చందు (దర్శకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందు
ప్రేమ ఒక మైకం సినిమా పాటల విడుదల కార్యక్రమంలో చందు
జననం
సత్తి చంద్రశేఖర్ రెడ్డి

అక్టోబరు 17, 1975
విద్యఐటిఐ డిప్లోమా
బిరుదుదర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత
వెబ్‌సైటుwww.filmdirectorchandu.com

చందు (సత్తి చంద్రశేఖర్ రెడ్డి) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.

జీవిత విషయాలు[మార్చు]

చందు 1975, అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని వెదురుపాక గ్రామంలో జన్మించాడు. రాజమండ్రిలోని సెయింట్స్, ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.

సినిమారంగం[మార్చు]

2003లో రాంప్రాసాద్ దర్శకత్వం వహించిన కళ్యాణ రాముడు, 2004లో వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన సాంబ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమారంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన టెన్త్ క్లాస్ సినిమాకు చందు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఇది 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత 2007లో నోట్ బుక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఒక మైకం సినిమాకి దర్శకత్వం వహించాడు.[2]

సినిమాలు[మార్చు]

దర్శకుడిగా
అసిస్టెంట్ డైరెక్టర్‌గా

మూలాలు[మార్చు]

  1. "10th class - audio function - Telugu Cinema - Bharat & Saranya". www.idlebrain.com. Archived from the original on 28 February 2017. Retrieved 2 April 2018.
  2. "'Prema Oka Maikam' Review: It's Like Hell". greatandhra.com. Archived from the original on 3 August 2016.
  3. "10th Class press meet - Telugu Cinema - Gowtam & saranya". www.idlebrain.com. Archived from the original on 24 September 2015. Retrieved 2 April 2018.