కళ్ళద్దాలు
కళ్ళద్దాలు లేదా కంటి అద్దాలు (ఆంగ్లం: Spectacles) కంటి ముందు ధరించే అద్దాలు. ఇవి ఎక్కువగా దృష్ఠిదోషమున్న వ్యక్తులు ధరిస్తారు. కొంతమంది బయటి వాతావరణం, అతినీలలోహిత కిరణాల నుండి కళ్ళను రక్షించుకోడానికి కూడా వాడుతున్నారు.
కళ్ళద్దాల ఫ్రేములు ఎక్కువగా లోహాలతోగాని, కొమ్ముతోగాని, ప్లాస్టిక్ తోగాని తయారుచేస్తారు. అద్దాలు ముందుగా గాజుతో తయారుచేసేవారు. బరువు తక్కువగా ఉండి, పగిలి కంటికి ప్రమాదం కలిగించని కారణం చేత, ప్రస్తుతం ఇవి ప్లాస్టిక్ తో చేస్తున్నారు. కొన్ని ప్లాస్టిక్ అద్దాలకు అతినీలలోహిత కిరణాలను ఆపగలిగే శక్తి ఎక్కువగా ఉన్నది.[1]
విషయ సూచిక |
[మార్చు] రకాలు
[మార్చు] దృష్ఠిదోషం కోసం
ఈ కళ్ళద్దాలు కంటి యొక్క దృష్టిదోషాన్ని సవరిస్తాయి. దూరదృష్ఠి ఉన్నవారు పుటాకార కటకం, హ్రస్వదృష్ఠి ఉన్నవారు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. అద్దాల శక్తిని డయాప్టర్ లలో కొలుస్తారు.
[మార్చు] రక్షణ కోసం
ఈ కళ్ళద్దాలు వెల్డింగ్ పనిచేసేవారు ధరిస్తారు. ఇవి వెల్డింగ్ కాంతికిరణాలు, ఎగిరే రేణువుల నుండి కళ్ళను రక్షిస్తాయి.
[మార్చు] ప్రత్యేకమైనవి
3 డి సినిమాలు చూడడం కోసం ఒక ప్రత్యేకమైన కళ్ళద్దాలు అవసరమౌతుంది.
[మార్చు] మూలాలు
- ↑ DeFranco, Liz (April 2007). Polycarbonate Lenses: Tough as Nails. All About Vision. తీసుకొన్న తేదీ: 2007-09-01.
[మార్చు] బయటి లింకులు
- Antique Spectacles, extensive history and pictures of spectacles.
- British Optical Association Museum, Spectacles Gallery