డిసెంబరు 2022 (16 నెలల క్రితం) (2022-12-25)
రద్దైన తేదీ25 మార్చి 2024 (41 రోజుల క్రితం) (2024-03-25)
ప్రధాన కార్యాలయం49/48, క్యాలసనహళ్లి, కొత్తనూర్ పోస్ట్, బెంగళూరు, కర్ణాటక 560077
రాజకీయ విధానంఅభ్యుదయవాదం
Colours  నీలం
ECI Statusనమోదైంది
శాసన సభలో స్థానాలు
1 / 224
Election symbol
ఫుట్‌బాల్

కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ) 25 డిసెంబర్ 2022లో జి. జనార్దన్ రెడ్డిచే స్థాపించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన స్వంత ఆలోచనతో, బసవన్న (12వ శతాబ్దపు సంఘ సంస్కర్త) ఆలోచనతో కల్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని స్థాపించాడు.[1] 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనార్దన్ రెడ్డి బీజేపీ పార్టీని వీడి కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని ఏర్పాటు చేసి గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 25న పార్టీని బీజేపీలో విలీనం చేశాడు.[2]

భావజాలం[మార్చు]

జి. జనార్దనరెడ్డి బసవ తత్వాలను కేఆర్‌పీపీ అనుసరిస్తుందని పార్టీ ఏర్పాటు చేసే సమయంలో తెలిపాడు. ఎన్నికల సంఘం తమ పార్టీ చిహ్నంగా ఫుట్‌బాల్‌ను కేటాయించింది. గాలి జనార్ధన రెడ్డి రాష్ట్రంలోని కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని గంగావతి నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

తొలివిడతగా సిరగుప్ప, కనకగిరి, నాగథాన్, సింధనూరు, హిరియూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కళ్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

ఎన్నికలలో పోటీ[మార్చు]

కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ నుంచి 15 మంది బరిలో దిగితే కేవలం జనార్దన్‌రెడ్డి ఒక్కడే విజయం సాధించాడు.[3]

జాతీయ అధ్యక్షుల జాబితా[మార్చు]

నం. చిత్తరువు పేరు

(జననం-మరణం)

పదవీకాలం
పదవిని స్వీకరించారు కార్యాలయం నుండి నిష్క్రమించారు ఆఫీసులో సమయం
1 జె. రామన్న 25 డిసెంబర్ 2022 25 మార్చి 2024 1 సంవత్సరం, 91 రోజులు

కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుల జాబితా[మార్చు]

నం. చిత్తరువు పేరు

(జననం-మరణం)

పదవీకాలం
పదవిని స్వీకరించారు కార్యాలయం నుండి నిష్క్రమించారు ఆఫీసులో సమయం
1 గాలి జనార్ధన రెడ్డి గాలి జనార్ధన రెడ్డి

(1967–)

25 డిసెంబర్ 2022 25 మార్చి 2024 1 సంవత్సరం, 91 రోజులు

మూలాలు[మార్చు]

  1. "Karnataka: Mining Baron Gali Janardhan Reddy Floats New Political Party, Names It Kalyana Rajya Pragathi Paksha" (in ఇంగ్లీష్). 25 December 2022. Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  2. Eenadu. "భాజపాలో చేరిన గాలి జనార్దన రెడ్డి.. పార్టీ విలీనం". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  3. TV9 Telugu (13 May 2023). "'గాలి' తుస్.. ఆయన పార్టీలో ఒక్కరు తప్ప అందరూ ఓటమిపాలే..!". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)