కొరిటాల శేషగిరిరావు
కొరిటాల శేషగిరిరావు, జననం 12.03.1938. తల్లిదండ్రులు మస్తానురావు, నారాయణమ్మ దంపతులు.
శేషగిరిరావు పొనుగుపాడు జిల్లా పరిషత్ హైస్కూలులో యస్.యస్.యల్.సి. మొదటి సంవత్సరం బ్యాచ్ స్కూలు పష్ట్ సాధించాడు. నరసరావుపేట శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదివాడు.ఇతను ఆంధ్ర యూనివర్శిటీ వాల్తేరులో యం.ఎ. కోర్సు చేసి, యం.యస్.సి చేసాడు.
వివాహం, సంతానం.
[మార్చు]గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన తేళ్ళ నాయుడమ్మ, శ్యామలమ్మ దంపతుల కుమార్తె ఇందిరాదేవిని 21.06.1957న వివాహమాడారు.ఈ దంపతుల సంతానం హేమంత కుమార్.చంద్ర శేఖర్. పెద్ద కుమారుడు హేమంతకుమార్ ఇంజనీరుగా,చిన్న కుమారుడు చంద్ర శేఖర్ డాక్టరుగా వృత్తి రీత్యా అమెరికాలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం జడ్జిగా పనిచేసిన జాస్తి ఈశ్వర ప్రసాద్ ద్వితీయ కుమార్తె శశికళను చిన్న కుమారుడు చంద్ర శేఖర్ వివాహమడాడు.
ఉద్యోగ ప్రస్థానం.
[మార్చు]మొదటగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నాగపూర్, డొంగర్గడ్, హేర్గడ్ మరి కొన్ని ప్రాంతాలలోని ప్రభుత్వ కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసరుగా 1961 లో చేరి 1968 వరకు పని చేసాడు.అక్కడ నుండి సొంత రాష్ట్రానికి వచ్చి చిలకలూరిపేట లోని చుండి రంగనాయకులు కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసరుగా చేరి 1969 వరకు పని చేసాడు. ఆ తర్వాత జాగర్లమూడి కుప్పుస్వామి కళాశాల గుంటూరులో మ్యాథ్స్ ప్రొఫెసరుగా చేరి 1984 వరకు పనిచేసాడు. కళాశాల సర్వీసులో శేషగిరిరావు బోర్డు ఆఫ్ స్టడీస్, బోర్డు ఆఫ్ ఎక్జామినర్స్ మెంబరుగా, మ్యాథ్స్ డిపార్టుమెంట్ హెడ్ ఆఫ్ ది చైర్మెన్ గా వ్యవహరించాడు.ఇతను విద్యా సంబంధమైన పలు సెమినార్లులో పాల్గొన్నాడు.
పదవీ విరమణ, ఆ తరువాత జీవిత గమనం.
[మార్చు]జె.కె.సి.కళాశాలలోమ్యాథ్స్ ప్రొఫెసరుగా పనిచేయుచున్న ఇతను 1984లో స్వచ్చంధ పదవీవిరమణ చేసాడు.కుమారులు ఇద్దరూ వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడినందున సతీమణి ఇందిరాదేవితో అమెరికా వెళ్లాడు.అమెరికాలో కంప్యూటరు రంగంపై ఆపేక్షతో చికాగో, ఇల్లినాయిస్ యూనివర్శిటీలో యం.యస్. (కంప్యూటర్ సైన్స్) కోర్సు చేశారు. (1985-1987). ఈ కోర్సుతో మూడు మాష్టర్స్ డిగ్రీలు పొందాడు.
అమెరికాలో “మెట్రోపాలిటిన్ ఇన్సూరెన్స్ కంపెని” చికాగో ఇల్లినాయిస్ లో సిస్టమ్ ఎనలిస్ట్గ్ గా చేసాడు. (1988-1993). అటు తర్వాత మెట్ లైఫ్ చికాగో, ఇల్లినాయిస్ లో పైనాన్షియల్ ప్లానరుగా పని చేసాడు. మెట్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీకి ఉత్తమ నేవలు అందించినందుకు గుర్తించి అమెరికా ఆఫ్ మెట్ లైఫ్ (గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్) నుండి “సర్వీసు రికగ్నేషన్” అవార్డు పొందాడు. చికాగోలో అందించిన సేవలకు గుర్తించి ఆయనను “డీన్స్ లిష్టు ఆఫ్ ది సిటీ కాలేజి ఆఫ్ చికాగో” కు నామినేట్ చేసారు. అమెరికాలో పలు సెమినార్లులో పాల్గొని పలు అవార్డులు పొందాడు. అమెరికాలోని పలు యూనివర్శిటీలలో ఇతను గెష్ట్ లెక్షరర్ గా వ్యవహరించాడు.
ఉద్యోగాలకోసం అమెరికా వెళ్లిన ఎంతోమందికి సరియైన సూచనలు సలహాలు అందచేసి వారు అమెరికాలో ఉద్యోగాలు పొంది ఉన్నతస్థానంలో ఉండటానికి తోడ్పడ్డాడు.యువత భవిత కంప్యూటర్ రంగంతో ముడిపడి ఉంది గ్రహించి,ఇతను స్వంతంగా "యచ్.సి.ఐ' అను పేరిట ఓ సాప్టువేర్ కార్పోరేషన్ ను స్థాపించి అటు అమెరికాలోనూ, ఇటు మాతృదేశంలోనూ ఎందరో సాప్టువేర్ ప్రొఫెసనల్స్ కు మంచి భవిష్యత్తును చూపాడు.
శేషగిరిరావు, ఇందిరాదేవి దంపతులు అమెరికా ట్రై స్టేటు తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆప్ నార్త్ అమెరికా (తానా) సంస్థలలో జీవితకాల సభ్యులు.
సేవా కార్యక్రమాలు
[మార్చు]- అమెరికాలోని ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందించాడు.
- పుట్టిన గడ్డను మరువకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికా వెళ్లకముందు నుంచే శేషగిరిరావు వివిధ సంస్థలద్వారా సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ వంతు సహాయ సహకారాలు అందించాడు. శేషగిరిరావు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్టు చైర్మెన్, డిప్యూటి డిస్ట్రిక్టు గవర్నరు, జోన్ చైర్మెన్ గా చేసాడు. ఆకాలంలో ఉచిత కంటి, పంటి వైద్య శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.
- దేశవ్యాప్తంగా మూడువేల మంది ప్రతినిధులు పాల్గొన్న కొచ్చిన్ సెవన్త్ మల్టిపుల్ డిస్ట్రిక్టు కన్వన్షన్ కార్యక్రమంలో ”స్మార్ట్ లయన్” పురష్కారాని అందుకున్నాడు. స్వదేశంలో నున్న పొరుగువారికి తోడ్పాటు అందించాలనే మంచి మనసుతో 1999లో గుంటూరు బృందావన గార్డెన్సులో కొరిటాల ఇందిర-శేషగిరిరావు (కిస్) పేరుతో చారిటబుల్ ట్రస్టును స్థాపించి,దాని ద్వారా అనేక సవా కార్యక్రమాలు నిర్వహించాడు.
- గుంటూరు (లక్ష్మిపురం) లో గల శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలనందు అదనపు తరగతి గదుల నిర్మాణంనకు పది లక్షల రుపాయలు విరాళం అందచేసాడు. కాకాని వద్దగల శంకర్ నేత్రాలయం హాస్పటల్కు వెయ్యి డాలర్లు, అలాగే గుంటూరు మెడికల్ కాలేజిలోని జింఖానా అడిటోరియంనకు వెయ్యి డాలర్లు విరాళం అందజేసాడు.
- ఎంత ఎత్తుకు ఎదిగినా తాను పుట్టిన గడ్డను మరువక స్వగ్రామం పొనుగుపాడు నందు తాను చదివిన జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటరు ల్యాబ్ నిర్మాణానికి జన్మభూమి పథకం క్రింద మూడు లక్షల అరవై వేల రుపాయలు విరాళం అందజేసి, బిల్డింగు నిర్మాణానికి తోడ్పడ్డాడు.[1] నార్త్ సౌత్ ఫౌండేషన్ రివ్యూ 2003 సంచిక నందు ఈ కంప్యూటరు ల్యాబ్ బిల్డింగును గురించి ప్రస్తావించబడింది.[2]
- ప్రతి సంవత్సరం అర్దికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్ధులకు యాభై వేల రుపాయలు ‘కిష్’ చారిటబుల్ ట్రష్టు ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తాడు. అంతేగాదు ఉచిత కంటి పరిక్ష కేంద్రాలు నిర్వహించి చాలా మందికి ఉచితంగా కళ్ల అద్దాలు అందించాడు.స్వగ్రామం పొనుగుపాడులో తాను చదివిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చదువుకునే పేద విద్యార్థులకు ప్రతి ఆర్దిక సహాయం అందిస్తాడు.
మూలాలు.
[మార్చు]- ↑ ఆంధ్రజ్వోతి,గుంటూరు జిల్లా ఎడిషన్,తేదీ:2011 నవంబర్ 7 పేజీ నెం.9
- ↑ నార్త్ సౌత్ పౌండేషన్ (US) రెవ్యూ-2003 సంచిక పేజీ నెం.17