అగ్ని క్షిపణులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అగ్ని క్షిపణులు భారత రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసిన మధ్యరకం దూరాల నుంచి ఖాండాంతరాలను ఛేదించగల క్షిపణుల శ్రేణి . వీటిని కేంద్రీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు. 2008వ సంవత్సరం నాటికి ఈ శ్రేణిలో మూడు రకాలైన క్షిపణులు అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటి అగ్ని క్షిపణిని 1989 లో చండీపూర్ అనే ప్రాంతంలో పరీక్షించారు.

  1. అగ్ని-1: 500-700 కి.మీ పరిధి.
  2. అగ్ని-2: 2000-3000 కి.మీ పరిధి
  3. అగ్ని-3: 3000-5500 కి.మీ పరిధి: మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది శత్రుదేశాల భూభాగాల లోకి చొచ్చుకు వెళ్లి లక్ష్యాన్ని ఛేదించ గలదు. ఇది ఛేదించగల గరిష్ట గమ్య స్థానం 3000-3500 కి మీల మధ్యలో ఉంటుంది. సంప్రదాయక మరియు అణ్వయుధాలు మోసుకెళ్ల గల సామర్థ్యం దీని సొంతము.

ఈ క్షిపణిని మొదటగ పరీక్షించినది వీలార్ ద్వీపం లో కానీ అది విఫలమైంది. ఆ తరువాత ఏప్రిల్ 12, 2007 న మళ్ళీ పరీక్ష విజయవంతమైంది.


ఇవి కూడా చూడండి[మార్చు]