చర్చ:అబిచెర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమూనా వ్యాసంగా పరిశీలించండి[మార్చు]

రమణ గారూ ఈ వ్యాసాన్ని ఓమారు పరిశీలించి చూడండి. గ్రామం స్థితిగతులు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. సమాచారం ఇలా బాగానే ఉందా? --పవన్ సంతోష్ (చర్చ) 17:13, 21 ఆగష్టు 2016 (UTC)

నా వరకు భేషుగ్గా ఉంది. --రవిచంద్ర (చర్చ) 17:16, 21 ఆగష్టు 2016 (UTC)
excelent information.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:28, 21 ఆగష్టు 2016 (UTC)
ఈ వ్యాసంలో తాగునీరు విభాగంలో "గ్రామస్తులకు చేతిపంపుల నీరు, చెరువు నీరు అందుబాటులో ఉంది" అని ఉండగా నీటిపారుదల సౌకర్యాలు విభాగంలో "గొట్టపు బావులు, చెరువులు వంటి జల వనరులు గ్రామానికి లేవు" అని ఉంది. ఏది సరైనది? చేర్చడంలో పొరపాటా? సమాచారం పొరపాటా? లేదా చెరువు నీటిని, బోరింగ్ నీటిని కేవలం త్రాగడానికే ఉపయోస్తున్నారని పరోక్షంగా అనుకోవాలా? సి. చంద్ర కాంత రావు- చర్చ 20:14, 21 ఆగష్టు 2016 (UTC)
నేను అనుకుంటున్నది గ్రామస్తులకు చేతిపంపుల నీరు లేదా చెరువు నీరు తాగడానికి ఉంది. ఇక్కడ గ్రామస్తులకు చేతిపంపు నీరు మాత్రమే తాగుతుండవచ్చు. కానీ దీన్ని సమాచార సేకరణలో ఈ రెండూ కలిపి ఒకే అంశం కింద ఇచ్చి ఉండవచ్చు. అంటే చేతిపంపుల నీరు/చెరువు నీరు - టిక్కు పెట్టేందుకు ఒక బాక్సు. దాన్ని ఉపయోగించి బాటు సృష్టించే వాక్యం ఇలాగే ఉంటుంది. నేను వాళ్ళతో డైరెక్టుగా సంప్రదించలేదు. కానే పవన్ వారి నుంచి సరైన సమాచారం రాబట్టగలడనుకుంటున్నాను. --రవిచంద్ర (చర్చ) 20:24, 21 ఆగష్టు 2016 (UTC)
అసలు ఈ కూనవరం మండలపు గ్రామం ఇంకా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనే ఉందా? మనం ఎప్పటికప్పుడు తాజాకరణ చేయడం లేము కాబట్టి ఇలాంటి పొరపాట్లు కనిపిస్తున్నాయి. అలాగే పారిశుద్ధ్యం గురించి ఐదేళ్ళ క్రితం నాటి సమాచారం ఇప్పటి గ్రామపరిస్థితులకు సరిపోవనుకుంటాను. ఇటీవలి కాలంలో ముఖ్యంగా స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా చాలా గ్రామాలలో పారిశుద్ధం మెరుగుపడింది. వ్యక్తిగత మరుగుదొడ్లు లేదా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇతర అంశాలు కూడా మార్పులకు గురై ఉండవచ్చు కాబట్టి ఇలాంటి పాతసమాచారం చేర్చేటప్పుడు ఆలోచించాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:36, 21 ఆగష్టు 2016 (UTC)
సమాచారం పాతదే కావచ్చు. మూలాలలో 2011 గణాంకాలు అని చూపిస్తున్నాం. అంటే 2011 ప్రకారం ఆ సౌకర్యాలు ఉన్నాయి అనడంలో తప్పు లేదు అని నేననుకుంటూన్నాను. ప్రభుత్వం వారు కొత్త గణాంకాలు విడుదల చేసినప్పుడు మళ్ళీ వాటిని సరిదిద్దక తప్పదు. లేకపోతే వార్తా పత్రికలను ఆధారంగా చేసుకుని కొత్త సౌకర్యాలు ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే తాజాకరించవచ్చు. అప్పటి దాకా ఈ వ్యాసాలు అలా చిన్నవిగా ఉండటం కన్నా పాత సమాచారం ఉంటే పరవాలేదు అని అనుకుంటున్నాను. సమాచారం తాజాకరణ అనేది కేవలం గ్రామ వ్యాసాలకే కాదు. అన్ని వ్యాసాలకీ వర్తిస్తుంది. --రవిచంద్ర (చర్చ) 20:44, 21 ఆగష్టు 2016 (UTC)
  • చంద్రకాంతరావు గారూ మీరన్నది రైటే. త్రాగునీటి కోసం చేతి పంపులు, చెరువు నీరు వాడుతున్నారు. కానీ వ్యవసాయావసరాలకు ఆ రకమైన నీటి ఆకరాలు లేవు. ఆ అంశాన్ని మరికొంత స్పష్టం చేసివుండాల్సింది. ఇప్పుడే వ్యవసాయ నీటి పారుదల సౌకర్యాలు అని మార్చాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 04:57, 22 ఆగష్టు 2016 (UTC)