గంగరాజు డెయిరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోదావరి తీరం ఆతిధ్యానికి పెట్టింది పేరు. పాడిపంటలకు కొదవలేదు. అటువంటి గోదావరి తీరాన రాజమండ్రి లో ఆతిధ్యం తో కూడిన పాల కేంద్రం అరవై ఏళ్లకు ఫైగా సేవలందిస్తూ, పాల ఉత్పత్తుల కేంద్రంగా వర్ధిల్లుతోంది.

మూడు తరాలుగా[మార్చు]

మూడు తరాలుగా సాగుతున్న ఈ వ్యాపారం ఇప్పుడు గంగరాజు కుమారుడు గోవింద్ నిర్వహణలో 'గంగరాజు డెయిరీ' పాలు - పాల ఉత్పత్తులతో మూడు తరాల ఈ కుటుంబ పరిశ్రమ గంగరాజు డైరీ గా బలమైన పునాది వేసుకుంది. ముఖ్యంగా పాలకోవా తింటే ఇక్కడే తినాలి అనే మాట అందరి నోటా విన్పిస్తుంది. ‘గంగరాజు పాల ఖ్యాతి’ని దేశ విదేశాలకు గొవింద్ విస్తరింప జేసారు.

పాల సేకరణ ఇలా[మార్చు]

పశ్చిమగోదావరి జిల్లా పశివేదల గ్రామంలో నిమ్మలపూడి వీరన్న అనే రైతు ఇతర ప్రాంతాల నుంచి పాలు సేకరించి విక్రయించేవారు.1950లో వీరన్న ప్రారంభించిన పాల వ్యాపారాన్ని, ఆయన కుమారుడు గంగరాజు తన 24వ ఏట రాజమండ్రి కి విస్తరించారు. వీరన్నగారు పాలసేకరణ పరిమాణం పెంచుతూ పోవడంతో పాలు మిగిలిపోయేవి. దీంతో రాజమండ్రిలో కూడా పాలు అమ్మేవారు గంగరాజు గారు.

రాజమహేంద్రవరానికి మకాం[మార్చు]

ఆవిధంగా వీరన్నగారు పశివేదలలో ఉండగానే గంగరాజు గారు రాజమండ్రి ఇన్నీసుపేటలోని త్యాగరాజనగర్‌కు మకాం మార్చారు. అప్పుడప్పుడే విస్తరిస్తున్న హోటళ్లకు... పశివేదల, ఉంగుటూరు పరిసర గ్రామాల నుంచి పాలను సేకరించి రాజమండ్రిలో విక్రయించేవారు. ఆయన పాలు తేకపోతే ఆ రోజు అక్కడి హోటళ్లు ఇంక బందే అన్నట్లు ఉండేదట. విజయవాడ నుంచి రాజమండ్రికి ఉదయం పూట ప్యాసింజరు రైలు నడిచేది. రోజూ ఇదే రైలులో పాలను బిందెలతో రాజమండ్రికి తెచ్చేవారు. పశ్చిమగోదావరి నుంచి పాలు అమ్మేందుకు ఇదే రైల్లో మరికొందరు రాజమండ్రి వచ్చేవారు. దీంతో అందరూ ఆ రైలును పాల బండి అని పిలిచేవారు.

డైరీ వృద్ధి చెందిందిలా[మార్చు]

ఇక వీరన్న గారు పంపిన పాలు హోటళ్లకు పోయగా మిగిలిన పాలను ఇంటి దగ్గర కొన్ని అమ్మి, మరికొన్ని పాలను పెరుగుగా చేసి విక్రయించేవారు. అలా గంగరాజు డైరీ వృద్ధి చెందింది. గంగరాజు పాలకోవా అమెరికా, లండన్, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి సుపరిచితం. ఫోన్‌లో ఆర్డర్ ఇచ్చి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపితే వాళ్లు సూచించిన వారికి డెలివరీ ఇస్తారు. ఈమెయిలు కి ఆర్డర్లు వస్తుంటాయి.

ఎప్పుడు వెళ్లినా పాలు దొరికేవని[మార్చు]

ఆరోజుల్లో పాలకోసం అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ఎప్పుడు వెళ్ళినా అందుబాటులో వుండే కేంద్రంగా ఇది ప్రసిద్ధి కెక్కింది. ఆప్యాయంగా పలకరిస్తూ, సేవా దృక్పధం జోడించి సాగించే పాల వ్యాపారానికి నిలువెత్తు నిదర్శనమైంది. నిర్వాహకుని ఇంటిపేరు కూడా పాలతో జోడించి, పాల గంగరాజుగా వ్యవహారంలోకి వచ్చేశారు. ఆయన తరవాతి తరం కూడా అదే పేరుతో అ వ్యాపారాన్ని అందిపుచ్చుకుని, నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

లీటరు 30 పైసల రేటుతో పాల సేకరణ[మార్చు]

ఆరోజుల్లో లీటరు 30 పైసల రేటుతో పాల సేకరణ మొదలైంది. ‘ఎన్ని పాలు విక్రయించినా, ఇంకా పదిహేను లీటర్ల పాలు మిగిలిపోయేవి. మా అమ్మ సత్యవతి అలా మిగిలిన పాలతో కోవా చేసేవారు. ఇంటి ముందే వాటిని అమ్మేవారు. అమ్మ చేతి ఆ స్వచ్ఛమైన పాలకోవా గంగరాజు డెయిరీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ విదేశాల్లో ఉండే భారతీయులు 'కోవా' పోస్టు ద్వారా రప్పించుకుంటున్నారంటే అది అమ్మ చేసిన కమ్మని పాలకోవా మహిమే’ అని సంబరపడుతూ గోవింద్ చెబుతారు.

కోవాతోపాటు[మార్చు]

రాజమండ్రి త్యాగరాజ నగర్ లోని ఓ వీధిలోకి అడుగు పెడుతుండగానే ఆమడ దూరం నుంచే కమ్మటి వాసనలు తాకుతాయి. అడుగులు అటే పడతాయి. ఆ ఇంటి ముందు బారులు తీరిన జనం కనిపిస్తారు. గంగరాజు డైరీలో పాలు, పెరుగుతోపాటు పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది. ఇవే కాకుండా నెయ్యి,వెన్న,పన్నీరు, పచ్చి కోవా, పూతరేకులు, సున్నుండలు కూడా తయారు చేస్తారు. ఎవరేది అడిగినా, వెంటనే అందజేయడం ఇక్కడి ప్రత్యేకత. 'తింటే గారెలు తినాలి - వింటే భారతం వినాలి' అనే నానుడిలో గంగరాజు డైరీ పాలకోవా చేర్చడంలో అతిశయోక్తిలేదు.

అక్కినేని ఎంతో ఇష్టపడేవారు[మార్చు]

ఎవర్ గ్రీన్అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు రాజమహేంద్రవరం వచ్చినా గంగరాజు కోవా కోసం కబురు పెట్టేవారట. అంతేకాదు, తరచూ హైదరాబాద్ కి కోవా తెప్పించుకునే వారట. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్వంటి ప్రముఖులెందరో, గంగరాజు పాలకోవా రుచి చూసిన వారే. ఇప్పటికీ తెలుగు , తమిళం భాషలలోని పలువురి సినీ తారలకు ఇక్కడి నుంచే పాలకోవా వెడుతుంది. ఇక గోవింద్ కి అత్యంత మిత్రుడు, జేసీస్ సంస్థతో అనుబంధం ఉన్న సినీ-టివి నటుడు-యాంకర్ ప్రదీప్కి గంగరాజు డెయిరీ కోవా అంటే చెప్పలేనంత ఇష్టం. అధికారులు, ప్రముఖులు గంగరాజు డైయిరీ నుంచి కోవా తీసుకెళుతుంటారు. నాణ్యత, నమ్మకానికి నిలువుటద్దంగా గంగరాజు డెయిరీ భాసిల్లుతోంది.

సేవా , ఆధ్యాత్మిక రంగాల్లో[మార్చు]

వ్యాపార వేత్తగా రాణిస్తూ,జేసీఐ సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, పలు సేవా సంస్థలలో పనిచేస్తూ, అందరి తలలో నాలుకగా వుంటున్నారు. గోవింద్ అన్నయ్య నిమ్మలపూడి వీర్రాజు శ్రీరామ భక్త గానసభ పేరిట చాలా ఏళ్ళ నుంచి, శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తూ, లబ్ద ప్రతిస్తులైన సంగీత విద్వాంసులను రప్పించి, కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ, నగరానికి తలమానికంగా నిలిచారు.

మూలాలు:[1]

ఇతర లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రాజమహెంద్రవరంలో బాగా నచ్చింది పాల గంగరాజు కోవా: సినీనటి రకుల్ ప్రీత్ సింగ్,గంగరాజు పాలు గరిటెడైనను చాలు (సాక్షి దినపత్రిక), http://gangarajudairy.in/media/ Archived 2016-10-29 at the Wayback Machine