ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (Indian Union Muslim League) భారతీయ జాతీయ భావాలు గల ఒక ముస్లిం రాజకీయ పార్టీ. ఈ పార్టీకి ప్రధాన మైదానం కేరళ రాష్ట్రం.
విషయ సూచిక |
[మార్చు] పార్టీ చరిత్ర
ఈ పార్టీకి మూలాలు పాకిస్తాన్ ఆవిర్భావానికి తోడ్పడిన ముస్లిం లీగ్ తో వున్నాయి. భారత్ మరియు పాకిస్తాన్ వేరుపడిన తరువాత, 1948 మార్చి 30 న "ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్" పార్టీ భారత్ లో స్థాపించబడినది. ఇది ప్రధానంగా కేరళ రాష్ట్రంలోని ఉత్తరప్రాంతాలు పట్టుగొమ్మలు. ఇతర ప్రాంతాలలోనూ అత్యల్పంగా ప్రాతినిధ్యమూ గలదు. ఉదాహరణకు తమిళనాడు మరియు మహారాష్ట్రలు.
ఈ పార్టీ, ఇతర జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు సాగిస్తూ తన మనుగడ సాధిస్తూ వస్తున్నది.
ప్రస్తుతం యూ.పీ.ఏ. ప్రభుత్వంలో భాగస్వామ్యం గలది. ఈ పార్టీకి చెందిన ఇ. అహ్మద్, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కలిగి వున్నాడు. ఈ పార్టీకి చెందిన సి.హెచ్. ముహమ్మద్ కోయా 1979లో కేరళ ముఖ్యమంత్రిగానూ పనిచేశాడు.
ఈ పార్టీ ప్రతినిధులలో ఈ మధ్య మృతి చెందిన బన్నాత్ వాలా పార్లమెంటు సభ్యుడు ముఖ్యుడు.
[మార్చు] 1980 ఎన్నికలు
రెండు రాజకీయ ఫ్రంట్‌లు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మరియు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లలో, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ విడిపోయి ఈ గ్రూపులలో 1980 ఎన్నికలలో పాల్గొన్నాయి. ఆల్ ఇండియా ముస్లింలీగ్ LDF తోనూ, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ UDF తోనూ చేరాయి. 1985 లో ఈ రెండు గ్రూపులూ మరలా ఏకమై ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పేరుతో UDF తో భాగస్వామ్యమయ్యాయి.
[మార్చు] సంస్థ వ్యవస్థ
ఈ పార్టీ విద్యార్థి సంఘం "ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్" పేరుతో వున్నది. ఈ పార్టీకి మహిళా విభాగమూ "ముస్లిం వుమెన్స్ లీగ్" పేరుతో వున్నది. కేరళలో వేరువేరు ట్రేడ్‌యూనియన్లూ కలవు, "స్వతంత్ర తోజిలాలి యూనియన్" (S.T.U., Independent Workers Union), మరియు రైతు సంఘాలు, స్వతంత్ర కర్షక సంఘం, న్యాయవాదుల ఫోరం మరియు "KMCC" పేరుతో ఎక్స్‌పాట్రియేట్స్ సహాయకులూ వున్నారు.
[మార్చు] పార్టీ నేటి స్థితి
ఈ పార్టీ, ప్రస్తుత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్ తో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. పార్టీ అధ్యక్షుడు ఇ. అహ్మద్, విదేశాంగ రాజ్యమంత్రి. (భారత్ స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఈ పార్టీ నుండి ప్రధమ మంత్రి). ఈ పార్టీ కేరళలో, "ముస్లింలీగ్ కేరళ స్టేట్ కమిటీ" అనే పేరుతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందినది.
కేరళలో ఈ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు, యూ.డీ.ఎఫ్. ప్రభుత్వంలో భాగస్వామ్యులు. ఖాదర్ మొహియుద్దీన్ (ఈ పార్టీ జాతీయ సెక్రటరీ) తమిళనాడులోని వేలూరు పార్లమెంటు సభ్యుడు (ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అభ్యర్థిగా). [1]
కేరళ రాష్ట్రమే కాకుండా, తమిళనాడులో ఈ పార్టీ "డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలియెన్స్" తో సంబంధాలు కలిగి వున్నది.