కర్నూలు కడప కాలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నూలువద్ద కె.సి.కెనాల్

కే సి కెనాల్ లేదా కే సి కాలువగా వ్యవహరించబడే కర్నూలు కడప కాలువ రాయలసీమ లోని ఒక ప్రధాన పంట కాలువ.[1][2][3] ఇది ఆంగ్లేయుల కాలములో 1950లో నిర్మితమైనది.[4] కర్నూలు, కడప జిల్లాల గుండా సాగుతూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న కాలువ. సాగునీటి కే కాకుండా తాగునీటికి కూడా ఇది ప్రధాన వనరు.

చారిత్రక నేపథ్యం

[మార్చు]

ఈ కాలువ 1866 లో బ్రిటీష్ వారి హయాములో మద్రాస్ ఇరిగేషన్ కంపెనీ ద్వారా నిర్మితమైంది. 1882 లో బ్రిటీష్ ప్రభుత్వం ఈకాలువ నిర్మాణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలో తుంగభద్ర నదిపై 8.23 మీటర్ల ఆనకట్టు నిర్మించబడింది. 304 కిలోమీటర్ల పొడవునా 84.9 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 52.746 హెక్టారుల సాగుభూమికి నీరందించే విధంగా కృష్ణా పరీవాహక ప్రదేశం నుండి పెన్నా పరీవాహక ప్రదేశం వరకు దీని నిర్మాణం సాగింది.[5] కరువు కాటకాలతో అల్లాడిపోతున్న కడప, కర్నూలు రైతాంగానికి ఈ కాలువ నిర్మాణం ఒక వరప్రసాదంగా మారింది.

కె.సి.కెనాల్ పథకం,130 ఏళ్ళ క్రితం, ఉపతుంగభద్ర పరీవాహకప్రాంతం,, కృష్ణాపరీవాహక ప్రాంతానికి సంబంధించిన నౌకాయానం, వ్యవసాయభూములకు నీటి సదుపాయం కల్పించుటకై ఉద్దెశించి ఆంధ్రలోప్రారంభించిన నీటి కాలువ. డచ్ దేశానికి చెందిన మద్రాసు ఇరిగేసను అండ్‌కెనాల్.కం, లిమిటెడ్ అను ఒక వ్యక్తిగత సంస్థ ఈ కాలువ నిర్మాణం చేపట్టినది. కాలువ త్రవకాన్ని 1870లో ప్రరంభించి1883 కీ పూర్తిచేసారు (కాని కాలువ పనులు అన్ని పూర్తికాలేదు). ఇది సుంకేసుల అనకట్ట కుడి పార్శం నుండి మొదలై కర్నూలు, కడప నగారాల మీదుగా సాగి, కడప జిల్లాలోని కృష్ణపురం వద్ద అంతమవుతుంది. నిర్మాణ సమయంలో కాలువ నిర్మాణం జాప్యం అవ్వడంతో, 1882లో ఈ ప్రాజెక్టు పనిని బ్రీటిష్‌ ఇండియా 3.02 (£1,700,000) కొట్లరూపాయలకు తన స్వాధీనంలోకి తీసుకున్నది. సర్ అర్థర్ కాటన్ సలహ ప్రకారం, కాలువలో నౌకాయానాన్ని క్రమంగా తగ్గించుచూ, వ్యవసాయ భూములకు నీటి పారుదలను పెంఛుతూ వచ్చి, 1933లో కాలువలో నౌకా యానాన్ని పూర్తిగా నిలిపి వేసినది.[6]

సంభవించే కరువును దృష్టిలో పెట్టుకొని కర్నూలు విభాగంలో కాలువ నిర్మాణ పనులు1860లో ప్రారంభించారు. తొందపాటువలన, అనుభవరాహిత్యం వలన, కొన్నిచోట్ల త్రవ్వకంలో వచ్చిన ఇబ్బందులవలన, అధికంగా నిర్లక్ష్యంగా ఖర్చుచెయ్యడం వలన, సగం కాలువ పని అయ్యేటప్పటికి, కెటాయించిన నిధులు ఖర్చు అయ్యిపొయాయి. మళ్ళికొత్తగా నిధులు సమీకరించి గుత్తెదారులను పిలిచి 1871 నాటికి ప్రాజెక్టును పూర్తి చెయ్యగలిగారు[7]

ఈ కాలువ సముద్రమట్టంనుండి 134 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తర అక్షాంశరేఖ: 14°29'19.82;తూర్పుపడమటి రేఖాంశము:78°51'24.52"[8]

నీటి పారుదల

[మార్చు]

కె.సి కెనాల్ కడప జిల్లాలో జమ్మలమడుగు తాలుకాకు చెందిన సుద్దపల్లివద్ద ప్రవేశిస్తున్నది.ప్రొద్దటూరులో పెన్నానదిని 182 వ మైలు వద్ద దాటి కడప వైపు కొనసాగుతుంది.[9] ఈ కాలవక్రింద నీటి సదుపాయం కై మొదటగా 122200 హెక్టరుల భూమి నమోదు అయినది.తరువాత శ్రీశైలం ప్రాజెక్టు ముంపుప్రాంతాలను, శ్రీశైల నగర సమీప ప్రాంత భూములను తప్పించగాచివరకు 110482 హెక్టరు భూమికినీటి సదుపాయం అందుతున్నది.ఇందులో కర్నూలు జిల్లాక్రింద 75879 హెక్టరులు, కడప జిల్లాక్రింద 34603 హెక్టరులు సాగులో ఉన్నాయి.ఈ కాలువకు KWDT కేటాయించిన నీటి పరిమాణం1130 Mm3 (39.9 TMC).అంతియే కాకుండగా తుంగభద్ర ఆనకట్టలో 230TMC (6513 Mm3) నీరు ఉన్నచో అదనంగా 10TMC ( 283 Mm3) నీరు ఈ కలువకు ఇచ్చేలా KWDT ఆవార్డ్ అనుమతి మంజూరు చేసినది[10]

కడప జిల్లా లో కెసి కాలువ

[మార్చు]

కడప జిల్లాలో కేసీ కాల్వ కింద 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జలవనరుల శాఖ మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలో 82 వేల ఎకరాలు సాగవుతోంది. జిల్లాలో కుందూనదిపై ఉన్న రాజోలి ఆనకట్ట వద్ద 234.640 కి.మీ నుంచి ప్రారంభమయ్యే కేసీ ప్రధాన కాల్వ 305.860 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీనికి అనుబంధంగా 40.70 కి.మీ చాపాడు కాల్వతో పాటు 16 కి.మీ ఏటూరు కాల్వ, 24 కి.మీ కొండపేట ఉపకాల్వలు ఉన్నాయి. ప్రధానకాల్వ అడుగడుగునా గండ్లుపడి, లైనింగ్ దెబ్బతిని దారుణంగా తయారైంది. ఏటా విలువైన సాగునీరు భారీమొత్తంలో వృథాగా పోతోంది. 1998లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. లైనింగ్‌తో పాటు అడుగుభాగంలో కాంక్రీట్ పరుపు వేశారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చేశారు. 1996-2004 సంవత్సర మధ్యకాలంలో 2000 కోట్ల రూపాయల ఖర్చుతో నవీకరించడమైనది.[7]

మూలాలు

[మార్చు]
  1. "KC Canal's share in Rajolibanda scheme: Byreddy calls for stir". hindu.com. July 23, 2006. Archived from the original on 2008-04-12. Retrieved 2015-04-09.
  2. "KC Canal reopened". hindu.com. Jul 20, 2005. Archived from the original on 2006-09-12. Retrieved 2015-04-09.
  3. "Ryots picket KC Canal engineer's office". hindu.com. Jul 23, 2004. Archived from the original on 2004-08-12. Retrieved 2015-04-09.
  4. "development of kc canal area". news.google.com. Jun 13, 1953. Retrieved 2015-04-09.
  5. "Hydrology and Water Resources of India". books.google.co.in. Retrieved 2015-04-09.
  6. "K.C. CANAL". irrigation.cgg.gov.in. 2004-06-01. Archived from the original on 2015-04-14. Retrieved 2015-04-09.
  7. 7.0 7.1 "KC Canal – A major source of Irrigation". kadapa.info. 9 April 2015. Retrieved 2015-04-09.
  8. "Kurnool Cuddapah Canal". in.geoview.info. Retrieved 2015-04-09.
  9. "District Gazetteer, Cuddapah". books.google.co.in. Retrieved 2015-04-09.
  10. "Irrigation Planning And Command Area Development" (PDF). nwda.gov.in. Retrieved 2015-04-09.