ఖైదీ (సినిమా)
| ఖైదీ (1983) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
| నిర్మాణం | ఎమ్. తిరుపతి రెడ్డి, ధనంజయరెడ్డి, సుధాకర రెడ్డి |
| కథ | పరుచూరి సోదరులు |
| తారాగణం | చిరంజీవి (సూర్యం), మాధవి (మధులత), రావు గోపాలరావు (వీరబద్రయ్య), సుమలత (డా. సుజాత), నూతన్ ప్రసాద్ (మునసబు), రాళ్ళపల్లి (శర్మ), రంగనాథ్ (పోలీస్ ఇనస్పెక్టర్), పి.ఎల్. నారాయణ (వెంకటేశ్వర్లు), చిడతల అప్పారావు, సంగీత (సూర్యం అక్క), జయమాలిని (ఐటమ్ సాంగ్), సుత్తి వేలు |
| సంగీతం | చక్రవర్తి |
| నేపథ్య గానం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, |
| నృత్యాలు | సలీమ్, తార |
| గీతరచన | వేటూరి, రాజశ్రీ |
| సంభాషణలు | పరుచూరి సోదరులు |
| ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్. స్వామి |
| కూర్పు | వెల్లైస్వామి |
| నిర్మాణ సంస్థ | సంయుక్త మూవీస్ |
| నిడివి | 157 నిముషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా , కోదండరామిరెడ్డి ని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి బ్రదర్స్ ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.
విషయ సూచిక |
[మార్చు] చిత్రకథ
పొలీస్ ఆఫీసరు రంగనాధ్ కు అనుమానాస్పద పరిస్థితుల్లో చిరంజీవి (సూర్యం) ఒక అడ్డరోడ్డు (క్రాస్ రోడ్స్) వద్ద కనిపిస్తాడు. కొండపల్లి వెళ్తానని చెప్పి కోటి పల్లి కి వెళుతున్న అతన్ని సోదా చేసి అతని దగ్గర ఒక కత్తిని చూసి అనుమానంతో స్టేషనుకు తీసుకెళ్తాడు. అక్కడ పోలీసులు అతనిపట్ల నిర్దయగా ఉంటారు. ఒక పోలీసు రేజరు తీసుకు వస్తుండటం చూసి గతాన్ని గుర్తుకు తెచ్చుకుని విచక్షణ కోల్పోయి పోలీసులతో తలపడి అక్కడనుండి పారిపోయి ఒక లేడీ డాక్టరు (సుమలత) ఆశ్రయంపొందుతాడు. ఆమె కు తన గతాన్ని వివరిస్తాడు. గతంలో సూర్యం ఒక చురుకైన విద్యార్థి. ఐ.ఎ.ఎస్. చదవాలని ఆశయం. తండ్రి చిన్న రైతు. విధవరాలైన ఒక అక్క(సంగీత). అదేవూరికి చెందిన వీరభద్రయ్య (రావు గోపాలరావు) కూతురు మాధవి సూర్యంపట్ల ఆకర్షితమౌతుంది. వారిరువురిని మధ్య సాన్నిహిత్యాన్ని గమనించిన మునసబు వీరభద్రయ్య కు చెబుతాడు. వీరభద్రయ్య సూర్యం తండ్రి మరణానికి కారణమౌతాడు. తండ్రి చేసిన అప్పు తీర్చటానికి పొలాన్ని వీరభద్రానికి ఇచ్చేసి ,దానినే కౌలుకి సాగు చేస్తుంటాడు. అందులో పంటను వీరభద్రయ్య తీసుకు పోతాడు. తమ్ముడు అసహాయంగా ఉండటానికి తానే కారణమనుకుని సంగీత ,మునసబు ను పెళ్ళి చేసుకుని ,అతని చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది.ఆసంఘటన హత్యగా చిత్రీకరించి ,నేరాన్ని సూర్యంపై మోపుతారు.వారిపై పగ సాధిస్తానికి సూర్యం ప్రయత్నిస్తున్నాడు. రంగనాథ్ మేనకోడలి (సంయుక్త) సాయంతో సుమలత ఇంటినుండి పోలీసులదాడి ని తప్పించుకున్న సూర్యం అడవి చేరుతాడు. తరువాత సుమలత హత్య , దానిని సూర్యంపై మోపడం, మాధవి సూర్యాన్ని కలవడం, సూర్యం వరసగా ప్రత్యర్ధులపై పగ తీర్చుకోవడం మిగతాకథ.
[మార్చు] సినిమాకథ, కథనం, పోలికలు
1982లో సిల్వెస్టరు స్టాలోన్ చిత్రం "ఫస్ట్ బ్లడ్" విడుదలయ్యింది. చిత్రం ప్రారంభంలో రాంబో(స్టాలోన్) చిన్న పట్నం పొలిమేరల్లో బ్రిడ్జ్ పై వస్తుంటాడు. అతన్ని చూసిన పట్టణ షరీఫ్ వివరాలడుగుతాడు. తర్వాత వెనక్కి వచ్చి అతన్ని సోదా చేసి కత్తిని కనుగొంటాడు. అది ఎందుకుఅని అడిగితే రాంబో వేట కోసం అని చెబుతాడు. షరీఫ్ అతనిని పోలీసు స్టేషనుకు తీసుకెళతాడు. అక్కడ పోలీసులు అతనితో అమానుషంగా వ్యవహరిస్తారు. రేజరుతో అతన్ని సమీపిస్తున్న పోలీసుని చూసి గతంలో వియత్నాం యుద్ధం లో సంఘటనల్ని గుర్తుచేసుకుని తిరగబడతాడు. అతను గతంలో వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అది పూర్తయిన తరువాత అతనికి సరైన గుర్తింపు లభించలేదు. స్నేహితుడు గురించి విచారించగా చనిపోయాడని విధవ ఐన అతని భార్యద్వారా తెలుసుకున్నాడు. ఈ చిత్రభాగాలు ఖైదీ చిత్రంలో కొద్దిమార్పులతో కనిపిస్తాయి. మిగతా చిత్రంలో కూడా కథానాయకుని ఆహార్యం , రెండవభాగంలో అడవిలో సంఘటనలు ఫస్ట్ బ్లడ్ ను పోలిఉంటాయి.
[మార్చు] మిగతాభాషల్లో
ఖైదీ చిత్ర అపూర్వవిజయం ఈ చిత్రాన్ని మిగతాభాషల్లో నిర్మాణానికి కారణమయ్యింది. కన్నడంలో విష్ణువర్ధన్ హీరో గానూ, హిందీ లో జీతెంద్ర హీరో గానూ నిర్మించబడింది. హిందీ లో ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ నిర్మించింది. మూడు భాషల్లోనూ కథానాయికగా మాధవి నటించడం విశేషం.
[మార్చు] పాటలు
- రగులుతుంది మొగలిపొద
- ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా
- గోరంటా పూసింది గొరవంక కూసింది
