క్షిపణి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
క్షిపణి అంటే తనంతట తానుగా ఎగరగలిగిన ఒక ఆయుధం. ఇవి రాకెట్ల ద్వారా లేదా జెట్ యంత్రాల ద్వారా పైకి ఎగరగలవు. ఇవి సాధారణంగా విస్ఫోటనం చెందగల వార్ హెడ్లను కలిగి ఉంటాయి.
రెండవ ప్రపంచ యుద్ధం కోసం నాజీలు మొట్టమొదటి సారిగా క్షిపణుల్ని తయారు చేశారు. వీటిలో బాగా ప్రాచుర్యం పొందినవి వి1 ఫ్లైయింగ్ బాంబ్, మరియు వి2 ఫ్లైయింగ్ బాంబ్ . ఇవి యాంత్రికంగా ముందుగా నిర్దేశించబడిన కక్ష్యలో ప్రయాణించేలా రూపకల్పన చేయబడ్డాయి.
నిర్దేశక వ్యవస్థ [మార్చు]
క్షిపణులకు చాలా రకాలుగా గమ్యాలను నిర్దేశించవచ్చు. బాగా వాడుకలో ఉన్న పద్ధతి ఇన్‌ఫ్రారెడ్, లేజర్లు, రేడియో తరంగాలు వాడటం. ఈ తరంగాలు గమ్యం నుంచీ ఉత్పత్తి అవుతుండవచ్చు లేదా క్షిపణిలోనే నిర్మితమై ఉండవచ్చు లేదా మధ్యవర్తుల ద్వారా రావచ్చు.