గిబ్బన్

వికీపీడియా నుండి

గిబ్బన్లు[1][2]
శిలాజ విస్తృతి: మూస:Fossil range
Lar Gibbon (Hylobates lar)
Lar Gibbon (Hylobates lar)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: ప్రైమేట్స్
Superfamily: హోమోనాయిడియా
కుటుంబము: హైలోబాటిడే
గ్రే, 1870
ప్రజాతులు
హైలోబాట్స్
హూలక్
నొమాస్కస్
సింఫాలాంగస్

గిబ్బన్లు (Gibbons) హైలోబాటిడే కుటుంబానికి చెందిన చిన్న ఏప్స్. ఇందులో డిప్లాయిడ్ క్రోమోజోమ్ సంఖ్య ఆధారంగా నాలుగు ప్రజాతులు ఉన్నాయి: హైలోబాట్స్ (44), హూలక్ (38), నొమాస్కస్ (52), మరియు సింఫాలాంగస్ (50).[2][3] గిబ్బన్లు ఉష్ణ మండల ప్రాంతాలలో భారతదేశం నుండి ఇండోనేషియా వరకు చైనా నుండి సుమత్రా, బోర్నియో మరియు జావా దీవులలో వ్యాపించి ఉన్నాయి.

గిబ్బన్లను 'చిన్న ఏప్స్' అని కూడా అంటారు. ఇవి పెద్ద ఏప్స్ (చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు మరియు మనుషులు) తో విభేధిస్తాయి. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి, జతలుగా తిరుగుతాయి మరియు ఇల్లు కట్టుకోవు. వీటి శరీర నిర్మాణం కొంతవరకు కోతులకు దగ్గరగా ఉంటుంది. గిబ్బన్లు ప్రధానంగా బలమైన పొడుగైన చేతులతో ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు ఊగుతూ చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అంతేకాకుండా చేతులు పైకెత్తి రెండు కాళ్ళమీద నడవగలుగుతాయి. చెట్లమీద నివసించే ఎగరలేని క్షీరదాలన్నింటి కంటే ఇవి వేగంగా ప్రయాణించగలవు.[4] ప్రజాతి మరియు లైంగిక స్థితిని బట్టి వీటి తోలు లేత గోధుమ రంగు నుండి నలుపు రంగు మధ్యలో ఉంటాయి.

[మార్చు] వర్గీకరణ

Hominoid family tree

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 మూస:MSW3 Groves
  2. 2.0 2.1 Mootnick, A.; Groves, C. P. (2005). "A new generic name for the hoolock gibbon (Hylobatidae)". International Journal of Primatology 26 (26): 971–976. DOI:10.1007/s10764-005-5332-4. 
  3. 3.0 3.1 Geissmann, Thomas (December 1995). "Gibbon systematics and species identification" (PDF). International Zoo News 42: 467–501. Retrieved on 2008-08-15. 
  4. David Attenborough, Life of Mammals, Episode 8: Life in the Trees. BBC Warner, 2003.
పేజీకి సంభందించిన లింకులు