కొండమల్లేపల్లి మండలం
కొండమల్లేపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°38′38″N 79°00′46″E / 16.643970°N 79.012700°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | కొండమల్లేపల్లి |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 129 km² (49.8 sq mi) |
జనాభా | |
- మొత్తం | 32,277 |
- పురుషులు | 16,755 |
- స్త్రీలు | 15,522 |
పిన్‌కోడ్ | 508243 |
కొండమల్లేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.కొండమల్లేపల్లి మండలం, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని, దేవరకొండ శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది దేవరకొండ రెవెన్యూ డివిజను పరిధికి చెందిన తొమ్మిది మండలాల్లో ఇది ఒకటి.[1] జిల్లా ప్రధాన కేంద్రం సుమారు 60 కి.మీ.దూరంలో ఉంది. పోస్టల్ ప్రధాన కార్యాలయం కొండమల్లేపల్లి పట్టణంలో ఉంది. మండల కేంద్రం కొండమల్లేపల్లి.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 129 చ.కి.మీ. కాగా, జనాభా 32,277. జనాభాలో పురుషులు 16,755 కాగా, స్త్రీల సంఖ్య 15,522. మండలంలో 7,148 గృహాలున్నాయి.[3]
2016 లో ఏ ర్పడిన కొత్త మండలం
[మార్చు]గతంలో కొండమల్లేపల్లి గ్రామం, ఇదే నల్గొండ జిల్లా, దేవరకొండ రెవెన్యూ డివిజను, దేవరకొండ మండలంలో ఉండేది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొండమల్లేపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించి, ఇదే నల్గొండ జిల్లా. దేవరకొండ రెవెన్యూ డివిజను పరిధిలో, దేవరకొండ మండలంలోని 14 (1+13) గ్రామాలను విడగొట్టి ది.11.10.2016 నుండి కొత్త మండలంగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
సమీప మండలాలు
[మార్చు]కొండమల్లేపల్లి మండానికి దక్షిణం వైపు చందంపేట మండలం, తూర్పు వైపు పెద్ద అడిశర్లపల్లి మండలం, పడమటి వైపు గుండ్లపల్లి మండలం, ఉత్తరం వైపు నాంపల్లి మండలం ఉన్నాయి.
సమీప పట్టణాలు
[మార్చు]దేవరకొండ, మాచర్ల, శ్రీశైలం ప్రాజెక్ట్ (రైట్ బాంకు కాలనీ) టౌన్ షిప్,నాగర్‌కర్నూలు కొండా మల్లేపల్లి మండలానికి సమీపంలో ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యం
[మార్చు]రోడ్డు మార్గం
[మార్చు]నల్గొండ పట్టణం కొండా మల్లేపల్లికి సమీప పట్టణం. నల్గొండ జిల్లా ప్రధాన కేంద్రం నుండి కొండా మల్లేపల్లి మండలానికి రోడ్డు అనుసంధానించబడిఉంది,
రైలు మార్గం
[మార్చు]కొండమల్లేపల్లి మండలానికి సమీపంలో 10 కి.మీ. లోపు రైల్వే స్టేషన్ లేదు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అచ్చంపేట్
- ఏపూర్
- కొండమల్లేపల్లి
- కొల్ముంతల్‌పహాడ్
- గాజీనగర్
- గుమ్మడవల్లి
- చింతకుంట్ల
- చిన్నఅదిసెర్లపల్లి
- చెన్నంనేనిపల్లి
- చెన్నారం
- దొనియాల
- పెండ్లిపాకాల
- ఫకీర్‌పూర్
- వర్ధమానిగూడ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nalgonda.pdf
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.